కరోనావైరస్: కోవిడ్-19 చికిత్సకు మందు కనుగొంటున్న హైదరాబాద్ ఐఐసీటీ.. టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో త్వరలో మార్కెట్లోకి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Reuters
మానవాళి మనుగడకే సవాలు విసురుతూ.. ప్రపంచమంతటా మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే ఔషధం తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు మొదలయ్యాయని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి.
ఈ పరిశోధనలకు తగిన సహకారం అందించేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సిప్లా ముందుకొచ్చింది.
ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చిన కొన్ని డ్రగ్స్ సాయంతో ఔషధం తయారీకి ప్రయత్నిస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
పదిమంది శాస్త్రవేత్తలు, మరో 30 మంది నిపుణులు ఈ పనిలో నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు ఔషధాలను తయారుచేసిన ఐఐసీటీ ఈసారి కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది.
ఫెవిపిరవిల్, రెమిడిసవిర్, టెలాక్సివిర్ అనే డ్రగ్స్ కరోనాకు విరుగుడుగా పనిచేయవచ్చని ఐఐసీటీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది.
ఈ డ్రగ్స్‌పై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అయితే మార్కెట్లో వీటి అవసరం రాకపోవడంతో వాటి ఉత్పత్తిని ప్రారంభించలేదు.
ఈ డ్రగ్స్ పారిశ్రామిక స్థాయిలో టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో తయారుచేసి ఎటువంటి షరతులు లేకుండా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిప్లా సిద్ధమవుతున్నది.
నాలుగు నెలల్లోగా ఔషధాన్ని విడుదల చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చంద్రశేఖర్ 'నమస్తే తెలంగాణ'కు తెలిపారు.
రెండు షిఫ్టుల్లో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు. తాము ఔషధాన్ని తయారుచేసి సిప్లాకు అందిస్తామని, ఆ సంస్థ భారీస్థాయిలో వాటిని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిత్యావసరాలపై బెంగవద్దు.. ఆంక్షలు, మినహాయింపులపై కేంద్రం స్పష్టత
21 రోజుల పాటు దేశం లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రకటన చేసిన అనంతరం కేంద్ర హోం శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీచేసిందని సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
లాక్ డౌన్ వర్తించేవి:
1. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ కార్పొరేషన్ సంస్థలు మూసి ఉంటాయి.
ఇందులో మినహాయింపు వర్తించేవి:
- రక్షణ శాఖ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ట్రెజరీ, పబ్లిక్ యుటిలిటీస్(పెట్రోలియం, సీఎన్‌జీ, ఎల్పీజీ, పీఎన్‌జీ), డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్ యూనిట్స్, పోస్ట్ ఆఫీసులు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్
2. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు మూసి ఉంటాయి.
వీటిలో మినహాయింపు వర్తించేవి:
- ఎ) పోలీస్, హోం గార్డు, సివిల్ డిఫెన్స్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసులు, జైళ్ల విభాగం
- బి) జిల్లా పరిపాలన కార్యాలయాలు, ట్రెజరీ
- సి) విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య విభాగాలు
- డి) పురపాలక సంస్థలు-అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది(శానిటేషన్, వాటర్ సప్లయ్)
3. ఆసుపత్రులు, వైద్య సంస్థలు, ఔషధ ఉత్పత్తులు, పంపిణీ సంస్థలు (పబ్లిక్, ప్రయివేటు), డిస్పెన్సరీలు, కెమిస్ట్(ఫార్మసీ), వైద్య పరికరాల షాపులు, వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్స్, అంబులెన్స్ సేవలు
4. అన్ని వాణిజ్య, ప్రయివేటు సంస్థలు మూసి ఉంటాయి.
ఇందులో మినహాయింపు వర్తించేవి:
- ఎ) షాపులు (రేషన్ షాపులు, ఫుడ్, కిరాణం, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా తదితర షాపులు తెరిచి ఉంటాయి. ప్రజలు ఇక్కడికి రావడం కంటే ఇవి హోం డెలివరీ అయ్యేలా జిల్లా యంత్రాంగం చూడాలి.
- బి) బ్యాంకులు, బీమా సంస్థలు, ఏటీఎంలు
- సి) ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
- డి) టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్ సేవలు, బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు(సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి పనిచేయాలి)
- ఇ) ఫుడ్, ఫార్మా, వైద్య పరికరాలు ఈ-కామర్స్ ద్వారా హోం డెలివరీ కొనసాగుతుంది.
- ఎఫ్) పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, పెట్రోలియం, గ్యాస్ రీటైల్, స్టోరేజ్ యూనిట్లు తెరిచి ఉంటాయి.
- జి) పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు, సేవలు కొనసాగుతాయి
- హెచ్) సెబీ గుర్తింపు పొందిన కాపిటల్
- ఐ) కోల్డ్‌స్టోరేజ్ అండ్ వేర్‌హౌజింగ్ సేవలు
- జె) ప్రయివేటు సెక్యూరిటీ సేవలు (ఇతర అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం చేయొచ్చు)
5. పారిశ్రామిక సంస్థలు మూసి ఉంటాయి.
ఇందులో మినహాయింపు:
- ఎ)అత్యవసర వస్తు ఉత్పత్తుల తయారీ సంస్థలు
- బి) నిరంతరం ఉత్పత్తి చేయాల్సిన ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొనసాగించవచ్చు.
6. విమానం, రైలు, రోడ్డు రవాణా ఉండదు.
మినహాయింపు:
- ఎ) అత్యవసర వస్తువుల రవాణా
- బి) అగ్నిమాపక సేవలు, శాంతి భద్రతలు, ఇతర అత్యవసర రవాణా సేవలు
7. ఆతిథ్య సేవలు నిలిపివేయాలి
మినహాయింపు:
- లాక్‌డౌన్‌లో చిక్కుకున్నవారు, పర్యాటకుల కోసం, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు అందించే సిబ్బంది, విమానయాన సిబ్బంది, నౌకాయాన సిబ్బంది కోసం హోటళ్లు, లాడ్జీలకు మినహాయింపు
8. విద్యా సంస్థలు, పరిశోధన, కోచింగ్ సంస్థలు బంద్
9. అన్ని ప్రార్థన మందిరాలు మూసి ఉంటాయి.
10. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం
11. అంత్యక్రియల విషయంలో 20 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదు.
12. ఫిబ్రవరి 15 తరువాత దేశంలోకి వచ్చిన వారంతా స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు నిర్ధిష్ట కాలం హోం క్వారంటైన్‌లో లేదా ఆసుపత్రి క్వారంటైన్‌లో ఉండాలి. లేనిపక్షంలో ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు.
13. ఈ చర్యలన్నీ అమలయ్యేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్ కమాండర్‌గా క్షేత్రస్థాయిలోకి పంపి అమలయ్యేలా చూడాలి. ఈ చర్యలు అమలుకావడంలో ఇన్సిడెంట్ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు.
14. ఈ ఆంక్షలన్నీ ప్రజల కదలికల నియంత్రణకే తప్ప అత్యవసర వస్తువుల రవాణాకు సంబంధించి కాదని యంత్రాంగం గుర్తుంచుకోవాలి.
15. ఆసుపత్రుల సేవలు కొనసాగడం, వాటికి వనరుల సమీకరణ కొనసాగేలా ఇన్సిడెంట్ కమాండర్స్ చూడాలి. అలాగే ఆసుపత్రుల విస్తరణ, వాటికి అవసరమయ్యే మెటీరియల్, పనివారు లభ్యమయ్యేలా చూడాలి.
16. ఆంక్షలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 నుంచి సెక్షన్ 60 వరకు గల సెక్షన్ల కింద శిక్షార్హులు.

ఫొటో సోర్స్, Getty Images
ఏటీఎం విత్‌డ్రాయల్ చార్జీల రద్దు
దేశంలో కోవిడ్-19 విజృంభణ. సగటు జీవులు, ఎంఎ్‌సఎంఈలు, సగటు పౌరులపై దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్ని వర్గాలకు ఊరట కల్పించేందుకు పలు చర్యలు ప్రకటించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించడం, ఆర్థిక కార్యకలాపాలకు పెను అంతరాయం ఏర్పడడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ విస్తృతమైన చర్యలు ప్రకటించినట్టు నిర్మల చెప్పారు. ఈ మహమ్మారి వల్ల ఏర్పడుతున్న భారీ నష్టాల నుంచి భిన్న వర్గాలను కాపాడేందుకు ఉద్దీపన ప్యాకేజి సిద్ధం అవుతున్నదని, వీలైనంత త్వరలోనే అది ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.
పౌరులకు ఊరట ఇచ్చే చర్యలు
- ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌పై చార్జీల ఎత్తివేత, ప్రైవేటు బ్యాంకులు సహా అన్ని బ్యాంకుల ఏటీఎంల్లోనూ మూడు నెలల పాటు ఉచిత విత్‌డ్రాయల్ సదుపాయం, పరిస్థితిని బట్టి ఈ సదుపాయం మరింత ఎక్కువ కాలం విస్తరించే అవకాశం
- సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ నిర్వహించాల్సిన నిబంధనకు మినహాయింపు, పెనాల్టీల ఎత్తివేత
- 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువు, పాన్-బయోమెట్రిక్ ఆధార్ అనుసంధానం గడువు జూన్ 30 వరకు పొడిగింపు

ఫొటో సోర్స్, KonidelaPro/Instagram
ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి బుధవారం నుంచి సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. చిరంజీవి వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది.
'ఇక నుంచి నేను కూడా సోషల్‌మీడియాలోకి రావాలి అనుకుంటున్నా. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని అభిమానులతో పంచుకోవాలి అనుకోవడమే. నేను చెప్పాలి అనుకుంటున్న సందేశాల్ని ప్రజలతో చెప్పడానికి ఇది వేదికగా భావిస్తున్నా' అని ఈ సందర్భంగా చిరు అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 'చిరంజీవి కొణిదెల' పేరుతో ఖాతా కనపడుతోంది. దీన్ని అప్పుడే 3.7 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
'సైరా' తర్వాత చిరు... కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ లైవ్ పేజీ: అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమాచారం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అధికారులు
- కరోనావైరస్: ప్రపంచమంతా ఇంట్లో ఉంటే... వీళ్ళు బీచ్‌లో ఏం చేస్తున్నారు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్: అమెరికా నుంచి పారిపోతున్న ప్రజలు
- కరోనావైరస్: స్పెయిన్‌లో దిక్కు లేకుండా మృతి చెందిన వృద్దులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం
- కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం... లాక్‌డౌన్ ఎత్తేసిన హుబే, త్వరలోనే వుహాన్‌లో కూడా సడలింపు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









