‘విరాట్ GOAT’.. ‘షమీ ఫైనల్’ ఈ రెండు పదాలూ సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి?

విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

బుధవారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను ఇప్పుడప్పుడే క్రికెట్ అభిమానులు మర్చిపోరు.

వరుస విజయాలతో కొనసాగుతున్న భారత జట్టు, సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.

50వ సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీని, 7 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పిన షమీ ప్రదర్శనను అభినందిస్తూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పెడుతున్న పోస్టులు ట్రెండవుతున్నాయి.

ముఖ్యంగా విరాట్ కోహ్లీని 'GOAT' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అంటూ, బౌలింగ్‌తో న్యూజీలాండ్‌ను దెబ్బతీసి, భారత జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా మారిన మహమ్మద్ షమీని ‘షమీ ఫైనల్’ అంటూ సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడు వికెట్లు తీసి భారత జట్టుకు విజయాన్ని అందించిన షమీ

'అద్భుతమైన బ్యాటింగ్.. మంచి బౌలింగ్'

భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

“భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విశేషమైన రీతిలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

జట్టు చేసిన అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్‌ మనకు విజయాన్ని అందించింది.

ఫైనల్స్‌కు చేరిన జట్టుకు అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో షమీ బౌలింగ్‌ను ప్రశంసించారు.

భారత ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Narendramodi/X

ఫొటో క్యాప్షన్, భారత జట్టును అభినందిస్తూ మోదీ ట్వీట్

మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తన ట్వీట్‌లో, “4వ సారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టుకు అభినందనలు. విరాట్ కోహ్లీ చరిత్రాత్మక 50వ సెంచరీ సాధించాడు. మహమ్మద్ షమీ వన్డేల్లో 7 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్, శుభమన్‌లు అద్భుతంగా ఆడారు” అంటూ జట్టును ప్రశంసించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సినీనటుడు వెంకటేష్ ట్వీట్ చేస్తూ, “వాంఖడే స్టేడియంలో లిఖించిన చరిత్రను ప్రత్యక్షంగా చూడటం అపురూపం” అని రాశారు.

దగ్గుబాటి వెంకటేష్

ఫొటో సోర్స్, Venkatesh Daggubati/X

ఫొటో క్యాప్షన్, సినీ నటులు వెంకటేష్ ట్వీట్

కప్‌ను ఇంటికి తీసుకురండి అబ్బాయిలూ - రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, “భారత జట్టు బాగా ఆడింది. టీం వర్క్, నైపుణ్యాల అద్భుత ప్రదర్శన ఇది. విరాట్, అద్భుతమైన రికార్డు సాధించినందుకు అభినందనలు. వరల్డ్ కప్‌ను ఇంటికి తీసుకురండి అబ్బాయిలూ..” అంటూ కప్ గుర్తు ఉన్న ఎమోజీతో ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

 విరాట్‌ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 50 సెంచరీలతో ప్రపంచ రికార్డు సాధించిన విరాట్‌ కోహ్లీ

విరాట్‌.. గోట్ (GOAT-గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్)

50 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీని గోట్ (గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అంటూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

తన రికార్డును అధిగమించిన విరాట్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేశారు. ఆట పట్ల పట్టుదల, నైపుణ్యంతో కోహ్లీ తన హృదయాన్ని తాకాడని సచిన్ తన ట్వీట్‌లో రాశారు.

‘‘నిన్ను మొదటిసారి డ్రెసింగ్ రూమ్‌లో చూశాను. అప్పుడు మిగతా ఆటగాళ్ళు నిన్ను ప్రాంక్ చేసి నా కాళ్ళు మొక్కేలా చేశారు. ఆరోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ, ఇప్పుడు ఆట పట్ల నీ పట్టుదల, నైపుణ్యంతో నువ్వు నా హృదయాన్ని తాకావు. నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

భారతీయుడు నా రికార్డును బ్రేక్ చేయడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అది కూడా వరల్డ్ కప్ సెమీస్ లాంటి పెద్ద మ్యాచ్‌లో, పైగా నా సొంత మైదానం లాంటి వాంఖెడేలో సాధించడం ఇంకా ఆనందంగా ఉంది’’ అని ట్వీట్‌లో రాశారు.

