విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం: స్టైరీన్ ప్రభావం పర్యావరణంపై ఎంత కాలం ఉంటుంది?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
విశాఖ గ్యాస్ ప్రభావం పర్యావరణంపై ఎంత కాలం ఉంటుంది? స్టైరీన్ ప్రమాదకరం కాదని, దాని ప్రభావం ఎక్కువ కాలం ఉండదనే వాదన ఒకవైపు, స్టైరీన్ ప్రమాదం సుదీర్ఘ కాలం ఉంటుందన్న వాదన మరోవైపు వినిపిస్తున్న వేళ.. ఏది నిజం?
గ్యాస్ ప్రమాదం తరువాత అక్కడి చెట్లు మాడిపోయాయి. జంతువులు చనిపోయాయి. నీరు కలుషితం అయిందన్న అనుమానాలు మొదలయ్యాయి.
విచిత్రమైన విషయం ఏంటంటే, చెట్లు పూర్తిగా కాకుండా ఆ గాలి తగిలినంత మేరకే దెబ్బతిన్నాయి. పెద్ద చెట్టు పైభాగం పచ్చగా ఉంటే, మొదలు నుంచి 10-12 అడగుల వరకూ మాత్రం మాడిపోయింది. ఇక అది ఎంత ప్రభావం చూపిందంటే అరటి చెట్టుకు కాసిన గెలలోని పండ్లను పట్టుకుని చూస్తే, అరటి పళ్లు కాస్తా రాయిలా మారిపోయాయి.

విషపు గాలి వీచిన మొదట్లో అయితే అది అసలు స్టైరీనేనా లేకపోతే వేరే రసాయనం కలిసిందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అయింది. ఎందుకంటే స్టైరీన్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటన, ఆ మాటకొస్తే స్టైరీన్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగిన ఘటన ప్రపంచంలోనే ఇదే మొదటిది అని చెబుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు.
"స్టైరీన్ తప్ప ఏమీ లేదు. స్టైరీన్ గాలిలో వదిలేస్తే, పాలిమరైజ్ అయి ప్లాస్టిక్‌లా తయారవుతుంది. ప్లాస్టిక్‌లా అది వాతావరణంలో పడి ఉంటుంది" అన్నారు ఎన్జీటీ బృందంలోని ఒక శాస్త్రవేత్త.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్జీటీ బృందంలోని మరో శాస్త్రవేత్త కూడా ఇదే అభిప్రాయం చెప్పారు.
"అందరూ గ్యాస్ అని పిలుస్తున్నారు. అది గ్యాస్ కాదు. వేపర్ (ఆవిరి). అక్కడ ఉన్నది కూడా సీ8హెచ్8 రసాయన మిశ్రమంగా ఉన్న స్టైరీన్ మాత్రమే. నిజానికి చాలా రసాయనాలతో పోలిస్తే స్టైరీన్ చాలా తక్కువ తీవ్రత కలిగినది. లిక్విడ్‌గా ఉంటుంది. వేడి పెరిగే కొద్దీ వేపర్ అయి ఆ ఫ్యూమ్స్ గాలిలో కలిస్తే స్టైరీన్ ఆక్సైడ్ అవుతుంది. అది ప్రమాదం. ఈ ప్రమాదంలో బహుశా, స్టైరీన్ గాలిలోని ఆక్సిజన్‌తో కలసి, స్టైరీన్ డయాక్సైడ్ అయి ఉంటుంది అనుకుంటున్నా" అన్నారాయన.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఇక స్టైరీన్ పర్యావరణంపై ఎంత కాలం ప్రభావం చూపుతుందన్న విషయంలో ఇంకా ఒక పూర్తి, సమగ్ర నిర్ధరణకు రాలేదు శాస్త్రవేత్తలు. కానీ ప్రాథమిక అంచనా ప్రకారం, పర్యావరణంపై ఈ ప్రభావం మరీ అంత తీవ్రంగా ఉండదని భావిస్తున్నారు.
"ఇది గాలి కంటే బరువైనది. దీని మాలిక్యులర్ వెయిట్ 104 కాగా, గాలి బరువు 28.95 మాత్రమే. దీంతో ఇది వాతావరణంలోని గాలిలో నిలబడదు. వెంటనే కిందకు దిగిపోతుంది. అందుకే చెట్లు మొదటి భాగాలు ఎండిపోయాయి కానీ, పైభాగాలకు ఏమీ కాలేదు. స్టెరీన్ కింద సెటిల్ అయిపోతుంది కాబట్టి గాలిలో ఉండదు" అన్నారు నాగపూర్‌లోని సీఎస్ఐఆర్ జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (నీరి) శాస్త్రవేత్త ఒకరు.

