సచిన్‌కూ, విరాట్ కోహ్లీకీ అదే తేడా: వసీం అక్రమ్

ఫొటో సోర్స్, Getty Images
వన్డే క్రికెట్‌లో సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల(49) ప్రపంచ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీపై సచిన్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలో సచిన్, కోహ్లీల ఆట మధ్య పోలిక పెడుతూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీని పూర్తి చేశాడు. 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా కూడా ఎంపికయ్యాడు.
'ఏ స్పోర్ట్స్' అనే టీవీ చానల్ నిర్వహించిన 'ది పెవిలియన్' కార్యక్రమంలో- వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోవడంపై వసీం అక్రమ్ మాట్లాడాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆధునిక క్రికెట్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నానని కోహ్లీ నిరూపించుకున్నాడని వసీం అక్రమ్ ప్రశంసించాడు.
"సచిన్ 451 వన్డే ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు సాధించాడు, కోహ్లీ ఈ మైలురాయిని 277 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ఇది నమ్మశక్యం కానిది" అని అతడు వ్యాఖ్యానించాడు.
ఇదే కార్యక్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ, సెంచరీలే కాదు కోహ్లీ ఆటలో మరిన్ని ఘనతలున్నాయని కితాబిచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
కోహ్లీ సెంచరీలు మ్యాచ్‌లు గెలిపిస్తున్నాయి: షోయబ్ మాలిక్
"విరాట్ 49 సెంచరీలు సాధించడమే కాదు, ఆ సెంచరీల వల్ల చాలా మ్యాచ్‌లు గెలిచారు. ఇది చాలా ముఖ్యమైనది. నా అభిప్రాయం ప్రకారం సెంచరీ చేయడం చాలా పెద్ద విషయం, అయితే దాంతో మీరు మ్యాచ్‌లు గెలిస్తే, అంతకన్నా గొప్పది లేదు'' అని షోయబ్ మాలిక్ వ్యాఖ్యానించాడు.

ఫొటో సోర్స్, Getty Images
"మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, కోహ్లీ పరిస్థితులను బాగా అంచనా వేస్తాడు. అతను ఒక ఎండ్‌కు బాధ్యత వహించి, పరుగులు రాబడతాడు. అతనలా బ్యాటింగ్ చేయడం చాలా కాలంగా చూస్తున్నాం. కోహ్లీ ఫిట్‌నెస్ మరో స్థాయిలో ఉంటుంది. ఇపుడతనికి 35 ఏళ్లు, కానీ రెండు పరుగుల కోసం పరిగెత్తినప్పుడు కోహ్లీ 25 ఏళ్ల ఆటగాడిలా పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది. 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి, ఫీల్డింగ్‌కి వచ్చినప్పుడు కూడా అతని ఫిట్‌నెస్‌లో తేడా కనిపించడం లేదు. ఫీల్డింగ్ కూడా కీలకమైన ప్లేసుల్లోనే చేస్తాడు" అని అతడు అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
- సచిన్ ‘49 సెంచరీల’ ప్రపంచ రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ ఏమన్నాడు? తెందూల్కర్ ఇచ్చిన కితాబు ఏమిటి?
- వాహన బీమా పాలసీ ఎలా ఉంటే మీకు మేలు?
- ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














