విరాట్ కోహ్లీ X గౌతమ్ గంభీర్: ఐపీఎల్ మ్యాచ్ తర్వాత వీరిద్దరు ఎందుకు గొడవపడ్డారు?

విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

    • రచయిత, వాత్సల్య రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒకప్పటి మంచి స్నేహితులు, జట్టు సభ్యులు, ప్రస్తుతం ఐపీఎల్ మైదానంలో శత్రువులుగా మారారు. ఈ ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు మరోసారి మైదానంలో ఘర్షణకు దిగారు.

విరాట్ కోహ్లి టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఘర్షణ జరిగిన ఈ ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇది ఒక సాధారణ మ్యాచ్ ‌గానే జరిగింది. తొమ్మిది వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 126 స్కోరు చేసింది. లక్నో జెయింట్స్ కేవలం 108 పరుగులకే ఆల్ అవుట్ అయిపోవడంతో, 18 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.

అయితే, మ్యాచ్ ముగియడంతో దీని కథ అయిపోలేదు. అసలు తమాషా ఆ తర్వాత మొదలైంది.

ఈ రెండు టీమ్‌లకు చెందిన చాలా మంది ఈ తమాషాలో భాగమైనప్పటికీ, ముగ్గురు పేర్లు మాత్రం బాగా జోరుగా వినిపిస్తున్నాయి. వారే విరాట్ కోహ్లి, నవీన్-ఉల్-హఖ్, గౌతమ్ గంభీర్.

  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
  • 18 పరుగుల తేడాతో లక్నోపై గెలిచిన బెంగళూరు
  • ఆర్‌సీబీ స్కోర్- 126/9(20 ఓవర్లు)
  • లక్నో జెయింట్స్ స్కోర్- 108/10(19.5 ఓవర్లు)
విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

గంభీర్, విరాట్, నవీన్‌కి జరిమానా

కోహ్లి, గంభీర్ గొడవపై అంతకుముందు ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. కానీ, ప్రస్తుతం ఐపీఎల్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది.

మైదానంలో జరిగిన ఈ ఘర్షణ తర్వాత గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, లక్నో బౌలర్ నవీన్-ఉల్-హఖ్‌కి ఐపీఎల్ జరిమానా విధించింది.

ఐపీఎల్ విడుదల చేసిన ప్రకటనలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నియమ, నిబంధనలను గౌతమ్ గంభీర్ ఉల్లంఘించారని పేర్కొంది. ఒక మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు తెలిపింది.

అలాగే, ఐపీఎల్ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లికి కూడా 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు చెప్పింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు తమకు విధించిన జరిమానాను కట్టేందుకు ఒప్పుకున్నట్లు విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్‌లు కూడా తమ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు లక్నో బౌలర్ నవీన్-ఉల్-హఖ్‌కి మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని జరిమానాగా విధించింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఆయన కూడా ఈ జరిమానా కట్టేందుకు ఒప్పుకున్నారు.

విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, ANI

ఈ ఎపిసోడ్ తర్వాత, క్రికెట్ విమర్శకులు, అభిమానులు, కామెంటరీ టీమ్‌కి చెందిన మాజీ ఆటగాళ్లు వాళ్లసలు ఏ విషయంలో గొడవపడ్డారో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నించారు.

ఈ మొత్తం ఘర్షణకు సంబంధించి పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఒక వీడియోలో మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది. దానిలో ఆయన ‘‘ఇప్పుడేం అవసరం లేదు. గేమ్ అయిపోయింది. ఫలితం కూడా వచ్చింది. రెండు పాయింట్లు వచ్చాయి. ఏం చెప్పాలి.’’ అని అంటున్నారు.

ఆ తర్వాత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా.. ‘‘అవసరం లేదు’’ అని మాట్లాడారు.

రవి శాస్త్రి దీనిపై మరింత మాట్లాడుతూ.. ‘‘అవసరం లేదు. ఇది తక్కువ స్కోర్ గేమ్. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. మైదానంలోనే వదిలేయాల్సి ఉంటుంది’’ అన్నారు.

ఈ వీడియాల ద్వారా ఈ ఘర్షణకు చెందిన నాలుగు భాగాలు బయటికి వచ్చాయి.

విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

గంభీర్, కోహ్లి వీడియో

మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లి లక్నో బ్యాట్స్‌మాన్ కైల్ మేయర్స్‌తో మాట్లాడుతూ, నడుస్తున్నారు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ వచ్చి మేయర్స్‌ చేతి పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లారు.

గౌతమ్ గంభీర్ వెనక్కి తిరిగి, ఏదో అన్నారు. మళ్లీ ఏదో అనబోతుంటే ఆయన్ని కేఎల్ రాహుల్ ఆపేశారు. కానీ, గౌతమ్ గంభీర్ ఆగకుండా మళ్లీ ఏదో అంటూ విరాట్ కోహ్లికి దగ్గరగా వచ్చారు.

