డియాగో తాబేలు: వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి

ఫొటో సోర్స్, Getty Images
తన జాతి అంతరించిపోకుండా కాపాడడంలో భాగంగా తిరుగులేని సంభోగ తృష్ణతో సుదీర్ఘ కాలం లైంగిక సేవలందించిన భారీ గెలపాగో మగ తాబేలుకు అధికారికంగా విశ్రాంతి కల్పించారు.
దీంతో డియాగో అనే ఆ భారీ తాబేలు, మరో 14 మగ తాబేళ్లను వాటి స్వస్థలమైన ఈక్వెడార్ సమీపంలోని గలాపాగో దీవుల్లోని ఎస్పన్నోల దీవికి తరలించారు.
వందేళ్ల వయసు..
చాలాకాలంగా ఈ 15 మగ తాబేళ్లను శాంతా క్రజ్ దీవుల్లో బంధించి గలాపాగోస్ జాతి తాబేళ్ల సంతతి వృద్ధి కోసం ఉపయోగించారు.
అంతరించిపోతున్న గలాపాగోస్ తాబేళ్లను కాపాడేందుకు 1960ల్లో ఈ సంతానోత్పత్తి కార్యక్రమం ప్రారంభించారు.
దీంతో ఇప్పటివరకు వేలాది తాబేళ్లు జన్మించగా ప్రస్తుతం అందులో సుమారు 2000 బతికి ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సంతానోత్పత్తికి ఉపయోగించిన ఆ 15 భారీ మగ తాబేళ్లను ఇప్పుడు తిరిగి ఎస్పన్నోలకు తెచ్చి అక్కడి పచ్చిక బయళ్లలో విడిచిపెట్టారు.
రిటైర్మెంట్ తీసుకున్న తాబేలు డియాగో వయసు 100 ఏళ్లు.

ఫొటో సోర్స్, Reuters
40 శాతం దాని సంతానమే
ప్రస్తుతం బతికి ఉన్న 2 వేల గలాపాగోస్ తాబేళ్లలో 40 శాతం డియాగోకు పుట్టినవేనట.
చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని ముగిస్తున్నామని ఈ సంతానోత్పత్తి కార్యక్రమం గురించి ఈక్వడార్ పర్యావరణ మంత్రి పావ్లో ఆండ్రడ అన్నారు.
కాగా డియాగో, మిగతా మగ తాబేళ్లను ఎలాంటి ఆవాసాలు లేని ఎస్పన్నోల దీవిలో విడిచిపెట్టడానికి ముందు కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.
ఇంతకాలం శాంతాక్రజ్ దీవిలో ఉన్న ఇవి అక్కడ తిన్న ఆహారంలోని గింజలను ఎస్పనాలో దీవికి తేకుండా ఉండేందుకే ఈ క్వారంటైన్.
ఎస్పనాలో దీవికి బయట నుంచి ఎలాంటి వృక్ష జాతులు కూడా చేరి అక్కడి సహజత్వం దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

50 ఏళ్లకు పైగా సంతానోత్పత్తి కార్యక్రమంలోనే..
50 ఏళ్ల కిందట ఎస్పనాలాలో కేవలం రెండు మగ, 12 ఆడ గెలపాగో తాబేళ్లుండేవి.
దీంతో ఆ జాతిని కాపాడేందుకు గాను శాన్ డియాగో జూ నుంచి డియాగో, కెలోనోయిడెస్‌లను సంతానోత్పత్తి కోసం తీసుకొచ్చారు.
డియాగో ఒకప్పుడు ఎస్పన్నోలలోనే ఉండేదని.. 20వ శతాబ్దం తొలినాళ్లలో దాన్ని శాస్త్రీయ యాత్రలో భాగంగా శాన్ డియాగో జూకు తరలించి ఉంటారని గెలాపాగోస్ నేషనల్ పార్క్ సర్వీసె అధికారులు భావిస్తున్నారు.
డియాగో తాబేలు బరువు సుమారు 80 కేజీలు. సుమారు 3 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంటుంది.

గలాపాగోస్ దీవులు ఎక్కడున్నాయి?
ఈక్వెడార్‌కు పశ్చిమంగా 906 కిలోమీటర్ల దూరంలో ఈ గలాపాగోస్ దీవులున్నాయి.
ఇంకెక్కడా లేని అరుదైన వృక్ష, జంతు జాతులకు నిలయమైన ఈ దీవులను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.
అక్కడి జీవ వైవిధ్యాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు వస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








