ఐపీఎల్: చివరి ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు కొట్టి కోల్‌కతాను గెలిపించిన రింకూ సింగ్

అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ చివరి ఓవర్లో విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. గుజరాత్ టైటాన్స్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని అందుకొనేందుకు చివరి ఐదు బంతుల్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. ప్రియాంశు రాజావత్: ఆర్లియన్స్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా భారతీయ క్రీడాకారుడు

    ప్రియాంశు రాజావత్

    ఫొటో సోర్స్, Twitter/BAI Media

    ఫొటో క్యాప్షన్, ప్రియాంశు రాజావత్

    ఆర్లియన్స్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన ప్రియాంశు రాజావత్ విజేతగా నిలిచారు.

    ఫ్రాన్స్‌లోని ఆర్లియన్స్ నగరంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రియాంశు డెన్మార్క్‌కు చెందిన మాగ్నస్ జోహాన్సన్‌పై 21-15, 19-21, 21-16 తేడాతో విజయం సాధించాడు.

    ప్రియాంశు ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌లలో 58వ స్థానంలో ఉండగా మాగ్నస్ 49వ ర్యాంకులో ఉన్నాడు.

    కాగా ప్రియాంశుకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్.

    మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాంశు 2022లో థామస్ కప్ గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడు.

    ప్రియాంశు విజయంపై ట్విటర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. 'యజమాని వేధింపులు' భరించలేక ఇంటికి తిరిగి వెళ్లేందుకు వందల కిలోమీటర్లు నడిచిన ముగ్గురు వలస కూలీల కథ

  4. ఐపీఎల్: చివరి ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు కొట్టి కోల్‌కతాను గెలిపించిన రింకూ సింగ్

    రింకూ సింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రింకూ సింగ్

    అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ చివరి ఓవర్లో విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. తన జట్టుకు అసాధారణమైన విజయాన్ని అందించారు.

    గుజరాత్ టైటాన్స్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని అందుకొనేందుకు రింకూ సింగ్ చివరి ఐదు బంతుల్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టారు.

    20వ ఓవర్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు మొత్తం 29 పరుగులు అవసరమయ్యాయి.

    రింకూ సింగ్ చెలరేగడంతో ఆరు బంతుల్లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. కోల్‌కతా స్కోరు 207కు చేరుకుంది. మూడు వికెట్ల తేడాతో జట్టు జయభేరి మోగించింది.

    21 బంతుల్లో మొత్తం ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 48 పరుగులు సాధించిన రింకూ సింగ్ నాటౌట్‌గా నిలిచారు.

    విజయ్ శంకర్

    ఫొటో సోర్స్, Getty Images

    విజయ శంకర్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

    తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

    ఆ జట్టులో విజయ్‌ శంకర్‌ 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు.

    21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు విజయ్ శంకర్ చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.

    గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు రాగా అందులో విజయ్ శంకర్ ఒక్కడే 41 పరుగులు చేశాడు.

    కాగా మరో బ్యాటర్ సాయి సుదర్శన్‌ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు.

    శుభమన్‌ గిల్ 31 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు,వృద్ధిమాన్‌ సాహా 17, అభినవ్‌ మనోహర్‌ 14 పరుగులు చేశారు.

    కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా సుయాశ్ శర్మ ఒక వికెట్ తీశాడు.

    Rashid Khan

    ఫొటో సోర్స్, Getty Images

    రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసినా..

    అనంతరం 205 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.

    నితీశ్ రాణా 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.

    కాగా 16వ ఓవర్‌లోజోసెఫ్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ అవుట్ అయిన తరువాత రషీద్ ఖాన్ వేసిన 17వ ఓవర్‌లో మ్యాచ్ ఒక్కసారిగా గుజరాత్ టైటాన్స్ వైపు మారింది.

    రషీద్ ఖాన్ ఆ ఓవర్లో వరుసగా రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ తీయడంతో 16.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులతో క్లిష్టపరిస్థితులలో చిక్కుకుంది కోల్‌కతా జట్టు.

    దీంతో చివరి ఓవర్ వచ్చేసరికి కోల్‌కతా జట్టు 29 పరుగులు చేయాల్సి ఉండగా ఆ ఓవర్లో చివరి 5 బంతులకు 5 సిక్సర్లు కొట్టి రింకూ సింగ్ జట్టును గెలిపించాడు.

