‘పాకిస్తాన్‌ను ఓడించాం, ఇక ఆనందంగా ఇంటికి వెళ్తాం’ - అఫ్గానిస్తాన్ ప్రజల సంబరాలు.. తాలిబాన్లు ఏమన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
దశాబ్దాల తరబడి అనేక కష్టాలు పడుతున్న అఫ్గానిస్తాన్ ప్రజలకు అఫ్గాన్ క్రికెట్ జట్టు సంతోషాన్ని కానుకగా ఇచ్చింది.
చెన్నైలో సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
అఫ్గానిస్తాన్ వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌ను ఓడించడం ఇదే మొదటిసారి.
ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలు దశాబ్దాల తరబడి వివాదాస్పదంగానే ఉన్నాయి. వీటి మధ్య ఉన్న వైరం క్రికెట్ మ్యాచ్‌లోనూ స్పష్టంగా కనిపించింది.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జాద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
జాద్రాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 87 పరుగులు చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడానికి వచ్చినప్పుడు, ఈ అవార్డును ఎవరికి అంకితమిస్తారని ప్రశ్నించగా, పాకిస్తాన్ నుంచి బలవంతంగా వెళ్ళగొడుతున్న అఫ్గాన్ ప్రజలకు అంకితమిస్తున్నానని చెప్పాడు.
‘‘నేను ఈ మ్యాచ్‌లో బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. నేను సానుకూల దృక్పథంతో ఆడాలనుకున్నాను. చాలాసార్లు నేను, గుర్బాజ్ చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పాం.
మేమిద్దరం కలిసి అండర్ – 16 నుంచి చాలా మ్యాచ్‌లు ఆడాం. పాకిస్తాన్ నుంచి బలవంతంగా వెళ్ళగొడుతున్న అఫ్గానిస్తాన్ ప్రజలకు ఈ అవార్డును అంకితమిస్తున్నాను’’ అని జాద్రాన్ చెప్పాడు.
నవంబరు 1లోగా అఫ్గానిస్తాన్‌కు చెందిన 17 లక్షల మంది శరణార్థులను దేశం విడిచి వెళ్ళాల్సిందిగా పాకిస్తాన్ ఆదేశించింది.
పాకిస్తాన్ నిర్ణయం ఆమోదనీయం కాదంటూ అఫ్గానిస్తాన్ విమర్శించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ వీడియోల్లో ఏముంది?
ప్రపంచ కప్ టోర్నీకి ముందు, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌తో ఏడు మ్యాచుల్లో తలపడి అన్నింటిలోనూ ఓటమిపాలైంది.
అఫ్గానిస్తాన్ తన 8వ మ్యాచ్‌లో, అదీ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ను కంగు తినిపించింది. ఇటీవల ఇదే టోర్నీలో ఇంగ్లండ్‌ను కూడా ఓడించింది.
ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్ ఇది మూడో విజయం. ఇంతకు మునుపు 2015లో స్కాట్లాండ్‌ను ఓడించింది.
పాకిస్తాన్‌పై గెలుపుతో అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
ఈ పట్టికలో అట్టడుగున అంటే పదోస్థానంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కొనసాగుతోంది.
పాకిస్తాన్‌పై గెలుపుకు ముందు అఫ్గానిస్తాన్ 10వ స్థానంలో ఉంది.
పాకిస్తాన్‌పై గెలుపు తరువాత అఫ్గానిస్తాన్‌లో సంతోషం వెల్లువెత్తింది.
అఫ్గానిస్తాన్ జర్నలిస్టు హబీబ్‌ఖాన్ ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ వీడియో క్లిప్‌లో తుపాకీ కాల్పుల మోత వినిపించింది.
ఈ క్లిప్‌ను పోస్టు చేస్తూ- ‘‘ఇది వార్ జోన్ కాదు, కానీ పాకిస్తాన్‌ను ఓడించినందుకు కాబూల్‌లో చేసుకుంటున్న సంబరం’’ అని రాసుకొచ్చాడు.
అఫ్గానిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రజలు సంబరాలకు సంబంధించిన అనేక వీడియో క్లిప్‌లను హబీబ్‌ఖాన్ పోస్టు చేశారు.
వీటిలో చెన్నై చిదంబరం స్టేడియంలోని వీడియో క్లిప్ కూడా ఉంది.
‘‘పాకిస్తాన్‌పై గెలవడమంటే వరల్డ్‌కప్‌ను గెలవడమే. మా పని పూర్తయింది. మేమిప్పుడు ఆనందంగా ఇంటికి వెళతాం’’ అంటూ ఓ అఫ్గాన్ పౌరుడు చేసిన కామెంట్ అందులో ఉంది.
