భారత క్రికెట్ టీమ్ వెస్టిండీస్ టూర్ షెడ్యూల్ ఇదే...

భారత జట్టు వెస్టిండీస్ టూర్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ-20 మ్యాచులు ఆడుతుంది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. భారత టీమ్ వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, ANI

    భారత క్రికెట్ టీమ్ వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది.

    టీమిండియా అక్కడ రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.

    తొలి టెస్ట్ జూలై 12 నుంచి 16 వరకు డోమినికాలోని విండ్సర్ పార్క్‌లో జరగనుంది.

    రెండోది ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్‌లో జూలై 20 నుంచి 24 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

    మూడు వన్డేలు జూలై 27న, జూలై 29న, ఆగస్ట్ 1న జరగనున్నాయి.

    ఆగస్ట్ 3, 6, 8, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. తిరుపతి: మహిళా మార్ట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది?

  4. భోపాల్‌లోని ప్రభుత్వ ఆఫీసులో అగ్నిప్రమాదం, కాలి బూడిదైన కీలక పత్రాలు

    భోపాల్‌లో అగ్నిప్రమాదం

    ఫొటో సోర్స్, Shuraih Niazi

    మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సచివాలయానికి దగ్గర్లో ఉన్న సాత్పురా భవంతిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.

    ఈ అగ్నిప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు.

    సాత్పురా భవన్‌లో ఎన్నో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.

    మూడో అంతస్తులో అగ్నిప్రమాదం మొదలై, ఆరో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇరవైకి పైగా ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి.

    షెడ్యూల్డ్ ట్రైబ్ రీజనల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కి చెందిన కార్యాలయంలో తొలుత అగ్నిప్రమాదం సంభవించింది.

    ఈ అగ్నిప్రమాదంలో ఇతర విభాగాలకు చెందిన కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. బిపర్‌జోయ్ తుపాన్: గంటకు 145 కి.మీ వేగంతో తీరాన్ని తాకే అవకాశం, ప్రధాని సమీక్ష

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    బిపర్‌జోయ్‌ తుపాన్‌ను ఎదుర్కోవడంపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

    ఈ తుపాన్‌ నేపథ్యంలో ఎలాంటి సహాయక, ఉపశమన చర్యలు చేపడుతున్నామో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు ప్రధాన మంత్రికి వివరించాయి.

    ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రధానమంత్రి సూచించారు.

    సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో బిపర్‌జాయ్ తుపాన్ తీరాన్ని దాటనుందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది.

    వేగవంతమైన గాలులతో జూన్ 15న పాకిస్తాన్‌లోని కరాచీ సిటీ, గుజరాత్‌ల సముద్ర తీరాల మధ్యల ఇది తీరాన్ని తాకనుందని చెప్పింది.

    ఈ సమయంలో గంటకు 145 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

    తుపాన్ ప్రభావంతో గుజరాత్‌లోని కచ్, ద్వారకా, జమ్నానగర్‌, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్ ప్రాంతాలలో జూన్ 14 నుంచి 15 వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ధోనీని పొగిడితే హర్భజన్ సింగ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు... వారిద్దరికీ గతంలో ఏమైనా గొడవలున్నాయా?

  7. లోకం చుట్టిన వీరుడు... ఎక్కడా విమానం ఎక్కలేదు

  8. ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

  9. మీరా రోడ్డు మర్డర్: హత్యకు గురైన సరస్వతి పొడుగైన జుట్టు ఫోటోలు చూసి తల్లడిల్లిన ఆమె సోదరి

    హత్య

    ఫొటో సోర్స్, ANI

    ముంబయి సమీపంలోని మీరా రోడ్డులో 32 ఏళ్ల సరస్వతి వైద్యను ఆమెతో సహజీవనం చేస్తున్న 56 ఏళ్ల మనోజ్ సానే దారుణంగా హత్య చేసి ముక్కలుగా కోసి, కుక్కర్‌లో ఉడికించిన కేసులో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి.

    సరస్వతి పొడుగైన జుట్టు ఫోటోలను చూసి ఆమె సోదరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఆ జుట్టును కత్తిరించి వంటగదిలో గట్టుపై మనోజ్ పెట్టారని, ఆ దృశ్యాలను పోలీసులు ఫోటో తీసి ఆమె సోదరికి చూపించారు.

    సరస్వతికి నలుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. వీరిలో ముగ్గురి నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. వీరిలో ఒకరు ఆ ఫోటోలను చూసిన వెంటనే భావోద్వేగానికి గురయ్యారు.

    ఈ కేసులో మనోజ్‌కు కఠినమైన శిక్ష పడేలా చూడాలని వారు పోలీసులను కోరారు.

    విచారణలో భాగంగా మనోజ్ ఫోన్‌ను పోలీసులు చెక్‌చేశారు. తరచూ అతడు పోర్న్ చూస్తాడని, కొన్ని పోర్న్ సైట్ల పేర్లను పేపర్‌పై కూడా రాసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

    త్వరలో సరస్వతి అక్కా చెల్లెళ్ల ముందు కూర్చోబెట్టి మనోజ్‌ను విచారిస్తామని పోలీసులు చెప్పారు. రోజుకు కొన్ని గంటలపాటు అతడిని విచారిస్తున్నామని, అయితే, అతడు పదేపదే మాటలు మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు.

    ఈ ఘటనపై గతవారం బీబీసీ ప్రచురించిన కథనం కోసం క్లిక్ చేయండి:

  10. నొవాక్ జకోవిచ్: అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సెర్బియా దిగ్గజం

    జకోవిచ్

    ఫొటో సోర్స్, Getty Images

    టెన్నిస్‌లో సెర్బియన్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు.

    ఆదివారం పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌పై విజయం సాధించి, అతడు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకున్నాడు.

    మూడు గంటల 13 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ జకోవిచ్ 7-6 (7/1), 6-3, 7-5తో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్‌ను ఓడించాడు.

    తద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.

    నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను కనీసం మూడుసార్లు గెలిచిన తొలి ఆటగాడిగా మరో రికార్డును కూడా జకోవిచ్ సొంతం చేసుకున్నాడు.

    ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన వెంటనే జకోవిచ్‌కు స్పెయిన్‌కు చెందిన అతడి చిరకాల ప్రత్యర్థి రఫేల్ నాదల్ అభినందనలు తెలిపాడు. ఇది అద్భుతమైన విజయమని కితాబిచ్చాడు.

    23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలవడం అనేది ఒకప్పుడు ఊహకు కూడా అందేది కాదని, అలాంటిది నువ్వు గెలిచి చూపించావని అతడిని నాదల్ ప్రశంసించాడు.