మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?

మిషన్ మజ్ను సినిమాలో రష్మిక మందన్న

ఫొటో సోర్స్, RSVP/Facebook

భారత్, పాకిస్తాన్ విభజన అంశంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో బాలీవుడ్‌లో డజన్ల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.

వీటిలో కొన్ని సినిమాలు ‘క్లాసిక్స్’గా మారితే, మరికొన్ని దేశభక్తి సంబంధిత సినిమాలుగా హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మధ్యే ‘మిషన్ మజ్ను’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది.

ఆ సినిమా హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్‌ను షేర్ చేసిన వెంటనే పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై జోకులు వేయడం మొదలుపెట్టారు.

భారతీయ గూఢచారి, పాకిస్తాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం కోసం ఒక మిషన్‌పై ఎలా వెళ్లాడనే దాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఈ మిషన్ పేరే ‘మిషన్ మజ్ను’.

ఈ ట్రైలర్‌లో పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ గురించి కూడా ప్రస్తావించారు.

ఈ ట్రైలర్‌కు ట్విటర్‌లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ఈ ట్రైలర్‌ను లైక్ చేయగా, చాలా మంది రీట్వీట్ చేశారు.

జనవరి 20న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

ఇది వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన చిత్రమని ట్రైలర్‌లో చెప్పారు. దీనిపైనే పాకిస్తాన్ యూజర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

పాకిస్తాన్ యూజర్లు ట్విటర్‌లో ఈ సినిమాకు సంబంధించిన రకరకాల మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు.

సినిమా ట్రైలర్‌ను షేర్ చేస్తూ సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన ట్వీట్‌కు పాకిస్తాన్ సినీ నిర్మాత, జర్నలిస్ట్ జైన్ ఖాన్ బదులు ఇచ్చారు.

‘‘ఈ సినిమా వాస్తవ ఘటనల ప్రేరణగా తీయలేదనే విషయం మన ఇద్దరికీ తెలుసు. ఇది కల్పిత కథ’’ అని ఆయన ట్వీట్ చేశారు.

టీవీ వ్యాఖ్యాత రాబియా అనుమ్ ఓబైద్ కూడా ట్వీట్ చేస్తూ, ‘‘పాకిస్తాన్ గురించి ఇలాంటి పనికిరాని సినిమాలు తీయడం మానేయండి. ఆ నకిలీ నమస్కారాలు, టోపీ, కళ్లకు సుర్మా పెట్టుకోవడం, తెలివితక్కువ కథలు అల్లడం ఇక చాలించండి’’ అని ఆమె రాసుకొచ్చారు.

మిషన్ మజ్ను

ఫొటో సోర్స్, TWITTER

ఖదీజా అబ్బాస్ అనే యూజర్ కూడా దీనిపై ట్వీట్ చేశారు.

‘‘బాలీవుడ్ ప్రకారం, ముస్లిం పురుషులు అందరూ ఇలా సుర్మా, మెడలో తావీదు, టోపీ ధరిస్తారు. వీటిని పాకిస్తాన్ జాతీయ సంపదగా బాలీవుడ్ భావిస్తుంది. అలాగే ఈ విధంగా తయారయ్యే వారిని తీవ్రవాదులుగా పరిగణిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఇప్పుడు అధికారికంగా ప్రోపగండా చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు’’ అని ఆమె ట్వీట్‌లో అసహనం వెల్లగక్కారు.

షహర్యార్ రిజ్వాన్ అనే మరో యూజర్, ‘‘భారత గూఢచారి, పాకిస్తాన్ అణుకేంద్రంలోకి చొరబడటం అనేది ఎంత నవ్వు తెప్పించేలా ఉంది. ఇది ఏ నిజ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొందింది? నెట్‌ఫ్లిక్స్ఇండియా, తప్పుదారి పట్టించడం ఆపండి. ఇది 2023. అసలైన ఆలోచనలతో రండి. పాక్ వ్యతిరేక కథలను ఆపండి. బీజేపీ ప్రభుత్వానికి భయపడటం ఆపండి. శాంతి, ప్రేమ, స్నేహపూరిత బంధాల కోసం పని చేయండి’’ అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

జునైద్ జఫర్ అనే మరో యూజర్ సిద్ధార్థ్ మల్హోత్రాను ట్వీట్‌లో ప్రశ్నించారు. ‘‘ పాకిస్తాన్ పేరు ఎత్తకుండా మీ బాలీవుడ్, క్రికెట్, రాజకీయాలు పని చేయలేవా?’’ అని ఆయన ట్వీట్ చేశారు.

మిషన్ మజ్ను

ఫొటో సోర్స్, Getty Images

ట్రైలర్‌లో ఏముంది?

మిషన్ మజ్ను సినిమా ఒక ‘స్పై థ్రిల్లర్’. ట్రైలర్‌లో చూపిన దాని ప్రకారం, భారతీయ గూఢచారి ఒకరు పాకిస్తాన్ అణు కేంద్రాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్‌లో అడుగుపెడతాడు. ఈ మిషన్‌‌కు ‘మిషన్ మజ్ను’ అని పేరు పెట్టారు.

