అత్యంత అందమైన నగరం.. కానీ, చుట్టూ నాలుగు అగ్నిపర్వతాలతో టెక్టోనిక్ జోన్‌లో ఉంది

ఫొటో సోర్స్, Bella Falk
గ్వాటెమాలాలో అత్యంత ప్రముఖ నగరం ఆంటీగ్వా. కానీ, అందమైన ఈ నగరం, క్రియాశీలమైన టెక్టోనిక్ జోన్‌లో ఉంది.
పర్యాటక ఫోటోగ్రాఫర్ బెల్లా ఫాల్క్ ఈ నగరంలోని ప్రజల జీవితాన్ని తన అందమైన ఫోటోలలో బంధించారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గ్వాటెమాలాలోని ఆంటీగ్వా పేరొందింది.
రాజధాని గ్వాటెమాలా సిటీ కంటే చిన్నగా, ఆకర్షణీయంగా ఉండే ఆంటీగ్వా నగర వీధుల్లో ఇంద్రధనస్సు రంగులతో కనిపించే పురాతన కట్టడాలు సర్వాంగ సుందరంగా ఉంటాయి.
చారిత్రక చర్చ్‌లు, కాన్వెంట్లు, కెఫేలు, రెస్టారెంట్లను మనం ఈ నగర వీధుల్లో చూడొచ్చు.

ఫొటో సోర్స్, Bella Falk
1694 కాలానికి చెందిన కానరీ-యెల్లో శాంట కటాలియా ఆర్చ్ ఆంటీగ్వాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతంగా నిలుస్తోంది.
పబ్లిక్‌లో కనిపించకుండా వీధిలో మరోవైపు నుంచి తమ కాన్వెంట్ నుంచి స్కూల్‌కి వెళ్లేందుకు నన్‌ల కోసం శాంట కటాలియా ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.
గ్వాటెమాలా ఐకాన్‌గా కూడా దీనికి పేరుంది.

ఫొటో సోర్స్, Bella Falk
ఆంటీగ్వాలోని సెంట్రల్ పార్క్ కూడా నగరానికి వచ్చే పర్యాటకుల హృదయాలను కొల్లగొడుతోంది. దీనికి నలుదిక్కులా 18వ శతాబ్దానికి చెందిన భవంతులు, సొగసైన స్తంభాలుంటాయి.
స్థానికులు ఇక్కడికి వచ్చి, తమ స్నేహితులతో ముచ్చటిచ్చుకుంటూ రిలాక్స్ అవుతుంటారు.
ఈ ప్రాంతాన్ని చూస్తే గ్వాటెమాలాలో ఉన్న విభిన్న సంస్కృతులపై మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది.
సంప్రదాయ వస్త్రాధారణలో కనిపించే స్వదేశీ మాయాన్లు, యూరోపియన్ సంతతికి చెందిన గ్వాటెమాలాన్లు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ నగరంలో కనిపిస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Bella Falk
18వ శతాబ్దం వరకు కూడా గ్వాటెమాలా రాజధానిగా ఆంటీగ్వా ఉండేది.
స్పానిష్ సామ్రాజ్యంలో గొప్ప నగరాల్లో ఇది ఒకటి. కానీ, ఈ నగరం అగువా, ఫ్యూగో, అకాటెనాంగో, పకాయ అనే నాలుగు అగ్నిపర్వతాలకు సమీపంలో యాక్టివ్ టెక్టోనిక్ జోన్(భూపలకాలు కలిసే చోటు)లో ఉంది.
1773లో వరుసగా భారీ భూకంపాలతో ఈ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది.
దీంతో ప్రస్తుత ప్రాంతం గ్వాటెమాలా సిటీకి రాజధానిని తరలించాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది.
దీంతో ఈ నగరం లా ఆంటీగ్వా గ్వాటెమాలా(ది ఓల్డ్ గ్వాటెమాలా)గా మారింది.

ఫొటో సోర్స్, Bella Falk
ఈ భూకంపాల ధాటికి బాగా ప్రభావితమైన అద్భుతమైన భవంతుల్లో ఈ కేథడ్రల్ ఒకటి.
1545లో నిర్మించిన ఈ భవనం భూకంపానికి కుప్పకూలడానికి ముందు, 200 ఏళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉంది.
ఇవాళ ఈ భవంతి పైభాగం మనకు కనిపించదు.
కుప్పకూలిన ఈ భవంతి పిల్లర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిపై వాలే పావురాలు, అరల్లో పావురాల గూళ్లు మాత్రమే మనం చూడొచ్చు.

ఫొటో సోర్స్, Bella Falk
ప్రస్తుతం ఆంటీగ్వా శత్రువులు దానికి స్నేహితులుగా మారాయి.
ఇవే అగ్నిపర్వతాలు ఒకప్పుడు ప్రధాన పర్యాటక ప్రదేశాలన్నింటిన్ని తీవ్రంగా దెబ్బకొట్టాయి.
3,768 మీటర్ల పొడవైన వాల్కనోడే ఫ్యూగో ప్రపంచంలో ఎల్లప్పుడూ బద్ధలయ్యే అగ్నిపర్వతాల్లో ఒకటి.
2002 నుంచి ఇది నిత్యం విస్ఫోటనం చెందుతూ ఉంది. ప్రతి 15 నుంచి 30 నిమిషాలకు గాలిలోకి పొగ రేణువులను, లావా బాంబులను విరజిల్లుతూ ఉంటోంది.
భూశక్తిని వీక్షించాలనుకున్న వారికి అకాటెనాంగో అగ్నిపర్వతం ఒక అద్భుతమైన ప్రాంతం.
ఇది ఫ్యూగోకి కుడిపక్కనే ఉంటుంది. ఇక్కడ స్థానిక పర్యాటక కంపెనీలు రాత్రంతా క్యాంపింగ్ అవకాశాన్ని అందిస్తున్నాయి.
రాత్రిపూట ఆకాశంలో ఫ్యూగో వెదజల్లే ఎర్రటి అగ్గి రేణువులను ఇక్కడ నుంచి మీరు వీక్షించవచ్చు.

ఫొటో సోర్స్, Bella Falk
పర్యాటకులను ఆకర్షించే మరో ప్రాంతం పకాయ. ఆంటిగ్వాకు ఇది 50 కి.మీ.ల దూరంలో ఉంది.
2021 వరకు, ఇది తరచూ అగ్నిజ్వాలలను విరజిమ్మేది. కానీ, ప్రస్తుతం దీని అగ్ని జ్వాలలు ఆగిపోయాయి.
రుబి శాంతమారియా లాంటి గైడ్లు, పర్యాటకులను ఈ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉంటారు.
ఈ అగ్నిపర్వత వేడిని మార్ష్‌మాలోలను టోస్ట్ చేసుకునేందుకు ఎలా వాడుతున్నారో ఆమె ఇక్కడే పర్యాటకులకు చూపించారు.
ఇవి కూడా చదవండి:
- గంగా విలాస్ క్రూయిజ్: డిజైన్ చేసింది తెలుగు మహిళ.. మోదీ ప్రారంభించిన ఈ షిప్ ప్రత్యేకతలేమిటి? విమర్శలు ఎందుకు?
- గోదావరి నది సముద్రంలో కలిసే చోట 'అన్నాచెల్లెళ్ల గట్టు'ను చూశారా?
- భారీ ఆక్వేరియం పగలడంతో వీధుల్లో వరద, వందల కొద్దీ చేపలు.. వందల కోట్ల రూపాయల నష్టం
- హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి
- దిండి: కేరళను తలపించే ఈ కోనసీమ రిసార్ట్స్ ప్రత్యేకత ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














