‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, THE KERALA STORY
కేరళ నుంచి కనిపించికుండా పోయి, ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథను ఆధారంగా చేసుకుని తీసిన ‘ది కేరళ స్టోరీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా మే 5న విడుదలవుతోంది.
తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం(2017), ఇతర సినిమాల్లో నటించిన అదా శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
యూట్యూబ్‌లో ఐదు రోజుల క్రితం విడుదల చేసిన 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌ను ఇప్పటివరకు కోటిన్నర మందికి పైగా చూశారు.
ఈ సినిమాలో కేరళ నుంచి 32 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయినట్లు చూపించారు. ఈ విషయంపై సమాజం, రాజకీయ నాయకులు, సమాజం రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
ఒక వర్గానికి చెందినవారు ఈ సినిమాను సంఘ్ పరివార్ దుష్ప్రచారంగా చెబుతుండగా, మరో వర్గంవారు ఈ సినిమా ఇప్పటివరకు బహిరంగంగా చర్చించని కేరళ వాస్తవచిత్రాన్ని చూపిస్తుందని అంటున్నారు.

ఫొటో సోర్స్, @ADAH_SHARMA
‘ది కేరళ స్టోరీ’ తీసినవారిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు చేశారు.
‘లవ్ జిహాద్’ను రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ దుష్ప్రచారాన్ని ఈ సినిమా నిర్మాతలు మరింత ముందుకు తీసుకెళ్తున్నారని వార్తాసంస్థ పీటీఐతో ఆయన అన్నారు.
‘లవ్ జిహాద్’ అనే పదాన్ని కోర్టులు, దర్యాప్తు సంస్థలు, హోం శాఖ తిరస్కరించాయని ఆయన చెప్పారు.
కేరళకు వ్యతిరేకంగా, సమాజంలో మతపరమైన విభజన తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ సినిమాను తీసినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోందని విజయన్ విమర్శించారు.

ఫొటో సోర్స్, THE KERALA STORY
కేరళ పరువు తీసేందుకే ఇలా: విజయన్
‘‘లవ్ జిహాద్ అనే అంశాన్ని దర్యాప్తు సంస్థలు, కోర్టులు, ఆఖరికి హోం శాఖ కూడా తిరస్కరించింది. అయినా సంఘ్ పరివార్ ప్రచారం చేసే 'లవ్ జిహాద్'ను ప్రస్తావిస్తూ కేరళలో రెచ్చగొడుతున్నారు. ప్రపంచం ముందు కేరళ పరువు, ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు.
ఇది పూర్తిగా దుష్ప్రచారానికి సంబంధించిన సినిమానేనని ఆయన అన్నారు. ఈ సినిమాలో ముస్లింలను చూపించిన విధానం, రాష్ట్రంలో రాజకీయంగా లబ్ది పొందేందుకు సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నాలు చేస్తోందని విజయన్ ఆరోపించారు.
‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై అధికార సీపీఐ(ఎం), కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేశాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే సమాజంలో విషాన్ని చిమ్మడం కాదన్నాయి.
‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వకూడదని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ చెప్పారు.

