ఐపీఎల్: దిల్లీపై 57 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం
రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అర్ధ శతకాలు సాధించారు. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ కేవలం 142 పరుగులే చేయగలిగింది.
లైవ్ కవరేజీ
ఇరాన్: హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు పబ్లిక్ ప్రాంతాల్లో కెమెరాలు

ఫొటో సోర్స్, EPA
హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు ఇరాన్ అధికారులు పబ్లిక్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
మహిళలు తమ జుట్టును సరిగ్గా కవర్ చేసుకోకపోతే, హెచ్చరికల మెసేజ్‌లను పంపనున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.
హిజాబ్ చట్టం ఉల్లంఘనలను తగ్గించేందుకు ఇది సాయపడుతుందన్నారు.
మహసా అమినీ పోలీస్ కస్టడీలో మరణించిన తర్వాత, ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ నిబంధనలపై ఆందోళనలు చెలరేగాయి.
అమినీ మరణం తర్వాత చాలా మంది మహిళలు ముఖ్యంగా పెద్ద నగరాల్లో వారు తలపై వస్త్రాన్ని ధరించడం లేదు.
అరెస్ట్ అవుతారనే ప్రమాదం ఉన్నప్పటికీ, మహిళలు హిజాబ్ రూల్‌ను ఉల్లంఘిస్తున్నారు.
హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే వారిని గుర్తించి, వారికి వార్నింగ్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లు పంపేందుకు ఈ స్మార్ట్ కెమెరాలు, ఇతర పరికరాలు ఉపయోగపడతాయని పోలీసులు చెబుతున్నారు
మహిళలు తమ తలని హిజాబ్‌తో ధరించే చట్టం 1979 నుంచి అమల్లో ఉంది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే జరిమానాలను లేదా అరెస్ట్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ఈ రూల్‌పై ఇరాన్ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఐపీఎల్: చివరి ఓవర్లో ఐదు వరుస సిక్సర్లు కొట్టి కోల్‌కతాను గెలిపించిన రింకూ సింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష కాబోతున్నాయా?
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వివరాలివీ..
తైవాన్‌ను చుట్టుముట్టే రిహార్సల్స్ చేస్తున్న చైనా
అక్కడ ఏడాది అంటే భూమిపై 84 ఏళ్లు.. ఆ సుదూర గ్రహం విశేషాలు ఇవీ
విక్టోరియా: కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రొఫెసర్ నగ్నంగా ఎందుకు నిరసన తెలుపుతుంటారు?
సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్; టైమింగ్స్ ఏంటి..? టికెట్ ధర ఎంత..? ఎక్కడెక్కడ ఆగుతుంది?, అమరేంద్ర, బీబీసీ ప్రతినిధి

సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8 ఈ రైలును ప్రారంభించనున్నారు.
సికంద్రాబాద్ స్టేషన్లో ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.05గంటల మధ్య రైలును జెండా ఊపి మోదీ ప్రారంభించనున్నారని రైల్వే శాఖ ప్రకటించింది.
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. దీన్ని జనవరి 15వ తేదీన వర్య్చువల్ గా మోదీ ప్రారంభించారు.
సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలు టైమింగ్స్ ఏంటి..?
సికింద్రాబాద్-తిరుపతి మధ్య రైలు ప్రయాణ సమయం 8.30 గంటలు.
రైలులో ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లు ఉన్నాయి.
ఈ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
సికింద్రాబాద్ నుంచి 02701 నంబరుతో ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి నుంచి 02702 నంబరుతో మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నాలుగు స్టాపులున్నాయి.
అవి నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.
ఇందులో నల్లగొండ, ఒంగోలు, నెల్లూరులో నిమిషం చొప్పున ఆగుతుంది.
గుంటూరులో ఐదు నిమిషాలు ఆగుతుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో ఆగే స్టేషన్లు, సమయాలు ఇలా
ఉదయం 6 గంటలు – సికింద్రాబాద్
7.19 – నల్లగొండ
9.45 – గుంటూరు
11.09 – ఒంగోలు
మధ్యాహ్నం 12.29 – నెల్లూరు
2.30 – తిరుపతి
తిరుపతి నుంచి సికింద్రాబాద్ మార్గంలో ఆగే స్టేషన్లు, సమయాలు
మధ్యాహ్నం 3.15 గంటలు – తిరుపతి
సాయంత్రం 5.20 – నెల్లూరు
6.30 – ఒంగోలు
రాత్రి 7.45 – గుంటూరు
10.10 – నల్లగొండ
11.45 - సికింద్రాబాద్
టికెట్ ధర ఎంత..?
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్ ధర ఛైర్ కార్ లో రూ.1680 గా రైల్వే శాఖ నిర్ణయించింది.
ఇందులో బేస్ ఫేర్ – రూ.1168
రిజర్వేషన్ ఛార్జీలు – రూ.40
సూపర్ ఫాస్ట్ ఛార్జీలు – రూ.45
జీఎస్టీ – రూ.63
క్యాటరింగ్ ఛార్జీలు – రూ.364
అలాగే ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జీ రూ.3080గా ఉంది.
ఇందులో బేస్ ఫేర్ – రూ.2399
రిజర్వేషన్ ఛార్జీలు – రూ.60
సూపర్ ఫాస్ట్ ఛార్జీలు – రూ.75
జీఎస్టీ – రూ.125
క్యాటరింగ్ ఛార్జీలు – రూ.419

