సర్ఫరాజ్ ఖాన్: 37 మ్యాచ్‌లలో 13 సెంచరీలు.. అయినా టీమ్‌ఇండియాకు సెలక్ట్ చేయలేదు.. లావుగా ఉంటే ఆడనివ్వరా

సర్ఫరాజ్ ఖాన్

ఫొటో సోర్స్, INSTAGRAM/SARFARAZKHAN

    • రచయిత, అన్షుల్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొన్ని రోజులుగా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై చర్చ జరుగుతోంది. వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్తున్న భారత జట్టులో ఆయనకు చోటు దక్కకపోవడమే దీనికి కారణం.

వెస్టిండీస్ టూర్‌కు వెళ్తున్న భారత టెస్టు, వన్‌డే జట్లను జూన్ 23న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రకటించింది.

టెస్టు జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, అజింక్య రహానే వైస్-కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.

ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముఖేశ్ కుమార్‌లకు కొత్తగా చోటు దక్కగా బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా, బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీలు స్థానాన్ని కోల్పోయారు.

అయితే, ఎక్కువ మంది సర్ఫరాజ్ ఖాన్ గురించి ప్రశ్నిస్తున్నారు. అతడిని జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు.

గావస్కర్

ఫొటో సోర్స్, Getty Images

మాజీ క్రికెటర్లు ఏం అంటున్నారు?

జట్టులోకి తీసుకోవడానికి ఐపీఎల్‌లో ప్రతిభను గీటు రాయిగా తీసుకోవడంపై బీసీసీఐ సెలెక్టర్లను భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ విమర్శించారు.

ఈ విషయంపై ‘స్పోర్ట్స్ టాక్’ యూట్యూబ్ చానెల్‌తో సునీల్ గావస్కర్ మాట్లాడారు. ‘‘నేడు ఐపీఎల్‌లో బాగా ఆడితేనే, టెస్టు జట్టుకు ఎంపిక చేసేలా పరిస్థితులు మారిపోయాయి.’’ అని గావస్కర్ అన్నారు.

‘‘గత మూడు రంజీ సీజన్లలో సగటున 100 పరుగులను సర్ఫరాజ్ తీశాడు. ప్లేయింగ్ లెవెన్‌లోనూ ఆయనకు చోటు దక్కకపోవచ్చు. తర్వాత ఎంపిక చేయబోయే 16 మంది సభ్యుల జట్టులోనైనా అతడికి చోటు కల్పించాలి.’’ అని ఆయన చెప్పారు.

‘‘మీ ప్రతిభను గుర్తిస్తున్నామని అలాంటి ప్లేయర్ల ద్వారా యువ క్రీడాకారులకు మనం సందేశం ఇవ్వాలి. లేకపోతే, రంజీ ట్రోఫీలో బాగా ఆడేవారు కూడా నిరుత్సాహానికి గురవుతారు. అంతేకాదు, కేవలం ఐపీఎల్‌లో బాగా ఆడితేనే భారత జట్టులోకి తీసుకుంటారనే భావన ప్రజల్లోకి వెళ్తుంది.’’ అని ఆయన అన్నారు.

సర్ఫరాజ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఈ విషయంపై స్పందించారు.

  • నలుగురు ఓపెనర్ల అవసరం ఏముంది? వీరికి బదులుగా సర్ఫరాజ్‌ను మిడిల్ ఆర్డర్‌లో తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే అతడు నిలకడగా పరుగులు తీస్తున్నాడు.
  • ఈశ్వరన్, పాంచాల్ కూడా టెస్టు జట్టులో చోటు కోసం ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేవలం ఐపీఎల్‌లో ఆడనంత మాత్రాన వారి ప్రతిభను గుర్తించకపోతే ఎలా? అసలు రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు ఎలా ఇచ్చారు?

మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో భారీ పరుగులు తీసి జాతీయ జట్టులో చోటు లభించని క్రికెటర్‌గా సర్ఫరాజ్‌ను ప్రజలు గుర్తుపెట్టుకోవాలా? ఇలా చేయడం తప్పు. జట్టులోకి తీసుకోవాలంటే ఇంకా ఏం చేయాలో సెలెక్టర్లు అతడికి చెప్పాలి. లేకపోతే... ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌కు చాలా చెడ్డ పేరు వస్తుంది.’’ అని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సర్ఫరాజ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

దేశీయ మ్యాచ్‌లలో ప్రతిభ

ఇప్పటివరకు సర్ఫరాజ్ 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 54 ఇన్నింగ్స్‌లలో 4,992 పరుగులను తీశాడు. 13 సెంచరీలు, తొమ్మిది అర్థ శతకాలతో సగటున 79.65 పరుగులు తీశాడు.