సచిన్ తెందూల్కర్

ఫొటో సోర్స్, SachinTendulkar/Twitter

ఫొటో క్యాప్షన్, సచిన్ తెందూల్కర్ ట్వీట్

విరాట్ కోహ్లీని అభినందిస్తూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కోచ్ వకార్ యూనిస్ “ విజేతలకే విజేత. ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యుత్తమ బ్యాటర్. మీ దేశం గర్వపడేలా చేసినందుకు అభినందనలు విరాట్ కోహ్లీ” అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

మరో యూజర్ వినీత్ విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్‌లు ఆత్మీయంగా కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ,

“ప్రపంచ క్రికెట్‌ను శాసించిన రెండు తరాల ఆటగాళ్లు” అంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

క్రికెట్ వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

షమీ.. రెండేళ్ల క్రితం విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు

2021లో దుబాయ్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్ నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

ఆ మ్యాచ్‌లో తన ప్రదర్శనపై మహమ్మద్ షమీ విమర్శలు ఎదుర్కొన్నాడు.

3.5 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులు ఇచ్చి, జట్టు ఓటమికి కారణం అయ్యాడని సోషల్ మీడియాలో కొంతమంది అభ్యంతరకర విమర్శలు చేశారు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు చాలామంది క్రికెటర్లు మద్దతుగా నిలబడ్డారు.

విరాట్ కోహ్లీ ఆ సమయంలో మీడియాతో “మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడమన్నది అత్యంత నీచమైన పని” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడు విమర్శలు ఎదుర్కొన్న షమీ, ఈ వన్డే వరల్డ్ కప్ 2023లో సత్తా చాటాడు. తన ప్రదర్శనతోనే అలాంటి విమర్శలకు జవాబు చెప్పారని కొంతమంది యూజర్లు ట్వీట్లు చేస్తున్నారు.

షమీ.. వరల్డ్ కప్ 2023 కోసం ఎంపికైనా, 5 మ్యాచ్‌ల వరకు జట్టులోకి రాలేదు. హార్దిక్ పాండ్యా గాయపడటంతో, అక్టోబర్‌ 22న ధర్మశాల వేదికగా జరిగిన భారత్, న్యూజీలాండ్‌ మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ప్లేయరాఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఇప్పుడు అదే న్యూజీలాండ్ జట్టును సెమీఫైనల్‌లో ఎదుర్కొని, ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు.

అద్భుతంగా ఆడావు షమీ అంటూ మోదీ ట్వీట్

షమీ ప్రదర్శనను ప్రశంసించిన ప్రధాని మోదీ "ఈ రోజు సెమీ ఫైనల్ అద్భుత ప్రదర్శన వల్ల మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచే కాదు, మొత్తం వరల్డ్ కప్‌లో మహమ్మద్ షమీ బౌలింగ్ కొన్ని తరాల వరకు క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోతుంది" అన్నారు. "అద్భుతంగా ఆడావు షమీ" అంటూ ప్రశంసలు కురిపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

'వాట్ ఏ షమీ ఫైనల్'

మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన ట్వీట్‌లో షమీ ప్రదర్శనను అభినందిస్తూ, "వాట్ ఏ షమీ ఫైనల్, ఘనమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరినందుకు అభినందనలు" అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ," వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఏడు వికెట్లు.. ఇలాంటి నిజమైన మ్యాచ్ విన్నర్‌ జట్టులో ఉండటం ఒక వరం లాంటిది" అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

“షమీ ఏడు వికెట్లు తీస్తాడని ముందే కలగన్నాను”

ట్విట్టర్‌లో డాన్ మాటియో అనే పేరు గల యూజర్ , "సెమీ ఫైనల్‌లో షమీ ఏడు వికెట్లు తీస్తాడని నాకు కలొచ్చింది" అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కొంతమంది యూజర్లు “టైమ్ ట్రావెల్ చేశావా?” అని ప్రశ్నిస్తే,

మరికొంత మంది “ఫైనల్ గురించి ఏమైనా కలగన్నావా?” అని అడుగుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)