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమాలో భారతీయ గూఢచారి పాత్రను పోషించారు.

ట్రైలర్ ఆరంభంలోనే పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్ కనబడుతుంది. పాకిస్తాన్ అక్రమంగా న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తుందని చెప్పడం ట్రైలర్‌లో వినిపిస్తుంది.

‘‘పాకిస్తాన్ న్యూక్లియర్ కేంద్రాన్ని గుర్తించి దాన్ని ధ్వంసం చేయాలి. ఈ పని చేయడానికి ఆయుధ సంపత్తి కాదు మనిషి మేథస్సు కావాలి. ఎవరికీ అనుమానం రాకుండా ఈ పని చేసే వ్యక్తి మనకు కావాలి’’ అంటూ ట్రైలర్‌లో చెబుతారు.

ఆ తర్వాతి సన్నివేశంలో భారత గూఢచారి, పాకిస్తాన్‌కు వెళ్లినట్లు చూపించారు. ‘‘పాకిస్తాన్ అంతటా వెదికినా నా కంటే మంచి దర్జీ మీకు కనబడరు’’ అని సిద్ధార్థ్ మల్హోత్రా చెప్పడం కనిపిస్తుంది.

మిషన్ మజ్ను

ఫొటో సోర్స్, Getty Images

టైలర్ పేరుతో భారత గూఢచారి, పాకిస్తాన్ ఉన్నతాధికారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి సమాచారం సేకరిస్తాడు.

ట్రైలర్‌లో పాకిస్తాన్ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్ కదిర్ పేరును ప్రస్తావిస్తూ, ‘విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్త అతనే కావొచ్చు’ అని అంటారు.

ఈ సినిమా వాస్తవ సంఘటనల ప్రేరణగా తీసిందని ట్రైలర్ మధ్యలో చెబుతారు. చివర్లో భారత గూఢచారి, పాక్ సైనికులను కాల్చి వేసి న్యూక్లియర్ కేంద్రంలోకి ప్రవేశిస్తాడు. వెనుక నుంచి ‘మేం మట్టిని భూమాత అని పిలుస్తాం’ అనే స్వరం వినిపిస్తుంది.

ఈ సినిమాను రోనీ స్క్రూవాలా, అమర్ భూటాలా, గరిమా మెహతా నిర్మించగా, శాంతను భాగ్చీ దర్శకత్వం వహించారు.

జీ యూసుఫ్‌జాయ్ అనే వ్యక్తి ట్రైలర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ ‘‘స్పాయిలర్: పాకిస్తాన్ అణుబాంబును తయారు చేసింది. మిషన్ మజ్ను విఫలమైంది’’ అంటూ రాసుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

మరోవైపు, ‘‘అబ్దుల్ కదీర్ ఖాన్ మా హీరో. మరో దేశపు హీరోను అవమానపరస్తున్నందుకు మీరు సిగ్గు పడాలి. మీ నుంచి ఇది ఊహించలేదు. ఇక్కడ ఎవరూ ‘ఆదాబ్’, ‘జనాబ్’ వంటి పదాలను ఉపయోగించరు’’ అని పాకిస్తాన్ అనే పేరున్న ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది.

అలీ అనే మరో యూజర్ ట్వీట్ చేస్తూ, ‘‘గాలిబ్‌ను గాలిబ్ అనే రాయాలి. ఆ పేరును కూడా ట్రాన్స్‌లేట్ చేస్తూ షేక్‌స్పియర్ అని రాశారు’’ అని తప్పును ఎత్తి చూపారు.

ట్రైలర్‌లో ఒక చోట గాలిబ్ పేరును ప్రస్తావించారు. కానీ సబ్‌టైటిల్స్‌లో ఆ పేరు షేక్‌స్పియర్ అని కనబడుతుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

‘ఓవర్ యాక్టింగ్ చేసినందుకు 50 రూపాయలు కోత’ అనే మీమ్‌ను కూడా ఆయన షేర్ చేశారు.

మరోవైపు భారత్‌లో ఈ సినిమాపై, సిద్ధార్థ్ మల్హోత్రాపై చాలా ప్రశంసలు వస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

మిషన్ మజ్ను సినిమా డైలాగులతో తనకు రోమాలు నిక్కబొడిచాయని ఇషాన్ యాదవ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

చాలా మంది యూజర్లు, నెట్‌ఫ్లిక్స్ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని ఆరోపించారు. ఈ సినిమా కంటే ముందు కూడా భారత్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన అనేక సినిమాలు వచ్చాయి.

గర్మ్ హవా, ట్రెయిన్ టూ పాకిస్తాన్, తమస్, హే రామ్, గదర్ ఏక్ ప్రేమ్ కథ, బజరంగ్ భాయిజాన్ వంటి సినిమాలు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్నవే.

వీడియో క్యాప్షన్, ఇక జీవితంలో డాన్స్ చేయలేడనుకున్నాడు, కానీ స్టార్ డాన్సర్ అయ్యాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)