చైనా: షార్ట్‌కట్ కోసం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను వలస కూలీలు తవ్వేశారు

ఫొటో సోర్స్, YOUYU COUNTY POLICE RELEASE
- రచయిత, స్టీఫెన్ మెక్‌డోనెల్, ఫాన్ వాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని కొంత భాగాన్ని కూల్చేశారు. సెంట్రల్ షాంషీ ప్రావిన్స్‌లోని భవన నిర్మాణ కార్మికులు గ్రేట్ వాల్‌ను ఒక చోట మెషీన్‌తో కూలగొట్టి దారి చేసుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు భవన నిర్మాణ పనుల కోసం వెళ్ళేందుకు షార్ట్ కట్ దారి కోసం ఈ గ్రేట్ వాల్‌ను కూలగొట్టారని పోలీసులు చెబుతున్నారు.
వాళ్లిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుగుతోంది.
ఇద్దరు నిందితుల్లో ఒకరు 38 ఏళ్ల వ్యక్తి కాగా, మరొకరు 55 ఏళ్ల మహిళ. వీళ్లిద్దరూ 32వ గ్రేట్ వాల్ సెక్షన్‌లో పని చేస్తున్నారు.
ఆ ప్రాంతంలోని గ్రేట్ వాల్ మధ్యలో ఒక చిన్న సందులా ఏర్పడింది. దానిని వీళ్లిద్దరు తవ్వి పెద్దగా చేశారు.
ఇప్పుడు దానిలోంచి తవ్వకాలు జరిపే మెషీన్ వెళ్లేంతగా ఖాళీ ఏర్పడింది. వాళ్ల నిర్మాణ పనుల కోసం షార్ట్‌కట్ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఇలా చేసినట్టు పోలీసులు తెలిపారు.
మింగ్ గ్రేట్ వాల్ సమగ్రతకు, సాంస్కృతిక అవశేషాలకు కోలుకోలేని నష్టం జరిగిందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మింగ్ గ్రేట్ వాల్‌లోని కొంత భాగం యోయు కౌంటీలోని 32వ గ్రేట్ వాల్. దీనిని చారిత్రక సాంస్కృతిక వారసత్వ ప్రాంతంగా పరిరక్షిస్తున్నారు.
వాల్ దెబ్బతిన్న విషయాన్ని అధికారులకు అగస్టు 24న సమాచారం అందించారు. గ్రేట్ వాల్ మధ్యలో తవ్విన ఖాలీ గురించి వార్తా కథనాలూ వచ్చాయి.
ఈ వాల్ 1987 నుంచీ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా కొనసాగుతోంది. గ్రేట్ వాల్‌ను క్రీస్తు పూర్వం 220 నుంచి, 17 శతాబ్దం నాటి మింగ్ సామ్రాజ్య కాలం వరకూ అనేక విడతల నిర్మాణం చేస్తూ వచ్చారు. మింగ్ సామ్రాజ్యంలోని ఈ గ్రేట్ వాల్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద మిలిటరీ కట్టడంగా మారింది.
గ్రేట్ వాల్‌లో జాగ్రత్తగా పరిరక్షిస్తున్న కొన్ని భాగాలను మింగ్ సామ్రాజ్యం ఉనికిలో ఉన్న 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించారు. వీటిలోని ఒక ప్రాంతంలోనే ఇప్పుడీ తవ్వకం జరిపి కట్టడం దెబ్బతినేలా చేశారు.
ఈ ప్రాంతం బీజింగ్ సమీపంలో ఉంది. ప్రపంచ పర్యటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా ఉంది.

గ్రేట్ వాల్‌లో బాగా పాపులరైన కొన్ని భాగాలను అత్యంత సుందర కట్టడాలుగా నిర్మించారు. ప్రాచీన నిఘా టవర్లను నిర్మించారు. మధ్యలో కొన్నిచోట్ల నిర్మాణం దెబ్బతినడమో లేదా మొత్తంగా మాయమవడమో జరిగింది.
బీజింగ్ టైమ్స్ పత్రిక 2016లో విడుదల చేసిన నివేదికలో మింగ్ గ్రేట్ వాల్ 30 శాతానికిపైగా పూర్తిగా మాయమైందని, కేవలం 8శాతం కట్టడాన్నే మంచిగా పరిరక్షించారని తెలిపింది.
అయితే నిందితులైన ఇద్దరిలానే ఇంకొందరు వ్యక్తుల్లో కూడా ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం పట్ల ఇంటువంటి నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఉత్తర చైనా ప్రాంతంలో వరుసగా నిర్మించిన విస్తారమైన కట్టడం గ్రేట్ వాల్. ఇందులో దెబ్బతిన్న చాలా భాగాలు మరమ్మతులకు నోచుకోలేదు. గ్రేట్ వాల్ నిర్మాణంలోని కొన్ని భాగాలు అనేక గ్రామాలు, పట్టణాల్లోంచి వెళ్తాయి. కొన్ని ప్రావిన్సుల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ గ్రేట్ వాల్ నిర్మాణాలు కనిపిస్తాయి.
కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రేట్ వాల్‌లోని కొన్ని భాగాలు కూలిపోయి గుట్టలుగా పేరుకున్న స్థితి కనిపిస్తుంది. వీటిని చూడగానే గ్రేట్ వాల్ గుర్తించడం కష్టం.
స్థానిక రైతులు గ్రేట్ వాల్ నిర్మాణంలోని ఇటుకలను, రాళ్లను దొంగలించి తమ ఇళ్లను, పశువుల కొట్టాలను నిర్మించుకున్నారని, గ్రేట్ వాల్ దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం కొంత ముందడుగు వేసి గ్రేట్ వాల్ పరిరక్షణకు చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా ఇప్పుడు నిందితులిద్దరూ చిక్కుల్లో పడ్డారు.
అయితే ఇవి అసాధారణ చర్యలుగా చైనా ప్రజలు భావించట్లేదు. గతంలో గ్రేట్ వాల్‌కు జరిగిన విధ్వంస ఘటనలే అందుకు కారణం. కానీ ఇటువంటి ఘటనలతో ప్రజలు కాస్త నిరాసకు గురవొచ్చు. ఎంతైనా చైనా చారిత్రక సాంస్కృతిక ప్రధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేది అద్భుతమైన గ్రేట్ వాల్ కట్టడం.
ఇవి కూడా చదవండి:
- శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకి వెళ్లిన సబ్‌మెరైన్స్, అక్కడ ఏముంది?
- చంద్రయాన్-3: నాసా కెమెరాతో తీసిన ‘విక్రమ్’ ల్యాండర్ ఫోటోలు ఎలా ఉన్నాయంటే....
- కుంభమేళా: యాంటీబయాటిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్‌వో ఎందుకు హెచ్చరించింది?
- పుతిన్, కిమ్ జోంగ్ ఉన్: వీరిద్దరూ కలవడం ప్రపంచానికి ఆందోళనకరమా?
- భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














