‘జట్టును సముద్రంలో కలిపేస్తా’ అని బిషన్ సింగ్ బేడీ ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, FAIRFAX MEDIA
భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు.
బేడీ రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. చాలా ఆపరేషన్లు చేయించుకొన్నారు. నెల క్రితం చేయించుకొన్న మోకాలి మార్పిడి ఆపరేషన్ వీటిలో ఒకటి.
బిషన్ సింగ్ బేడీ వయసు 77 సంవత్సరాలు.
ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1946 సెప్టెంబరు 25న పుట్టారు.
1966 నుంచి 1979 వరకు 67 టెస్ట్ మ్యాచులు ఆడిన బేడీ, 266 వికెట్లు పడగొట్టారు. ఆ సమయంలో ఆయన పది వన్డే మ్యాచులు కూడా ఆడారు. బేడీ రిటైర్ అయ్యే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన భారతీయుడు ఆయనే.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో బేడీ ఒకరు.
ఎర్రపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, శ్రీనివాస్ వెంకట్రాఘవన్‌లతో కలిసి బేడీ భారత స్పిన్ బౌలింగ్‌కు ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టారు. 1966 నుంచి 1978 వరకు దశాబ్ద కాలానికి పైగా భారత బౌలింగ్‌కు ఈ నలుగురు వెన్నెముకగా నిలిచారు.
1990ల మొదట్లో భారత క్రికెట్ జట్టుకు బేడీ కోచ్‌గా వ్యవహరించారు.
ఆయన నిర్మొహమాటంగా మాట్లాడేవారు.
1990లో ఓ సందర్భంలో భారత జట్టు పేలవ ప్రదర్శనతో విసుగు చెందిన బేడీ, ఇలా ఆడితే జట్టును తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తానని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
12 ఓవర్లలో ఆరు మెయిడెన్ ఓవర్లు
వన్డే మ్యాచుల్లో భారత్ తొలి విజయం సాధించడంలోనూ బేడీ కీలక పాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్‌లో, ఆయన తన ఫ్లైటెడ్ డెలివరీలతో ఈస్ట్ ఆఫ్రికాను 120 పరుగులకే కట్టడి చేశారు.
ఈ మ్యాచ్‌లో 12 ఓవర్లలో కేవలం ఎనిమిదే పరుగులు ఇచ్చి, బేడీ ఒక వికెట్ పడగొట్టారు. ఈ 12 ఓవర్లలో ఆరు ఓవర్లు మెయిడెన్ ఓవర్లు. దీనిని బట్టి ఆయన ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
నేటికీ ప్రపంచ కప్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఈ రికార్డు కూడా ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
బేడీని రెబల్ అనడం తప్పు: కపిల్ దేవ్
‘‘విమర్శకులు బిషన్ సింగ్ బేడీని ‘రెబల్’ అని అంటారు. కానీ అది తప్పు. నా దృష్టిలో ఆయన క్రికెటర్ల హక్కుల గురించి బాగా తెలిసిన వ్యక్తి’’ అని బేడీపై వచ్చిన ఒక పుస్తకంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రాశారు.
ఆయన క్రికెటర్ల తరపున పోరాడారని, వారికి మెరుగైన మ్యాచ్ ఫీజులు, ప్రయాణ, వసతి సదుపాయాలు సాధించేందుకు పాటుపడ్డారని కపిల్ ప్రశంసించారు.
భారత క్రికెట్ గౌరవాన్ని బేడీ ఇనుమడింపజేశారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
చిరస్మరణీయ విజయాలు అందించారు: ప్రధాని
దిల్లీ జట్టు తన మొదటి రెండు రంజీ ట్రోఫీలను బిషన్ సింగ్ బేడీ నాయకత్వంలోనే గెలుచుకుంది.
370 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో బేడీ రికార్డు స్థాయిలో ఏకంగా 1,560 వికెట్లు తీశారు.
బిషన్ సింగ్ బేడీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్, బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
భారత్‌కు బేడీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారని, భావి తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని మోదీ ఫ్రశంసించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, THE SYDNEY MORNING HERALD/GETTYIMAGES
బేడీ మరణం క్రికెట్ ప్రపంచానికి పెద్ద నష్టమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
బేడీ ఆటగాడిగానే కాకుండా కోచ్‌గా కూడా క్రికెట్‌కు ఎంతగానో సేవ చేశారని ఆయన చెప్పారు.
‘‘పంజాబ్ జట్టుకు బేడీ కోచ్‌గా ఉండగా, జట్టు రంజీ ట్రోఫీ గెలిచింది. ఆ జట్టులో నేను కూడా ఉన్నాను’’ అని ఆయన ప్రస్తావించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, EVENING STANDARD
బేడీ గొప్ప మనిషి: రామచంద్ర గుహ
బేడీ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదని, స్నేహశీలి అని టెస్టుల్లో 489 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పారు. యువ క్రికెటర్లకు తోడ్పాటు అందించేందుకు ఆయన చొరవ చూపేవారని తెలిపారు.
బేడీ గొప్ప క్రికెటర్ అని, అంతకంటే గొప్ప మనిషి అని చరిత్రకారుడు రామచంద్ర గుహ చెప్పారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- నీళ్ల కోసం వెళ్తే మొసళ్ల దాడులు.. వీటిని ఇండోనేషియా ఎందుకు ఆపలేకపోతోంది?
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- భారత్, చైనా: సరిహద్దుకు అటూఇటూ మళ్ళీ సేనల మోహరింపు... నాలుగేళ్ళుగా శీతాకాలంలో ఎందుకీ టెన్షన్స్?
- దేవుని వెల్లంపల్లి: ఇక్కడ తరతరాలుగా యానాదులే పూజారులు, ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














