తిరుపతి సమీపంలో శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన జలపాతం

వీడియో క్యాప్షన్, తిరుపతి పక్కన, శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన అందాలు.. చూశారా..

తలకోన జలపాతం ప్రకృతి ప్రేమికులను మైమరచిపోయేలా చేసే పర్యాటక కేంద్రం. ఇది శేషాచలం కొండల్లో ఉంది.

తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామం సమీపంలో తలకోన అటవీ ప్రాంతం ఉంది. ఎన్నో రకాల వన్యప్రాణులు, అరుదైన అటవీ సంపదకు నెలవు.

తిరుపతి నుంచి బాకరాపేట మీదుగా 57 కిలోమీటర్ల దూరం వెళ్తే తలకోన వస్తుంది. తిరుపతి, పీలేరు నుంచి గంట గంటకూ ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. తలకోనలోని సిద్దేశ్వర స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో జలపాతం ఉంటుంది.

జలపాతం వద్దకు వెళ్లాలంటే- సిద్దేశ్వర స్వామి ఆలయం నుంచీ కిలోమీటరు దూరం మట్టి రోడ్డులో వాహనంలో లేదా నడిచి వెళ్లాలి. తర్వాత దట్టమైన అడవి గుండా కిలోమీటరు దూరం రాళ్లతో నిర్మించిన మెట్లమార్గంలో వెళ్లాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)