ఫొటో సోర్స్, Getty Images
దూరం ఎంత..?
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలు.
ఇది రెండు నగరాల మధ్య ధూరం 660.7 కిలోమీటర్లు
అన్ని రోజులు నడుస్తుందా..?
ఈ రైలు అన్ని రోజులు నడవదు.
వారానికి ఆరు రోజులే నడుస్తుంది.
నిర్వహణ కోసం మంగళవారం సెలవు ఉంటుంది.
ప్రయాణ సమయం ఎంత ఆదా
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పోల్చితే సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణం సమయం దాదాపు 4 గంటలు ఆదా అవుతందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు 12 నుంచి 12.30 గంటల ప్రయాణ సమయం ఉండగా.. వందే భారత్ రైలు కేవలం 8.30 గంటలలోనే చేరుకుంటోంది.
ఐపీఎల్: దిల్లీపై 57 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, 51 బంతుల్లో 79 పరుగులు కొట్టిన రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గువాహటిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అర్ధ శతకాలు సాధించారు.
యశస్వి జైస్వాల్ 31 బంతుల్లో 60 పరుగులు; జోస్ బట్లర్ 51 బంతుల్లో 79 పరుగులు చేశారు.
ఓపెనర్లు ఇద్దరూ బౌండరీలు (11 ఫోర్లు, ఒక సిక్సర్) సమానంగా కొట్టారు.
రాజస్థాన్ ఓపెనర్ల వికెట్లను ముకేశ్ కుమార్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్సన్ కుల్దీప్ యాదవ్ బంతికి డకౌట్ కాగా, రియాన్ పరాగ్ ఏడు పరుగులకే వెనుదిరిగారు.
ఆ తర్వాత వచ్చిన షిమ్రన్ హెట్‌మైర్ 21 బంతుల్లో 39 పరుగులు (ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) కొట్టి జట్టుకు భారీ స్కోరు అందించారు.
దిల్లీ ఇన్నింగ్స్: మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ
200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్, 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులే చేయగలిగింది.
దిల్లీకి మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా, మనీష్ పాండే వెంట వెంటనే డకౌట్ అయ్యారు.
పృథ్వీ షా, మనీశ్ పాండే సహా మొత్తం ముగ్గురి వికెట్లను ట్రెంట్ బౌల్ట్ పడగొట్టారు. నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చారు.
దిల్లీ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. వార్నర్ సహా ముగ్గురి వికెట్లను చాహల్ తీశారు.
లలిత్ యాదవ్ 38 పరుగులు, రిలీ రోసౌ 14 పరుగులు చేశారు. ఈ ముగ్గురు తప్ప ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
తాజా గెలుపుతో రాజస్థాన్‌కు రెండో విజయం దక్కింది.మూడు మ్యాచులు ఆడిన రాజస్థాన్ మొత్తం నాలుగు పాయింట్లు సాధించింది.
ఆడిన మూడు మ్యాచులూ ఓడిపోయిన దిల్లీ, పాయింట్ల పట్టికలో ఇంకా ఖాతా తెరవలేదు.
చందా కొచ్చర్‌పై సీబీఐ అభియోగపత్రం