రంజీ ట్రోఫీలో గత మూడు సీజన్లలో ముంబయి తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ భారీగా పరుగులు తీశాడు.

2019-20 రంజీ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లలో 928 రన్లను సర్ఫరాజ్ కొట్టాడు. వీటిలో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌లలో సగటు స్కోర్ 154.66 పరుగులు.

ఉత్తర్ ప్రదేశ్‌ జట్టుపై ట్రిపుల్ సెంచరీ (301 పరుగులు) కూడా సర్ఫరాజ్ కొట్టాడు.

2021-22 సీజన్‌లోనూ అతడి పరుగుల హవా కొనసాగింది. గత సీజన్‌లో ఆరు మ్యాచ్‌లలో 982 రన్లను కొట్టాడు. నాలుగు సెంచరీలతో సగటున 122.75 పరుగులు తీశాడు. దీనిలో ఒక డబుల్ సెంచరీ (275 పరుగులు) కూడా ఉంది.

2022-23 సీజన్‌లో మొత్తంగా పరుగులు తగ్గినప్పటికీ, సగటు మాత్రం 90కిపైనే ఉంది. మొత్తంగా 6 మ్యాచ్‌లలోని తొమ్మిది ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 556 రన్లు తీశాడు.

సర్ఫరాజ్ ఖాన్

ఫొటో సోర్స్, INSTAGRAM/SARFARAZKHAN

ఐపీఎల్‌లో ఎలా ఆడాడు?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచిన సర్ఫరాజ్.. ఐపీఎల్‌లో ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు.

గత సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అతడు నాలుగు మ్యాచ్‌లలో 53 రన్లు చేశాడు.

మొత్తం తన ఐపీఎల్ కెరియర్‌లో 50 మ్యాచ్‌లలో 585 రన్లను అతడు చేశాడు.

2019, 2015 సీజన్లలో మాత్రమే మొత్తం స్కోరును వంద దాటించగలిగాడు.

2015లో ఆర్‌సీబీ తరఫున ఆడిన అతడు 111 రన్లు, 2019లో పంజాబ్ జట్టుకు 180 పరుగులు తెచ్చిపెట్టాడు.

సర్ఫరాజ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

సర్ఫరాజ్‌కు ఎందుకు అవకాశం రాలేదు?

రంజీ ట్రోఫీలో మంచి ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ టెస్టు జట్టుకు సర్ఫరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయడం లేదు?

ఐపీఎల్‌లో ప్రతిభ ఆధారంగానే టెస్టు జట్టును ఎంపిక చేస్తున్నారా? ఈ విషయంపై సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.

సర్ఫరాజ్ ఖాన్ విషయంలో గోల్ పోస్టు ఎప్పటికప్పుడు మారుతూ వస్తోందని విమల్ కుమార్ అన్నారు.

‘‘మొదట్లో సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అతడు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. గత మూడేళ్లుగా అతడు బాగా రన్లు కొడుతున్నాడు. ఇప్పుడు కొత్తరకమైన ప్రశ్నలు వస్తున్నాయి. ముంబయి హెడ్ కోచ్‌ అమోల్ మజుందార్‌కు వేలు చూపించడంపై కొందరు సెలెక్టర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.’’అని విమల్ అన్నారు.

‘‘అతడు ఫిట్‌గా లేడని సెలెక్టర్లు అంటే.. తమ సొంత ట్రోఫీలు, సంస్థలనే బీసీసీఐ ప్రశ్నిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే భారత్‌లో రంజీ అత్యుత్తమ ట్రోఫీ. మరి ఫిట్‌గాలేని క్రికెటర్ వెయ్యి పరుగులు తీయగలడా?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘సర్ఫరాజ్‌కు క్రమశిక్షణలేదని కొందరు అంటున్నారు. హర్బజన్ సింగ్ విషయంలోనూ యాటిట్యూడ్ సమస్య ఉండేది. కానీ, అతడు మెరుగైన ప్రతిభ చూపేవాడు. అదే సమస్య అయితే, బీసీసీఐ సెలెక్టర్లు దీన్ని వేరే కోణంలో పరిష్కరించాలి. అంతేకానీ, అసలు అవకాశమే ఇవ్వకుండా ఉండకూడదు.’’ అని ఆయన అన్నారు.

