ఈ 19 దేశాలకు మీరు వీసా లేకుండా వెళ్ళి రావచ్చు...

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారతీయులు డిసెంబర్ 1 నుంచి వీసా లేకుండానే మలేషియాలో పర్యటించ వచ్చని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు.
పీపుల్స్ జస్టిస్ పార్టీ కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ అన్వర్ ఈ ప్రకటన చేశారు. అయితే, వీసా లేకుండానే మలేషియాలో పర్యటించే ఈ సౌకర్యం ఎంతకాలం అందుబాటులో ఉంటుందో మలేషియా ప్రధాని వెల్లడించలేదు.
భారత్‌తో పాటు, చైనీయులు కూడా వీసా లేకుండా మలేషియా రావొచ్చని అన్వర్ ప్రకటించారు. మలేషియాతో వాణిజ్య భాగస్వామ్యంలో చైనా, భారత్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
మలేషియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 2,83,885 మంది భారతీయులు మలేషియాలో పర్యటించారు. 2019లో ఇదే సమయంలో 3,54,486 మంది పర్యాటకులు భారత్ నుంచి మలేషియా వెళ్లారు.
భారత్ 1957 నుంచి మలేషియా(అప్పట్లో మలాయా)తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది.
మలేషియాలో భారత సంతతికి చెందిన జనాభా దాదాపు 27 లక్షల 50 వేల మంది. అది మొత్తం మలేషియా జనాభాలో దాదాపు 9 శాతం. భారత సంతతి జనాభాలో దాదాపు 90 శాతం మంది తమిళులు. ఇంకా తెలుగు, మలయాళం, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ సహా ఇతర భాషలు మాట్లాడే వారున్నారు.
దాదాపు లక్షా 30 వేల మంది భారత్ నుంచి వలస వెళ్లి మలేషియాలో పనిచేస్తున్నారు.
మలేషియాకు వచ్చే పర్యాటకుల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. 2018లో ఆరు లక్షల మందికిపైగా పర్యాటకులు మలేషియాను సందర్శించారు.
అలాగే, భారత్‌లో పర్యటించే విదేశీయుల జాబితాలో మలేషియా కూడా ఆరో స్థానంలో ఉంది. 2018లో 3.25 లక్షల మంది మలేషియన్లు భారత్‌లో పర్యటించారు.
2010లో మలేషియా పర్యటన సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యాటక ఒప్పందంపై సంతకం చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్, మలేషియా మధ్య మంచి వాణిజ్య సంబంధాలు
భారత్, మలేషియా మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలున్నాయి. భారత్‌తో వ్యాపార సంబంధాల్లో మలేషియా 13వ స్థానంలో ఉంది.
2018-19 ఏడాదికి రెండు దేశాల మధ్య 17.4 బిలియన్ డాలర్ల (అంటే, సుమారు లక్షా 45 వేల కోట్ల రూపాయలు) వ్యాపారం జరిగింది. భారత్ 6.43 బిలియన్ డాలర్ల (దాదాపు 53,616 కోట్ల రూపాయలు) విలువైన ఎగుమతులు, 10.81 బిలియన్ డాలర్ల (దాదాపు 90,139 కోట్ల రూపాయలు) విలువైన దిగుమతులు చేసుకుంది.
భారత్ మినరల్ ఆయిల్, అల్యూమినియం, మాంసం, ఇనుము, రాగి, రసాయనాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, యంత్ర పరికరాలను మలేషియాకు ఎగుమతి చేసింది.
మలేషియా నుంచి మినరల్ ఆయిల్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పరికరాలు, కొవ్వు పదార్థాలు, కలప వంటివి దిగుమతి చేసుకుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారతీయులకు వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తున్న దేశాలివే
భారతీయులు వీసా లేకుండానే 19 దేశాలకు వెళ్లొచ్చు. పాస్‌పోర్ట్ ఉంటే చాలు ఈ 19 దేశాలకు ఎంచక్కా వెళ్లిపోవచ్చు. దీనితో పాటు మరో 26 దేశాలకు వెళ్లిన తర్వాత అక్కడ వీసా తీసుకునే అవకాశం (వీసా ఆన్ అరైవల్) ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాలశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మరో 25 దేశాలకు ఈ-వీసా సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే, మరో 11 దేశాలకు వీసా- ఆన్-అరైవల్, లేదా ఈ-వీసా సదుపాయం అందుబాటులో ఉంది.
ఆ 19 దేశాలివే..
