‘నాటు నాటు’ సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకతలేంటి ?

వీడియో క్యాప్షన్, అంతర్జాతీయంగా పేరున్న ఫిలిం అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ ఒకటి
‘నాటు నాటు’ సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకతలేంటి ?

భారతీయ సినిమాకు 1959లో తొలిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. వి.శాంతారామ్ డైరెక్ట్ చేసిన ‘దో ఆంఖే బారా హాథ్(1957)’ సినిమా, విదేశీ భాషా విభాగంలో ఉత్తమచిత్రంగా నిలిచింది. 

ఆ తరువాత మహాత్మా గాంధీ జీవితం మీద తీసిన గాంధీ(1982) సినిమాకు ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను నిర్మించిన సంస్థల్లో నేషనల్ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి. 

మీరా నాయర్ తీసిన సలాం బాంబే(1988), మన్సూన్ వెడ్డింగ్(2001) సినిమాలు విదేశీ భాషా విభాగంలో నామినేట్ అయ్యాయి.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయునిగా 2009లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నిలిచారు.

ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, @RRRMovie

స్లమ్‌డాగ్ మిలియనీర్(2009) సినిమాకు ‘బెస్ట్ స్కోర్’ విభాగంలో ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. 

గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించి ‘బెస్ట్ పిక్చర్: నాన్- ఇంగ్లిష్ లాంగ్వేజ్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది.

ఒకవేళ ‘బెస్ట్ పిక్చర్’గా నిలిస్తే ఆ అవార్డును సొంతం చేసుకున్న మరొక భారతీయ సినిమాగా రికార్డును సృష్టించేది. కానీ ఈసారి ఈ అవార్డు అర్జెంటినా 1985 అనే సినిమాకు దక్కింది.

‘బెస్ట్ స్కోర్’ విభాగంలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిచింది. తద్వారా గోల్డెన్ గ్లోబ్‌ను ముద్దాడిన రెండో భారతీయునిగా ఎం.ఎం.కీరవాణి నిలిచారు.

‘నక్కినక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే...’ అని కొమురం భీం(జూనియర్ ఎన్టీఆర్) అన్నట్లుగా మిగతా సినిమాలను వెనక్కి నెడుతూ ‘ఆర్ఆర్ఆర్’ ముందుకు దూసుకుపోయింది.

నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)