వరల్డ్ కప్ 2023: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్యలో జరగబోయే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్‌ ప్రకటన విడుదలైంది.

అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 19న జరుగుతుంది.

ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చే భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది.

46 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంటుకు 10 నగరాల్లోని స్టేడియాలను ఎంపిక చేశారు.

ఈ ప్రపంచ కప్‌లో మొత్తం 10 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఎనిమిది టీమ్‌లను ఎంపిక చేశారు.

ఈ రెండు టీమ్‌లు ఎవరు అనే దానిపై నిర్ణయించేందుకు క్వాలిఫైయర్స్ జరుగుతున్నాయి. జూలై 9 నాటికి క్వాలిఫైయింగ్ రౌండ్లు పూర్తవుతాయి. ఆ తర్వాత మిగిలిన రెండు టీమ్‌లు నిర్ణయిస్తారు.

రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఈ ప్రపంచ కప్‌ను ఆడతారు. అంటే అన్ని జట్లు కూడా ప్రతి ఒక్క టీమ్‌తో పోటీ పడతాయి.

నాకౌట్ స్టేజీలు, సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌ల కోసం టాప్ నాలుగు జట్లు క్వాలిఫై అవుతాయి.

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, ఇండియా 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, ఇండియా 2023

ఎప్పుడు, ఎవరెవరి మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి?

అక్టోబర్ 5: ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజీలాండ్.. అహ్మదాబాద్‌లో జరుగుతుంది

అక్టోబర్ 6: పాకిస్తాన్, క్వాలిఫైయింగ్ టీమ్ 1.. మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది.

అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. ధర్మశాల వేదికగా కానుంది.

అక్టోబర్ 7: సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. దిల్లీలో ఆడతారు

అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. చెన్నై వేదికగా జరుగుతుంది

అక్టోబర్ 9: న్యూజీలాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. హైదరాబాద్‌లో ఆడతారు

అక్టోబర్ 10: ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్.. ధర్మశాల వేదికగా జరగనుంది.

అక్టోబర్ 11: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. దిల్లీలో జరుగుతుంది మ్యాచ్.

అక్టోబర్ 12: పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. హైదరాబాద్ వేదిక కానుంది.

అక్టోబర్ 13: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా.. లక్నోలో జరుగుతుంది.

అక్టోబర్ 14: న్యూజీలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్.. చెన్నైలో ఆడతారు.

అక్టోబర్ 14: ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. దిల్లీలో ఈ మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.

అక్టోబర్ 16: ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. లక్నో వేదిక కానుంది.

అక్టోబర్ 17: సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. ధర్మశాలలో మ్యాచ్ జరగనుంది.

అక్టోబర్ 18: న్యూజీలాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. చెన్నైలో మ్యాచ్

అక్టోబర్ 19 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. పుణేలో జరగనుంది ఈ మ్యాచ్.

అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్యలో.. బెంగళూరు వేదిక

అక్టోబర్ 21: ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా.. ముంబైలో ఆడతారు

అక్టోబర్ 21: క్వాలిఫైయింగ్ టీమ్ 1 వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. లక్నోలో జరుగుతుంది.

అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజీలాండ్.. ధర్మశాల వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్.

అక్టోబర్ 23: పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. చెన్నై వేదిక కానుంది.

అక్టోబర్ 24: సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్‌.. ముంబైలో మ్యాచ్

అక్టోబర్ 25: ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. దిల్లీ వేదికగా జరగనుంది.

అక్టోబర్ 26: ఇంగ్లాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. బెంగళూరు

అక్టోబర్ 27: పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా.. చెన్నైలో జరుగుతుంది

అక్టోబర్ 28: బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. కోల్‌కతాలో జరుగుతుంది.

అక్టోబర్ 29: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. లక్నో వేదిక

అక్టోబర్ 30: ఆఫ్గనిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయిగ్ టీమ్ 2.. పూణే వేదిక

అక్టోబర్ 31: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్.. కోల్‌కతాలో మ్యాచ్ జరగుతుంది

నవంబర్ 1: న్యూజీలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా.. పూణేలో ఆడతారు

నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. ముంబైలో మ్యాచ్ జరగనుంది.

నవంబర్ 3: ఆఫ్గనిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. లక్నోలో మ్యాచ్ జరగనుంది.

నవంబర్ 4: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్.. అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 4: న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్తాన్.. బెంగళూరు స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 5: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా.. కోల్‌కతా వేదిక కానుంది.

నవంబర్ 6: బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. దిల్లీ స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 7: ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. ముంబై వేదిక కానుంది..

నవంబర్ 8.: ఇంగ్లాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. పూణేలో జరగనుంది.

నవంబర్ 9: న్యూజీలాండ్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 2.. బెంగళూరు స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 10: సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. అహ్మదాబాద్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడనున్నారు.

నవంబర్ 11: భారత్ వర్సెస్ క్వాలిఫైయింగ్ టీమ్ 1.. బెంగళూరు వేదిక

నవంబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్.. పూణేలో జరుగుతుంది.

నవంబర్ 12: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్.. కోల్‌కతా వేదిక కానుంది.

తొలి సెమీ ఫైనల్ - నవంబర్ 15: ముంబై

రెండో సెమీ ఫైనల్ - నవంబర్ 16: కోల్‌కతా

ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్

కీలక మ్యాచ్‌లు... ఎవరెవరి మధ్య జరుగుతాయి?

అక్టోబర్ 5: ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజీలాండ్.. అహ్మదాబాద్‌లో జరుగుతుంది

అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్.. ధర్మశాల వేదికగా కానుంది.

అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. చెన్నై వేదికగా జరుగుతుంది

అక్టోబర్ 13: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా.. లక్నోలో జరుగుతుంది

అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది

అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్యలో.. బెంగళూరు వేదిక

అక్టోబర్ 21: ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా.. ముంబైలో ఆడతారు

అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజీలాండ్.. ధర్మశాల వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్.

అక్టోబర్ 29: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. లక్నో వేదిక

నవంబర్ 4: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్.. అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది.

నవంబర్ 12: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్.. కోల్‌కతా వేదిక కానుంది.

తొలి సెమీ ఫైనల్ - నవంబర్ 15: ముంబై

రెండో సెమీ ఫైనల్ - నవంబర్ 16: కోల్‌కతా

ఫైనల్ - నవంబర్ 19: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

మ్యాచ్‌ల కోసం ఎంపికైన నగరాలు

ప్రపంచ కప్‌ను నిర్వహించేందుకు 10 నగరాలను ఎంపిక చేశారు. మ్యాచ్‌లు జరిగే నగరాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లక్నో, పుణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈసారి ఒక్క మ్యాచ్ కూడా షెడ్యూల్ చేయలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)