1.బార్బడోస్
2.భూటాన్
3.డొమినికా
4.గ్రెనాడా
5.హైతీ
6.హాంగ్ కాంగ్
7. మాల్దీవులు
8. మారిషస్
9. మాంట్‌సేరాట్
10. నేపాల్
11. నివుయే ఐలాండ్
12. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనాడీస్
13. సమోవా
14. సెనెగల్
15. సెర్బియా
16. ట్రినిడాడ్ అండ్ టోబెగో
17. థాయ్‌లాండ్
18. శ్రీలంక
19. మలేషియా
భారతీయులు, తైవాన్ పౌరులు వీసా లేకుండానే తమ దేశంలో ఆరు నెలలు పర్యటించొచ్చని గత నెలలో థాయ్‌లాండ్ కూడా ప్రకటించింది. అయితే, ఈ ఏడాది నవంబర్ 10న అమల్లోకి వచ్చిన ఈ సదుపాయం 2024 మే 10 వరకు మాత్రమే ఉంటుంది.
''భారతీయులకు, తైవాన్ ప్రజలకు వీసా లేకుండానే వచ్చే అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే, ఆ రెండు దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు'' అని థాయ్‌లాండ్ ప్రధాని శ్రెత్త తవిసిన్ అన్నారు.
అలాగే, శ్రీలంక కూడా పైలట్ ప్రాజెక్టు కింద భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ వాసులకు 2024 మార్చి 31 వరకు వీసా ఫ్రీ సదుపాయం కల్పిస్తోంది.
వియత్నాం కూడా భారత్, చైనా పౌరులను వీసా లేకుండానే అనుమతించే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, ఫిన్‌లాండ్ దేశస్తులను వీసా లేకుండానే వియత్నాం అనుమతిస్తోంది.
మిగిలిన దేశాల పౌరులకు 90 రోజుల ఈ వీసాలను మంజూరు చేస్తోంది.
భారతీయులకు వీసా-ఆన్-అరైవల్ అందిస్తున్న దేశాలు
భారతీయులకు కొన్ని దేశాలకు వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తున్నాయి. అంటే, అక్కడికి వెళ్లిన తర్వాత విమానాశ్రయంలో వీసా తీసుకోవచ్చు. ఈ జాబితాలోని దేశాలు ఇవీ:
1. అంగోలా
2. బిలీవియా
3. కాపో వెర్డె
4. కామెరూన్ యూనియన్ రిపబ్లిక్
5. కుక్ ఐలాండ్స్
6. ఫిజీ
7. గినియా బిస్సా
8. ఇండోనేషియా
9. ఇరాన్
10. జమైకా
11. జోర్డాన్
12. కిరిబతీ
13. లావోస్
14. మడగాస్కర్
15. మౌరిటేనియా
16. నైజీరియా
17. ఖతార్
18. రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్
19. రీయూనియన్ ఐలాండ్
20. రువాండా
21.సీషెల్స్
22. సోమాలియా
23. ట్యునీషియా
24. తువాలు
25. వానుఆటూ
26. జింబాబ్వే

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ-వీసా అందిస్తున్న దేశాలు
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి వీసా పొందడానికి కొన్ని దేశాలు వీలు కల్పిస్తున్నాయి. ఇలా భారతీయులకు ఈ-వీసా అందిస్తున్న దేశాల జాబితా ఇదీ:
- అర్జెంటీనా
- అర్మేనియా
- అజర్‌బైజాన్
- బహ్రెయిన్
- బెనిన్
- కొలంబియా
- కోట్ ఆఫ్ ఆర్మ్స్
- జిబూతీ
- జార్జియా
- కజకిస్తాన్
- కిర్జిస్తాన్ రిపబ్లిక్
- లెసోటో
- మాల్డోవా
- న్యూజీలాండ్
- ఒమెన్
- పపువా న్యూ గినియా
- రష్యా
- సింగపూర్
- సౌత్ కొరియా
- తైవాన్
- తుర్కియే
- యుగాండా
- ఉజ్బెకిస్తాన్
- జాంబియా
ఇవి కూడా చదవండి:
- తలకు తుపాకీ గురి పెట్టే డ్రగ్స్ మాఫియాను లెక్కచేయని మహిళా ట్రక్కు డ్రైవర్ కథ
- రెడ్ వైన్ తాగితే తలనొప్పి వస్తుందా? ఎందుకు?
- ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ 37 ఏళ్ల తర్వాత కదులుతోంది.. ఏం జరగబోతోంది?
- ‘ఒకసారి హత్య చేసి చూద్దాం’ అనే ఉత్సుకతతో ఆన్‌లైన్లో మనిషిని వెతుక్కొని చంపేసిన కొరియా యువతి
- యూఏఈలో పనిచేసే భారతీయులకు ప్రయోజనం కలిగేలా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