మరోవైపు బీబీసీ ప్రతినిధి పరాగ్ పాఠక్ స్పందిస్తూ సర్ఫరాజ్‌కు ఫిట్‌నెస్సే అతిపెద్ద అడ్డంకని అన్నారు.

‘‘విరాట్ కెప్టెన్ అయినప్పటి నుంచి భారత జట్టులో ఫిట్‌నెస్ ప్రమాణాలు అమాంతం పెరిగిపోయాయి. సర్ఫరాజ్ రన్లు తీస్తున్నాడు, ఆ విషయాన్ని కాదనలేం. కానీ, ఫిట్‌నెస్‌లోనూ అతడు తనని తాను నిరూపించుకోవాలి.’’ అని పాఠక్ అన్నారు.

ఇక ఐపీఎల్‌లో ప్రతిభ గురించి విమల్ మాట్లాడుతూ.. ‘‘ఒక ప్లేయర్ ఐపీఎల్‌లో రన్లు తీస్తే అతడికి అది పాజిటివ్ అవుతుంది. ఇటు రుతురాజ్ గైక్వాడ్, అటు యశస్వి జైస్వాల్ ఇద్దరూ ఐపీఎల్‌తోపాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ తామేంటో నిరూపించుకున్నారు.’’అని చెప్పారు.

‘‘ఐపీఎల్‌లో ప్రతిభ చూపించకపోవడంతో ప్రభావం పడొచ్చు. కానీ, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారీ లాంటి వారు కూడా ఐపీఎల్‌లో పెద్దగా ప్రతిభ చూపించలేదు. కానీ, టెస్టుల్లో వారు మెరుగ్గా ఆడారు. ఇలాంటి విషయాలను బీసీసీఐ పెద్దగా పట్టించుకోదని అనుకుంటున్నా.’’ అని ఆయన అన్నారు.

సర్ఫరాజ్ ఖాన్

ఫొటో సోర్స్, INSTAGRAM/SARFARAZKHAN

సర్ఫరాజ్ ఏం అంటున్నాడు?

ఈ విషయంలో సర్ఫరాజ్ అధికారికంగా స్పందించలేదు. కానీ, ఇటీవల ఇన్‌స్టాలో అతడు ఒక వీడియో పోస్ట్ చేశాడు.

గత జనవరిలో దిల్లీ వర్సెస్ ముంబయి రంజీ మ్యాచ్ జరిగినప్పటి వీడియో అది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ సెంచరీ (125 రన్లు ) కొట్టాడు.

సర్ఫరాజ్‌ను జట్టులోకి తీసుకోకపోవడానికి ఫిట్‌నెస్‌తోపాటు క్రమశిక్షణ లేకపోవడం కూడా కారణమని బీసీసీఐ వర్గాలు పీటీఐ వార్తా సంస్థతో చెప్పాయి.

అయితే, ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలూలేవని ముంబయి క్రికెట్ బోర్డు ప్రతినిధులు పీటీఐతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆండ్రూ సైమండ్స్: కారు ప్రమాదంలో కన్నుమూసిన ఈ క్రికెటర్ జీవితంలోని ముఖ్యాంశాలు

సోషల్ మీడియాలో ఏం అంటున్నారు?

ఈ అంశంపై ‘‘క్రికెట్ వీడియోస్’’ అనే ట్విటర్ హ్యాండిల్ స్పందిస్తూ.. ‘‘ఓ రంజీ మ్యాచ్ సమయంలో స్టాండ్‌లో కూర్చున్న చేతన్ శర్మ వైపు చూస్తూ సర్ఫరాజ్ ఖాన్ ఉద్రేకతంతో స్పందించడం చాలా మందికి నచ్చకపోవచ్చు.’’ అని వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఫర్హాన్ జుబేరీ స్పందిస్తూ.. ‘‘సర్ఫరాజ్ ఖాన్‌లా ఉండటం అంత తేలిక కాదు. చాలా రన్లు కొట్టినప్పటికీ అతడికి జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో బాగా ఆడేవారికే బీసీసీఐ అవకాశం ఇస్తోంది. ఇదొక కొత్త సంప్రదాయం అయిపోయింది.’’అని వ్యాఖ్యలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

అనిల్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘మీరు ఎవరినైనా దెబ్బ తీయాలి అనుకుంటే నైతికంగా దాడి చేయడమే. గత మూడేళ్లుగా రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ సెంచరీలు కొడుతున్నాడు. అయినప్పటికీ టెస్టు జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీన్నే వివక్ష అంటారు.’’ అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)