పాకిస్తాన్‌ను ఓడించాక అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి స్టేడియంలో డాన్స్ చేశాడు.
ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, ‘‘పాకిస్తాన్‌పై గెలుపును ఇండియాకు చెందిన ఓ పఠాన్ అఫ్గానిస్తాన్ పఠాన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టోర్నమెంట్ అంతటా అఫ్గానిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తున్నందుకు ఇండియాకు చాలా థాంక్స్’’ అని హబీబ్ ఖాన్ రాశారు.
అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ కూడా పాకిస్తాన్‌పై గెలుపు సంబరానికి సంబంధించి ఓ వీడియోను షేర్ చేశాడు.
‘‘అభినందనలు. ఈ గెలుపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ గెలుపు మన ప్రతిభ, సమష్టి కృషి వల్లే సాధ్యమైంది’’ అని రాసుకొచ్చాడు.
అఫ్గానిస్తాన్ టీమ్ తమ బస్సులో డాన్స్ చేస్తున్న వీడియోను అఫ్గానిస్తాన్ టీమ్ అభిమాని, అఫ్గాన్ మోడల్ వజ్మా అయూబీ షేర్ చేశారు.
‘‘నేను డాన్స్ చేస్తున్న వీడియోను ఇక్కడ పోస్టు చేయడం లేదు. మన టీమ్ సంతోషాన్ని చూడండి. నేను కూడా డాన్స్ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు కూడా నేనిలాగే సంతోషంతో డాన్స్ చేస్తుంటాను’’ అని వజ్మా రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అఫ్గానిస్తాన్ నుంచి అనేక మంది మహిళలు కూడా క్రికెటర్లు డాన్స్ చేస్తున్న వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు
అఫ్గాన్ న్యూస్ చానల్ టోలోన్యూస్ షేర్ చేసిన వీడియోలో, కాబూల్, కోస్త్‌లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా కాబూల్‌లో ప్రజల సంబరాలను పోస్టు చేసింది.
ఈ వీడియోలో కొంత మంది బాలికలు సంతోషంగా నృత్యం చేస్తూ కనిపించారు.
వీరంతా ‘‘జిందాబాద్, జిందాబాద్ అఫ్గానిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఈ వీడియోలో ఒక యువకుడు ‘‘అఫ్గానిస్తానంతటికీ ఈ రోజు ఉత్సవం లాంటిది. ఈ గెలుపు మా పురోగమనాన్ని చూపుతోంది’’ అనడం కనిపిచింది.
మరో యువకుడు ‘‘మొత్తం అఫ్గానిస్తాన్ ప్రజలందరకీ శుభాకాంక్షలు. మేం చాలా సంతోషిస్తున్నాం. దేశమంతా ఆనందంగా ఉంది’’ అని అన్నాడు.
టోలో న్యూస్ షేర్ చేసిన వీడియోలో షాపులు, మార్కెట్లలో అఫ్గాన్ ప్రజలు క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించడం, బాణా సంచా మోత, కాల్పుల శబ్దాలు కూడా కనిపించాయి.
చెన్నైలో అఫ్గాన్ పౌరులు కొందరు డాన్స్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ అయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
వారికి మా ప్రత్యేక సందేశం ఇది: తాలిబాన్లు
‘‘మా జాతీయ క్రికెట్ జట్టు ఓ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఎంతో మంది అసాధ్యమని చెప్పిన విజయాన్ని మేము అందుకున్నాం.
అఫ్గానిస్తాన్ సాధించిన ఈ విజయం మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న కొంత మందికి ఓ ప్రత్యేక సందేశం. మేము ముందుకు పోతున్నాం. మా వైపు చూడండి. కానీ మమ్మల్ని బాధించకండి’’ అని తాలిబాన్ అనుబంధ కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జాద్రాన్ చెప్పారు.
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ ప్రధాని కార్యాలయం కూడా ‘ఎక్స్’లో అఫ్గాన్ జట్టును అభినందించింది.
‘‘అఫ్గానిస్తాన్ నేషనల్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్‌ను ఓడించింది. జాతీయ క్రికెట్ జట్టుకు అభినందనలు. క్రికెట్ బోర్డుకు, అఫ్గాన్ పౌరులందరికీ అభినందనలు’’ అని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ‘‘50 ఓవర్ల మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిందున జట్టుకు అభినందనలు. తరువాతి మ్యాచ్‌లలోనూ ఇలాగే విజయాలు సాధించాలి’’ అని రాశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