ఫొటో సోర్స్, THE KERALA STORY
సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వొద్దు: సతీశన్
‘‘ది కేరళ స్టోరీ సినిమాలో 32 వేల మంది కేరళ అమ్మాయిలు ఇస్లాంలోకి మారారని, ఇస్లామిక్ స్టేట్‌లో సభ్యులయ్యారని చూపిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వొద్దు. ఏం చూపించాలనుకుంటున్నారో, ఈ సినిమా ట్రైలర్‌లోనే స్పష్టంగా అర్థమవుతోంది’’ అని ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో సతీశన్ చెప్పారు.
సమాజంలో మైనార్టీలను ఏకాకి చేసేందుకు సంఘ్ పరివార్ అజెండాతో ఈ సినిమాను రూపొందించారని సతీశన్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కేరళ పరువు తీసేందుకు ఈ సినిమాను రూపొందించారని విమర్శించారు.
ఈ సినిమా ట్రైలర్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అధికార సీపీఐ(ఎం) యూత్ వింగ్ కూడా ఆరోపిస్తున్నాయి.
"ఈ సినిమా మొత్తం అబద్ధాలతో నిండి ఉంది. ఎన్నికల్లో లబ్ధి కోసం అర్రులు చాస్తున్న ఆర్‌ఎస్ఎస్, సంఘ్ పరివార్ అజెండా ఇది" అని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ ఏఏ రహీం ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బీజేపీ ఏమంది?
భారతీయ జనతా పార్టీ ఈ సినిమాను సమర్థించింది.
‘‘ది కేరళ స్టోరీ సినిమా నిజ జీవిత కథనాలతో రూపొందింది. ఇది షాకింగ్, ఆందోళనను కలిగించే సినిమా’’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ అన్నారు.
‘‘కేరళలో బాగా పెరుగుతున్న ఇస్లామీకరణను ఈ సినిమా చూపించింది. రాష్ట్రంలో అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసి, ఇస్లామిక్ స్టేట్‌కు ఎలా సరఫరా చేస్తున్నారో తెలుపుతుంది. లవ్ జిహాద్ అనేది నిజం. ఇది ప్రమాదకరం. ఈ ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉంది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, @ADAH_SHARMA
దర్శకుడు సుదీప్తో సేన్, అదా శర్మ ఏమన్నారు?
తమ సినిమాను దర్శకుడు, నటులు సమర్థించుకొంటున్నారు. ప్రతి ఒక్కరూ తొలుత ఈ సినిమాను చూడాలన్నారు. ఆ తర్వాత అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పారు.
‘‘ఇది నిజంగా భయంకరమైన కథనం. దీన్ని ఒక దుష్ప్రచారంగా ప్రజలు పిలుస్తున్నప్పుడు లేదా కనిపించకుండా పోయిన అమ్మాయిల సంఖ్య గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత భయానకంగా నాకనిపిస్తోంది. ప్రజలు తొలుత కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి మాట్లాడాలి. ఆ తర్వాత వారి లెక్కల గురించి ఆలోచించాలి.’’ అని సినిమా నటి అదా శర్మ అన్నారు.
ఆ అమ్మాయిలను కలిసినట్లు అదా శర్మ చెప్పారు.
‘‘అలాంటి కొందరు అమ్మాయిలను నేను కలిశాను. మాటల్లో వారి బాధను నేను చెప్పలేదు. కేవలం ఒకటి లేదా రెండు వాక్యాల్లో వారు అనుభవించిన బాధకు న్యాయాన్ని అందించలేం’’ అన్నారు.
ఏడేళ్లుగా ఈ సినిమా కథనంపై తాను పనిచేసినట్లు దర్శకుడు సుదీప్తో సేన్ చెప్పారు. ఈ సమయంలో ఎంతో మంది బాధిత అమ్మాయిలను కలిసి, వారిని ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గణాంకాలను తెలుసుకునేందుకు కోర్టులో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేసినట్లు చెప్పారు. కానీ, ఇప్పటివరకు తాను రిపోర్టు పొందలేదన్నారు.
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ షా నిర్మించారు.
ఎన్నో ఏళ్ల పరిశోధన, కృషికి ఫలితమే ఈ సినిమా అని నిర్మాత విపుల్ షా అన్నారు.
అంతకుముందు ఎవరూ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పని వాస్తవాన్ని ఈ సినిమా చూపిస్తుందని తెలిపారు.
‘‘మన దేశ మహిళలకు తీవ్రవాదం ఎలా ప్రమాదకరంగా మారిందనేది ఈ సినిమా చూపించింది. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్ర విషయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది’’ అని మీడియాకు విపుల్ షా చెప్పారు.
ఈ మహిళలను తొలుత ఇస్లాంలోకి మార్చి, ఆ తర్వాత తీవ్రవాదంలోకి దింపి, ప్రపంచంలోని ఇతర దేశాల్లో, భారత్‌లో తీవ్రవాద మిషన్లకు ఎలా పంపుతున్నారనేది చూపించినట్లు ఈ సినిమా యూనిట్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు, ఎందుకు తమ మూలాలు వెతుక్కుంటున్నారు?
- పార్వతి ఒడిలో శివుడు సేదతీరే అరుదైన శివాలయం విశేషాలు తెలుసా?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- East India Company: ‘పారిశ్రామిక దేశమైన భారత్‌ను వ్యవసాయంపై ఆధారపడే దేశంగా’ ఈ కంపెనీ ఎలా మార్చేసింది?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