ఫొటో సోర్స్, Getty Images
రూ.3,250 కోట్ల రుణం మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారనే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, మాజీ సీఈవో అయిన చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ అభియోగపత్రం(ఛార్జిషీట్) దాఖలు చేసింది.
భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), సెక్షన్ 409 (నమ్మకద్రోహం) కింద ఆమెపై సీబీఐ అభియోగాలు మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగపత్రాన్ని దాఖలు చేసింది.
నిందితుల జాబితాలో వ్యక్తులు, సంస్థలు కలుపుకొని మొత్తం తొమ్మిది పేర్లు ఉన్నాయి.
ముంబయిలోని ఒక సెషన్స్ కోర్టులో తమ తుది రిపోర్టును దాఖలు చేశామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచ్చర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకుకు లేఖ రాశామని, సమాధానం కోసం వేచి చూస్తున్నామని సీబీఐ చెబుతోంది. బ్యాంకు నుంచి అనుమతి రాకపోతే, చందా కొచ్చర్‌కు అవినీతి నిరోధక చట్టం నిబంధనలు వర్తించవని అంటోంది.
చందా కొచ్చర్‌ను సీబీఐ 2022 డిసెంబరులో అరెస్టు చేసింది.
వీడియోకాన్ గ్రూపుకు రుణం ఇచ్చే సమయంలో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ రుణం మంజూరు సమయంలో చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా ఉన్నారు.
స్మార్ట్‌ఫోన్లతో భూకంపాలను ముందే కనిపెట్టొచ్చా? ఈ టెక్నాలజీతో వేల మంది ప్రాణాలను కాపాడొచ్చా?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
బిడ్డకు పాలు ఎలా పట్టాలో ఒరాంగుటాన్‌కు నేర్పించిన మహిళ
ఏసుక్రీస్తు: శిలువ వేయడమనే క్రూరమైన శిక్ష ఎప్పుడు మొదలైంది... ఎందుకు వేసేవారు?
కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తాం: మోదీ

ఫొటో సోర్స్, ani
‘తెలంగాణలో కుటుంబ పాలన రాజ్యమేలుతోంది. తండ్రి, కొడుకు, కుమార్తె అంతా అధికారంలో ఉంటారు. కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరిగింది. కుటుంబ పాలన, అవినీతి వేరు కాదు. రెండూ ఒకటే.
అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేయాలా? వద్దా?
కుటుంబ పాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిస్తాం’ అన్నారు మోదీ
మేం తెలంగాణకు ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు: ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, telangana bjp
సికింద్రాబాద్‌లో వందేభారత్ రైలు ప్రారంభించిన అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి పనుల కోసం చేస్తున్న ఖర్చు వివరాలు తెలిపారు.
కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని మోదీ అన్నారు.
‘మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటుచేయనుంది. అందులో ఒకటి తెలంగాణలో వస్తుంది. ఈ టెక్స్‌టైల్ పార్కుతో యువతకు ఉపాధి లభిస్తుంది. తెలంగాణలో విద్య, ఆరోగ్య రంగాలపైనా కేంద్రం పెట్టుబడులు పెడుతోంది అన్నారు మోదీ.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్ల ప్రతి ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని మోదీ అన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రజలకు నష్టం జరుగుతుంది. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు మోదీ.
ప్రధాని మోదీ పర్యటన- సింగరేణి లో నిరసనలు

ఫొటో సోర్స్, brs
ప్రధాని తెలంగాణ పర్యటన నేపథ్యంలో సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
మహాధర్నా పేరుతో చేపట్టిన ఈ నిరసనలకు పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నేతృత్వం వహిస్తున్నారు.
కేంద్రం ఆధ్వర్యంలో సింగరేణి ప్రైవేటీకరణ కుట్ర జరుగుతోందని, దీన్ని ఆపాలని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ధర్నాలకు దిగారు.
శ్రీరాంపూర్, భూపాలపల్లి, గోదావరిఖని, మందమర్రి, కొత్తగూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పలువురు కార్మికులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు.
సింగరేణి కి చెందిన బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ పరం చేయడం ఆపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ఆర్థిక, సామాజిక జీవనానికి జీవనాడి గా ఉన్న సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలని, ఇప్పటికే కోయగూడెం బ్లాక్ ను ప్రైవేట్ కు అప్పగించారని, సత్తుపల్లి, శ్రావణపల్లి తోపాటు మరో బ్లాక్ కోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారని, అదే గుజరాత్ రాష్ట్రంలో లిగ్నైట్ తవ్వకాలను మాత్రం ప్రైవేట్ కు కాకుండా కార్పోరేషన్ కు అప్పగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