"అయితే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న బృందం మాత్రం, పూర్తి నిర్ధరణకు రాకుండా ఇక్కడి వస్తువులు, పదార్థాలను వాడటం మంచిది కాదని భావించింది. అందువల్లే, కొంత కాలం పాటు అక్కడి పంటలు, నీరు ఉపయోగించవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య" అని వివరించారు ఆ బృందంలోని ఒకరు.
"స్టైరెన్ భూమి మీద పడితే మైక్రోఫైన్ ప్లాస్టిక్‌గా పలుచని పొరలా ఏర్పడుతుంది. నీటి మీద కూడా అంతే, పాలిమర్ క్లస్టర్స్ మాదిరిగా తయారు అవుతుంది. కాకపోతే ఇది నీటిలో కరగదు, మునగదు. కేవలం నీటిపై తేలుతుంది. కానీ అలా నీటిపై పడిన దాన్ని ఎలా తీయాలన్నది ఇక్కడ సమస్య. దీనిపై ఇంకా పరిశీలన జరగాలి" అన్నారు బృందంలోని శాస్త్రవేత్త.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇప్పటికే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి సరఫరా ఆపించేసిన బృందం ఇప్పుడు ఆ ప్రాంతంలోని బావుల్లోని నీటిని పరిశీలిస్తోంది. అంతేకాదు, అక్కడ చెట్లకు పండిన కాయల్ని తీసుకున్నారు. రాళ్లలా మారిపోయిన అరటి పండ్లనూ సేకరించారు. వాటిలో అవశేషాలు ఎంత ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి వంటి వాటిని పరిశీలిస్తారు.
పశువులపై ఈ గాలి ప్రభావం కూడా ఇప్పటి వరకూ తేలలేదు. అందుకే ముందు జాగ్రత్తగా వాటి పాలు, మాంసం వాడవద్దని శాస్త్రవేత్తలు కోరారు.
అయితే భూమిపై పడ్డ స్టైరీన్ అవశేషాలు తొలగించాల్సిన అవసరం ఉండదంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రకృతిలో సహజంగా జరిగే చర్యల వల్ల అది కరిగిపోతుందని చెబుతున్నారు.
"ప్రకృతిలో మైక్రో ఆర్గానిజం ఉంటుంది. అదే దీన్ని కన్జ్యూమ్ చేస్తుంది, మెటబాలైజ్, సింథసైజ్ అవుతుంది" అని నీరి శాస్త్రవేత్త తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భోపాల్ ఘటనతో పోలిక
భోపాల్ దుర్ఘటన ప్రభావం చాలా కాలం ఉంది. అక్కడ మరణాల శాతం ఎక్కువ. కానీ భోపాల్‌తో విశాఖ ఘటనను పోల్చలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
"భోపాల్‌లో మిథేల్ ఐసో సైనేట్ లీక్ అయింది. ఇది చాలా ప్రమాదకరం. హైలీ టాక్సిక్. కానీ స్టైరీన్ బాగా రియాక్టివ్. ఇది కూడా ప్రాణాంతకమే, కానీ భోపాల్ ఘటలో గ్యాస్ అంత కాదు. స్టైరీన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే, 700 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) దాటితే అప్పుడు ఐడీఎల్ఎఫ్ (ఇమ్మీడియెట్ డేంజర్ టు లైఫ్ అండ్ హెల్త్ అంటే... ప్రాణాలకు, ఆరోగ్యానికీ తక్షణ అపాయం) అవుతుందని మెటీరియల్ డాటా షీట్లో ఎప్పుడో రాసి ఉంది" అని ఓ శాస్త్రవేత్త తెలిపారు.
"మిగతా పరిష్కారాల గురించి మాట్లాడే ముందు, ఒకటి జరగాలి. విదేశాల్లోలాగా, రసాయన పరిశ్రమలున్న చోట, వారు ఏం నిల్వ చేస్తారు? పొరపాటున అది బయటకు వస్తే ఏం చేయాలి? అనే దానిపై గ్రామస్తులందరికీ అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగితే వెంటనే ఎవరు ఏం చేయాలి? ఎలా స్పందించాలి? అనే ప్లాన్ ఉండాలి. అది ఆ గ్రామాల వారందరికీ నేర్పాలి" అని అభిప్రాయపడ్డారు మరో శాస్త్రవేత్త.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
ఇవి కూడా చదవండి.
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- వైజాగ్ గ్యాస్ లీక్: ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? దర్యాప్తు నివేదిక ఎప్పుడు వస్తుంది?
- కరోనావైరస్: ‘ఈ సంక్షోభంలో ఖండాలు దాటుతూ చేసిన ప్రయాణాలు నాకు ఏం నేర్పాయంటే...’ - బ్లాగ్
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా?
- కరోనావైరస్ రోగులకు చికిత్స అందించే ఓ నర్సు, ఆమె కుమారుడు.. ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








