RRR: 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్

కీరవాణి

ఫొటో సోర్స్, RRR Movie

ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద ఈ అవార్డ్ దక్కింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తొలి ఆసియా పాట ఇదేనని ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్‌లో పేర్కొంది.

జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి, కీరవాణి, జూ. ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రమా రాజమౌళి తదితరులు హాజరయ్యారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డ్ అందుకున్నారు.

'నాటు నాటు' పాటను గేయ రచయిత చంద్రబోస్ రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం స్వరపరచగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.

పాటకు తగ్గ జోష్‌తో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించింది.

నాటు నాటు పాట

ఫొటో సోర్స్, RRR MOVIE/FB

అవార్డ్ అందుకున్న తరువాత కీరవాణి ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

"ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు మాత్రమే సొంతం కాదు. నా సోదరుడు, చిత్ర దర్శకుడు రాజమౌళికి, నాటు నాటు పాటకు ఏనిమేషన్ అందించిన ప్రేమ్ రక్షిత్‌కు, అరేంజ్మెంట్స్ సమకూర్చిన కాలభైరవకు, గేయ రచయిత చంద్రబోస్‌కు, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు, పాటకు జోష్‌తో డాన్స్ చేసిన జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు, ఈ పాటను ప్రోగ్రాం చేసిన సాలూరి సిద్ధార్థ్, జీవన్ బాబులకు ఈ అవార్డ్ దక్కుతుంది. ప్రత్యేకంగా నా భార్య శ్రీవల్లికి కృతజ్ఞతలు" అని అన్నారు.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా 2022 మార్చిలో విడుదలైంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీతోపాటు బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌ విభాగంలో 'నాటునాటు' పాట నామినేట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకకు హాజరైన చిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, RRR Movie/TWITTER

ఫొటో క్యాప్షన్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకకు హాజరైన చిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు

"మాటలు రావడం లేదు. పెద్దాన్నా.. నాకు 'నాటు నాటు ' పాట ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అభినందనలు. ఇది చాలా ప్రత్యేకం" అంటూ రాజమౌళి ఉద్వేగంతో ట్వీట్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు పాటకు కాలు కదిపి డాన్స్ చేసి, దీన్నింత పాపులర్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

జూ. ఎన్‌టీఆర్ మాట్లాడుతూ, "ఇంతకన్నా ఆనందం ఉండదు. పశ్చిమ దేశాలు, అమెరికా సినిమా, ఇతర సినిమా ప్రపంచం మా (భారతీయ) విజయాన్ని అంగీకరించాయి. ఒక నటుడికి ఇంతకన్నా ఏం కావాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంలో భాగం పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.

చైనీస్ టీసీఎల్ థియేటర్‌లో నిన్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రసారం అయినప్పుడు అక్కడ ఉన్నాను. మా దేశంలో సినిమా చూసినట్టుంది. ప్రేక్షకులు అరుపులు, కేకలు, డాన్సులతో థియేటర్ దద్దరిల్లిపోయింది. చాలా ఆనందం కలిగింది" అన్నారు.

ఆస్కార్ అవార్డుల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు, "ఈ సినిమాను ప్రజలు విజయవంతం చేయడమే పెద్ద అవార్డ్. ఆస్కార్ అవార్డ్ వస్తే అంతకన్నా సంతోషం ఉండదు. గర్వంగా అవార్డ్ తీసుకుని ఇంటికి వెళతాం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

జూ. ఎన్‌టీఆర్ ట్విట్టర్ ద్వారా కీరవాణిని అభినందించారు.

"సర్, మీరు ఈ అవార్డుకు పూర్తిగా అర్హులు. నేను ఎన్నో పాటలకు డాన్స్ చేశానుగానీ 'నాటు నాటు ' పాట ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది" అన్నారు.

సినీ ప్రముఖుల ప్రశంసలు

ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ లభించడంతో తెలుగు సినిమా ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

‘నాటు నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం అద్భుతమైన, చరిత్రాత్మక విజయమని నటుడు చిరంజీవి అన్నారు.

"కీరవాణి గారికి జోహార్లు. ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు. భారతదేశం గర్విస్తోంది" అంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేస్తూ, "ఇది అద్భుతం. కీరవాణిగారికి భారతీయుల తరఫున, ఆయన అభిమానుల తరుపున అభినందనలు" అన్నారు.

2009లో ఏఆర్ రెహ్మాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయునిగా రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యాసలో "కొట్టేష్నాం కాకా" అంటూ ట్వీట్ చేశారు.

"నా గురువు కీరవాణికి కృతజ్ఞతలు. ఆర్ఆర్ఆర్ మూవీ బృందానికి అభినందనలు" అన్నారు.

అక్కినేని నాగార్జున, కల్యాణ్ రామ్, అనుష్క మొదలైనవారంతా ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

షారుఖ్ ఖాన్, హిమా ఖురేషి, జయం రవి వంటి పరభాషా నటులు సైతం ఆర్ఆర్ఆర్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

"ఇపుడే నిద్ర లేచి, నాటు నాటు పాటకు డాన్స్ చేస్తూ మీ విజయానికి సంబారాలు చేసుకుంటున్నాం. మీకు ఇంకా ఎన్నో అవార్డులు రావాలి" అంటూ షారుఖ్ ఖాన్, రాజమౌళికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

RRR

ఫొటో సోర్స్, RRR MOVIE/TWITTER

రాజకీయ నాయకుల ప్రశంసలు

గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించినందుకు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయెస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల తరుపున ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

"తెలుగు జెండా పైకి ఎగురుతోంది. మేమంతా గర్వంతో ఉప్పొంగిపోతున్నాం" అంటూ జగన్ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇది తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 9

"ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటకు గోల్దెన్ గ్లోబ్ అవార్డ్ రావడం మనకు గర్వకారణం. చిత్ర బృందానికి అభినందనలు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా తెలుగు భాష భారతీయ శక్తిగా మారింది" అంటూ చంద్రబాబు అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 10

"నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించినందుకు భారతీయులంతా గర్విస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు" అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

ఆస్కార్ బరిలో...

'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డుకూ పోటీ పడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది.

'నాటు నాటు'కు పోటీగా మ‌రో 14 గీతాలు ఈ అవార్డు కోసం బరిలో నిలిచాయి. అందులో అవ‌తార్: ద వే ఆఫ్ వాట‌ర్‌ చిత్రంలోని పాట కూడా ఉంది.

ఇవి కూడా చదవండి: