మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం... క్రిమినల్ కేసు పెట్టాలని డీజీపీని ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్

మన్సూర్ అలీఖాన్

ఫొటో సోర్స్, MANSOOR ALI KHAN/INSTAGRAM

ఫొటో క్యాప్షన్, మన్సూర్ అలీఖాన్
    • రచయిత, నందిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లియో చిత్రం గురించి మాట్లాడుతూ నటి త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీనిపై తమిళ సినీ పరిశ్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ కూడా తీవ్రంగా స్పందించింది.

మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలను సూమోటోగా తీసుకుని, ఆయనపై ఐపీసీ 509 బి తదితర సెక్షన్ల కింద కేసు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నామని తెలిపింది.

మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. తమిళ నడిగర్ సంఘం ఈ విషయంపై మన్సూర్ అలీఖాన్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను డిమాండ్ చేసింది.

ప్రముఖ తెలుగు సినీనటులు చిరంజీవి సహా పలువురు ప్రముఖులు దీనిపై స్పందించారు. ఇంతకీ అసలు వివాదమేంటి? చిరంజీవి ఎందుకు స్పందించాల్సి వచ్చింది?

ఇటీవల తెలుగులోనూ విడుదలైన లియో చిత్రంలో త్రిషతో పాటు మన్సూర్ అలీఖాన్ నటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన నటి త్రిషతో నటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

విలన్‌గా చేయనివ్వడం లేదు. త్రిషను కలవనివ్వలేదు. కశ్మీర్ షెడ్యూల్లో త్రిషను అసలు నాకు కనీసం చూపించలేదంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి, చర్చకు దారి తీసింది.

త్రిష ఏమన్నారు?

మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విటర్)లో త్రిష పోస్ట్ చేశారు.

“మన్సూర్ అలీఖాన్ నా గురించి అసభ్యకర రీతిలో మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు అమర్యాదకరంగా, అసభ్యంగా, చౌకబారుగా ఉన్నాయి. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తితో కలిసి తెర మీద కనిపించనందుకు సంతోషంగా ఉంది. ఇకపై అతనితో కలిసి నటించను. అలాంటి వ్యక్తుల వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది” అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మన్సూర్ అలీ ఖాన్

ఫొటో సోర్స్, MANSOOR ALI KHAN / INSTAGRAM

గతంలోనూ వివాదాలే...

ఇప్పుడు హీరోయిన్ల విషయంలో వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీఖాన్ సినిమా, రాజకీయ విషయాలపై అంతకుముందు పలు వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచారు.

గతంలో నడిరోడ్డుపై ప్రజల సమస్యలపై నిరసనలు చేసిన సందర్భంలోనూ, కరోనా సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన సందర్భంలోనూ మన్సూర్ అలీఖాన్ విమర్శలను ఎదుర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తన స్వస్థలమైన దిండిగుల్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి, ఓడిపోయారు.

వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2001లో లైంగిక వేధింపుల కేసులో కోర్టు మన్సూర్ అలీఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే, 2012లో ఆ కేసును తప్పుడు కేసుగా తేల్చింది మద్రాస్ హైకోర్టు. కేసు పెట్టిన మహిళను రూ.50 లక్షలు మన్సూర్ అలీఖాన్‌కు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

ఇప్పుడు త్రిష విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

చిరంజీవి

ఫొటో సోర్స్, Twitter/ Chiranjeevi Konidela

త్రిషకు నా మద్దతు - చిరంజీవి

నటుడు చిరంజీవి త్రిషకు తన మద్దతు తెలిపారు.

“నటి త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఈ వ్యాఖ్యలు కేవలం నటినే కాదు మహిళలనే కించపరిచేవిగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. ఈ వ్యాఖ్యల వల్ల బాధపడిన త్రిషకు నా మద్దతు తెలియజేస్తున్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఖుష్బూ

ఫొటో సోర్స్, KHUSHBOO SUNDAR / INSTAGRAM

ఫొటో క్యాప్షన్, నటి ఖుష్బు

చర్యలు తీసుకోవాలన్న జాతీయ మహిళా కమిషన్

ఈ వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన ఖుష్బూ స్పందించారు.

“జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, ఇప్పటికే ఈ విషయాన్ని నా సీనియర్ అధికారి దృష్టికి తీసుకెళ్లాను. దీనిపై చర్యలు తీసుకుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని ఊరికే వదిలేయకూడదు. త్రిషకు, ఆయన వ్యాఖ్యల్లో ప్రస్తావనకు వచ్చిన ప్రతి మహిళకు మద్దతు తెలుపుతున్నాను”అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యల వివాదంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

“నటి త్రిష పట్ల మన్సూర్ అలీఖాన్ చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుంటూ ఐపీసీ సెక్షన్లు 509బీ తోపాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మహిళపై హింసను సాధారణంగా మార్చేలా చేస్తాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఖండించాలి” అని ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

నితిన్ స్పందన

త్రిష ట్వీట్‌ను ప్రస్తావిస్తూ సినీ నటులు నితిన్ కూడా స్పందించారు.

“మన్సూర్ అలీఖాన్ చేసిన నీచమైన, అసహ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. మన సమాజంలో ఇలాంటి దురంహకార పూరిత వ్యాఖ్యలకు చోటులేదు. మన పరిశ్రమలో మహిళలపై చేసిన ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుతున్నాను’’ అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

షోకాజ్ నోటీసులిచ్చిన నడిగర్ సంఘం

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై నడిగర్ సంఘం స్పందించింది. ఓ ప్రకటనలో మన్సూర్ అలీఖాన్ తను చేసిన వ్యాఖ్యల పట్ల త్రిషను క్షమాపణ కోరాలని సూచించింది. షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

నటి ఖుష్బూ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఆ వ్యాఖ్యలు అతని నీచమైన ఆలోచనకు వ్యక్తీకరణ. సమాజంలోని మహిళలను గౌరవించడం తెలీకపోతే, ఇంట్లోని మహిళలను ఎలా గౌరవిస్తారు? గతంలో నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలను ప్రశ్నించకుండా వదిలేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు వారు ధైర్యంగా ఖండిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా ట్రెండ్ కూడా మారింది. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి” అని అన్నారు.

నటి రోజా

ఫొటో సోర్స్, FACEBOOK/ROJA SELVAMANI

పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి - రోజా

మంత్రి, నటి రోజా కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

“పురుషులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. గుర్తింపు పొందిన మన లాంటి మహిళలనే ఇలా లక్ష్యంగా చేసుకుంటే, సాధారణ మహిళలు ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా ఎదుర్కొంటారో ఊహించండి?” అంటూ రోజా ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

‘ఎవరికీ భయపడను’ - మన్సూర్ అలీఖాన్

వ్యాఖ్యల వివాదంపై మన్సూర్ అలీఖాన్ స్పందించారు. నడిగర్ సంఘం ఈ విషయంలో పెద్ద తప్పు చేసిందన్నారు. సంఘం తనను ఎలాంటి వివరణా కోరలేదన్న మన్సూర్ అలీఖాన్, తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేది లేదన్నారు.

నడిగర్ సంఘం అత్యున్నతమైనది. కావాలంటే నేను ఓర్పుతో ఎదురుచూస్తానని చెప్పిన మన్సూర్, 'నటి త్రిష గురించి తప్పుగా ఏం మాట్లాడలేదని, అది అసలు పెద్ద విషయమే కాదు' అన్నారు. తాను ఎవరికీ భయపడనని కూడా చెప్పారు.

‘‘సినిమాల్లో రేప్ సీన్లు అంటే ఎలా ఉంటాయి? అది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. నాకు తమిళనాడే ముఖ్యం. ఇలాంటి వారికి నేను భయపడను. ఖుష్బూ మహిళా కమిషన్ అంటున్నారు. ఏదైనా కానీ నేను ఏదీ పట్టించుకోను’’ అని మన్సూర్ అలీఖాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)