టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ ఎడ్వర్డ్స్
- హోదా, బీబీసీ కన్వర్జేషన్
ఎముక అనేది శరీరంలో సంక్లిష్టమైన అవయవం. ఇది రకరకాల ఆకారాలలో, సైజుల్లో ఉంటుంది. అయితే, సాధారణ పౌరులతో పోలిస్తే కొందరు టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక పెద్దదిగా ఉంటుంది.
మనిషి వయసు పెరిగే కొద్దీ కండరాలు ఎలా బలాన్ని కోల్పోతాయో, ఎముకల విషయంలోనూ అదే జరుగుతుంది. ఇది మన జీవనశైలిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ఎముక కొల్లాజెన్, కాల్షియం వంటి సేంద్రీయ, అకర్బన భాగాల మిశ్రమంతో రూపొందింది.
ఇవి మనం కండరాలు పెంచుకున్నట్లు పెంచుకునే స్థితిలో ఉంటాయి. మనం శరీరంలో గూడులాగా అల్లుకుని ఉండటమే కాదు...కీలకమైన అవయవాలను రక్షిస్తాయి.
ఆరోగ్యకరమైన ఎముక చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిరంతరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. (పాత, దెబ్బతిన్న ఎముక తాజా ఎముకతో భర్తీ కావడం).
ఆరోగ్యవంతమైన వ్యక్తులలో దాదాపు ప్రతి పదేళ్లకోసారి ఈ పద్దతి ద్వారా అస్థి పంజరం మారుతుంది.
అయితే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారిలో ఎముకల భర్తీ చాలా నెమ్మదిగా జరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
టెన్నిస్ ఆటగాళ్లలో..
కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ముఖ్యంగా క్యాన్సర్ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు వంటివి ఎముకలకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి .
మృదులాస్థి, స్నాయువులు, కండరాల మాదిరి కాకుండా వివిధ కణాల సమూహంతో ఎముక రూపొందుతుంది. వీటిలో రోగ నిరోధక కణాలు, కొవ్వు కణాలు, రక్త కణాలు తదితరాలు ఉన్నాయి.
ఈ రకమైన కణాల మిశ్రమ చర్య జీవితాంతం శరీరంలో తగినంతగా ఎముక ఉండేలా సహాయపడుతుంది.
మన ఎముకలకు కలిగే నష్టాన్ని సరిచేయడానికి, పరిమాణం పెంచడానికి ప్రత్యేకమైన ఎముక కణాలు (ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్‌లు) పనిచేస్తాయి.
అందువల్ల ఒకే చేతితో సర్వ్ చేసే టెన్నిస్ ఆటగాడి చేతి ఎముక పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించవచ్చు.
ఎముకలు ఫ్రాక్చర్ కావడం ప్రమాదమే కాదు, మరణానికీ దారితీస్తుంది. మన కండరాలలో బలాన్ని పెంచుకుంటే, ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
మన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం జీవితాంతం ఎముకకు జరిగి నష్టాన్ని భర్తీ చేయడం చాలా అవసరం.
ఎముకలు ఫ్రాక్చర్ అయితే మనం కదల్లేని స్థితికి చేరతాం. నడవాలంటే కష్టం, రోజువారి పనులు చేసుకోలేం. బయటికెళ్లలేం.
మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే వయస్సుతో సంబంధం లేకుండా ఎముక సాంద్రత (బలం) బాగుంటుంది.
కాల్షియం (ఎముకలలో కీలకమైన ఖనిజం) సమృద్ధిగా ఉండే ఆహారం రోజుకు 700 మి.గ్రా. తీసుకుంటే మంచిది.
పాలు, పెరుగు, జున్ను పదార్థాలు కాల్షియానికి నిలయాలు. టోఫు, బీన్స్, కాయధాన్యాలు వంటి ఆహారాలలోనూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
శారీరక శ్రమే కీలకం
ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్షియంను పూర్తిగా గ్రహించడానికి మన శరీరానికి విటమిన్ డి అవసరం.
విటమిన్ డి కావాలంటే సూర్యరశ్మి శరీరానికి తాకే విధంగా బయట గడపడం కీలకం. రోజుకు పది నిమిషాల వరకు రెండు సార్లు ఇలా చేయడం ఉత్తమం.
శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటే విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోండి.
వ్యాయామం మీ ఎముకలను బలంగా ఉంచడానికి మరొక మార్గం, ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు బెటర్.
మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే నడవండి, మెట్లు ఎక్కండి.
అదేవిధంగా జంపింగ్ రోప్ లేదా వెయిట్ ట్రైనింగ్ వంటి కఠినమైన పనులు ఇంకా ఉత్తమం, అవి ఎముకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
జతచేసిన ఎముకలు కలవడం, వాటి పెరుగుదలను ప్రేరేపించడం దీనికి కారణం. ఏ వయసు వారైనా ఈ తరహా వ్యాయామాలు చేయవచ్చు.
వ్యాయామమనేది మీ ఫిట్‌నెస్, నైపుణ్యం స్థాయికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
ధూమపానం, ఆల్కహాల్ వంటివి తగ్గిస్తే మీ ఎముక కణాలు సరిగ్గా పని చేసే అవకాశం ఎక్కువుంటుంది.
మీ ఎముక బలం గురించి తెలుసుకోవాలన్నా, ఎముక ఖనిజ సాంద్రత తగ్గించే అనారోగ్యం (ఉదర కుహర వ్యాధి, పేగు వ్యాధి, మధుమేహం, క్యాన్సర్) బారిన పడినా వైద్యుడిని సంప్రదించండి.
మీ ఎముకలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు అనువుగా ఉండే పద్దతులను వైద్యులు సూచిస్తారు.
ఇవి కూడా చదవండి
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్గా రవితేజ అలరించాడా?
- డ్రీమ్ 11 యాప్లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