  5. లారా బెనాంటి: రెండు వేల మంది ప్రేక్షకుల ముందు స్టేజ్‌పైనే గర్భస్రావం.. ‘ఆ నొప్పి నాకు కొత్త కాదు’

  6. సెల్ఫీ వీడియోలతో మీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చా? స్మార్ట్ ఫోన్‌తో రక్తపరీక్ష చేసుకోవచ్చా?

  7. మెక్సికోలో కాథలిక్ మత బోధకులను ఎందుకు చంపేస్తున్నారు?

  8. కిండలం: ఈ గ్రామంలోని ప్రజలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?

  9. ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీలోని గిరిజన జంటను కలిసిన మోదీ

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్లారు.

    ఈ సందర్భంగా ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముదుమలై ఫారెస్ట్ రిజర్వులోని ఏనుగులను సంరక్షించే గిరిజన జంట బొమ్మన్, బెల్లీలను మోదీ కలిశారు.

    వారితో కలిసి ఏనుగులకు చెరుకు గడలను తినిపించారు.

    ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీకి ఇటీవలే ఆస్కార్ అవార్డు దక్కింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ముదుమలై ఫారెస్ట్ రిజర్వు ప్రాంతంలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని కూడా మోదీ కలిశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌ సందర్శించిన ప్రధాని మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

    కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌కు మోదీ సందర్శించారు. దీంతో పాటు అక్కడే ఉన్న తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌కు కూడా మోదీ వెళ్లారు. ఈ క్యాంప్‌లో ఏనుగులకు చెరుకు గడలను తినిపించారు.

    ముదుమలై టైగర్ రిజర్వ్‌ను కూడా మోదీ సందర్శించనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  11. అయోధ్య నగరానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

    ఏక్‌నాథ్ షిండే

    ఫొటో సోర్స్, ANI

    మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అయోధ్య నగరాన్ని సందర్శించనున్నారు.

    ఆయనకు స్వాగతం చెబుతూ అయోధ్య నగరమంతా పోస్టర్లు వెలిశాయి.

    ఏక్‌నాథ్ షిండేతో పాటు శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అయోధ్యలో పర్యటించనున్నారు.

    గతేడాది జూన్‌లో మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అయోధ్యకు షిండే తొలిసారి వెళ్తున్నారు.

    సరయు నది ఘాట్లలో ఏక్‌నాథ్ షిండే ఆర్తి నిర్వహించనున్నారు. అలాగే, నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని సందర్శించనున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ఇరాన్: హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు పబ్లిక్ ప్రాంతాల్లో కెమెరాలు

    ఇరాన్ మహిళలు

    ఫొటో సోర్స్, EPA

    హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు ఇరాన్ అధికారులు పబ్లిక్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నారు.

    మహిళలు తమ జుట్టును సరిగ్గా కవర్ చేసుకోకపోతే, హెచ్చరికల మెసేజ్‌లను పంపనున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.

    హిజాబ్ చట్టం ఉల్లంఘనలను తగ్గించేందుకు ఇది సాయపడుతుందన్నారు.

    మహసా అమినీ పోలీస్ కస్టడీలో మరణించిన తర్వాత, ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ నిబంధనలపై ఆందోళనలు చెలరేగాయి.

    అమినీ మరణం తర్వాత చాలా మంది మహిళలు ముఖ్యంగా పెద్ద నగరాల్లో వారు తలపై వస్త్రాన్ని ధరించడం లేదు.

    అరెస్ట్ అవుతారనే ప్రమాదం ఉన్నప్పటికీ, మహిళలు హిజాబ్ రూల్‌ను ఉల్లంఘిస్తున్నారు.

    హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే వారిని గుర్తించి, వారికి వార్నింగ్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లు పంపేందుకు ఈ స్మార్ట్ కెమెరాలు, ఇతర పరికరాలు ఉపయోగపడతాయని పోలీసులు చెబుతున్నారు

    మహిళలు తమ తలని హిజాబ్‌తో ధరించే చట్టం 1979 నుంచి అమల్లో ఉంది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే జరిమానాలను లేదా అరెస్ట్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ఈ రూల్‌పై ఇరాన్‌ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.