అలా మీదమీదకి రావడంతో కోహ్లి గంభీర్ భుజంపై చేయి వేశారు. ఆయనకి ఏదో నచ్చచెప్పాలని చూశారు. ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడుతూ ఉండటంతో, వీరి మధ్యలోకి హెల్మెట్ పెట్టుకుని వచ్చిన అమిత్ మిశ్రా, వారిద్దర్ని విడదీశారు.

ఆ తర్వాత, బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వచ్చి నవ్వుతూ విరాట్ కోహ్లి చేతిని పట్టుకుని వెళ్లిపోయారు.

విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ కోహ్లి, నవీన్ ఉల్ హఖ్‌కి మధ్య ఏం జరిగింది?

ఈ వివాదం మూడు భాగాలుగా బయటికి వచ్చింది. ఒక వివాదం మ్యాచ్ జరుగుతున్న సమయానిది. లక్నో ఇన్నింగ్స్ 16వ ఓవర్ అయిపోయిన తర్వాత, నవీన్ ఉల్ హఖ్‌కి, విరాట్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ఒక వీడియోలో కనిపిస్తోంది.

పిచ్‌పై ఉన్న అమిత్ మిశ్రా, అంపైర్‌లు వచ్చి ఆ గొడవను ఆపారు. ఆ వీడియోలో అమిత్ మిశ్రాకి, అంపైర్లకు విరాట్ కోహ్లి ఏదో చెప్పాలని చూశారు.

మరో వీడియో మ్యాచ్ తర్వాతది. ఇరు టీమ్‌లు మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో, విరాట్, నవీన్ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

ఆ సమయంలో ఇద్దరూ ఏదో అనుకున్నారు. ఆ తర్వాత విరాట్ చేయిని నవీన్ వదలకుండా అలా ఊపుతూనే ఉన్నారు. వీరి మధ్యలోకి మ్యాక్స్‌వెల్ వచ్చి, ఆ వివాదాన్ని ఆపారు.

మరో వీడియోలో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లు బౌండరీ లైన్‌కి దగ్గర్లో ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. వారి దగ్గర్నుంచి నవీన్ వెళ్తున్నారు. నవీన్‌ని పిలిచి కేఎల్ రాహుల్ ఏదో చెప్పారు. కానీ, వారి దగ్గరికి రాకుండా నవీన్ పక్కకి వెళ్లిపోయారు.

విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్

ఫొటో సోర్స్, BCCI-TATA/IPL

20 రోజులుగా ఈ వివాదం నడుస్తుందా?

బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో 20 రోజుల క్రితం జరిగిన గొడవతో, లక్నోలో సోమవారం ఈ వివాదం చెలరేగినట్లు ఈ మొత్తం సంఘటనను గమనించిన కొందరు ట్విటర్ యూజర్లు పేర్కొన్నారు.

ఈ రెండు టీమ్‌లు ఏప్రిల్ 10న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ సమయంలో చివరి బాల్‌లో ఒక్క వికెట్ తేడాతో బెంగళూరుపై లక్నో విజయం సాధించింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో మోస్ట్ సెన్సేషనల్ రన్ ఛేజ్ ఇదే. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ మ్యాచ్ తర్వాత లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ తన మూతిపై చేతి వేలిని పెట్టుకుని ఫోటోకు ఫోజు ఇవ్వడం వైరల్ అయింది. స్టేడియంలో ఉన్న ఆర్‌సీబీ అభిమానులందరూ ఇక నోరు మూసుకోవాలని ఆయన సంకేతాలిచ్చారని చాలా మంది అన్నారు.

సోమవారం జరిగిన మ్యాచ్‌లో, వికెట్ పడుతున్న ప్రతిసారి కూడా విరాట్ కోహ్లి స్పందించిన తీరు చూస్తే, కచ్చితంగా ఇది గంభీర్‌కి కౌంటర్ రిప్లే అని అన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘అందుకే విరాట్ కోహ్లి అంటే ప్రపంచం మొత్తానికి పిచ్చి. ఆయన దేన్ని ఉంచుకోరు.’’ అంటూ గుర్మీత్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

విరాట్ కోహ్లి కెరీర్‌ను దగ్గర్నుంచి చూస్తోన్న వారు చాలా మంది వ్యాఖ్యాతలు కూడా మ్యాచ్ జరిగే సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్‌లో తేడా ఉన్నట్లు భావించడం లేదు.

మైదానంలో ఉన్నప్పుడు ఇంతే ఉత్సాహంగా కోహ్లి ఉంటారని అన్నారు. ఇది ఆయన గుర్తింపులో ఒక భాగమన్నారు.

ఈ మ్యాచ్‌లో గెలుపొందడం విరాట్ కోహ్లికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. లక్నోకి కేవలం ప్రతీకార ఆట మాత్రమే కాదు, సోమవారం కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టిన రోజు కూడా.

ఈ మ్యాచ్ గెలుపు, సెలబ్రేషన్ల కంటే కూడా దిగ్గజ ఆటగాళ్ల మధ్య నెలకొన్న ఈ ఘర్షణే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం ఐపీఎల్ కూడా అడ్వయిజరీ నోట్ జారీ చేసి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు గంభీర్, విరాట్, నవీన్‌లకు జరిమానాలు విధించింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)