రిషి రాజ్‌పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం

ఫొటో సోర్స్, PA Media
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి ఎంతో మంది సంస్కృత పండితులకు కొరుకుడు పడని ఒక వ్యాకరణ సమస్యను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన భారతీయ పీహెచ్‌డీ విద్యార్థి పరిష్కరించారు.
పాణిని బోధించిన నియమాన్ని 27 ఏళ్ల రిషి రాజ్‌పోపట్ డీకోడ్ చేశారు. పురాతన సంస్కృత భాషా నిపుణుడు పాణిని. ఆయన సుమారు 2,500 ఏళ్ల క్రితం నివసించారు.
సంస్కృత భాషను కేవలం భారత్‌లో మాత్రమే మాట్లాడతారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో ఇప్పుడు కేవలం 25 వేల మంది మాత్రమే ఈ భాషను మాట్లాడుతున్నారని అంచనా.
ఈ వ్యాకరణ సమస్యను పరిష్కరించేందుకు తొమ్మిది నెలల పాటు ప్రయత్నించిన రిషి రాజ్‌పోపట్ కేంబ్రిడ్జ్‌లో తనకు ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ ఘట్టమని అన్నారు.
సంస్కృతాన్ని ఎక్కువ మంది మాట్లాడనప్పటికీ, హిందూ ధర్మంలో ఈ భాషను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎన్నో శతాబ్దాలుగా భారత శాస్త్రీయ, తత్వశాస్త్రాల్లో, పద్య సాహిత్యంలో, ఇతర లౌకిక సాహిత్యాల్లో ఈ భాషను ఉపయోగించారు.

ఫొటో సోర్స్, PA Media
పాణిని రచించిన వ్యాకరణం అష్టాధ్యాయి.
ఒక పదానికి చెందిన భూమికను, ప్రత్యయాలను వ్యాకరణ పరంగా సరియైన పదాలుగా, వాక్యాలుగా మార్చేందుకు ఒక అల్గారిథం వల్లే పనిచేస్తుంది.
అయితే, రెండు లేదా అంతకంటే ఎక్కువ పాణిని నిబంధనలను ఒకేసారి ఉపయోగించడం ద్వారా కొన్ని సార్లు సమస్యలు తలెత్తుతాయి.
పాణిని ‘మెటారూల్’ను నేర్పించారు. ఈ రూల్ ప్రకారం సమాన బలం గల రెండు నియమాల మధ్యన వైరుధ్యం ఏర్పడినప్పుడు, వ్యాకరణ అనుసరణలో ఆ తర్వాత వచ్చే నియమమే గెలుస్తుందని పండితుల సంప్రదాయంగా నిర్వచించారు.
కానీ, దీని వల్ల వ్యాకరణంలో తప్పుడు ఫలితాలు వస్తాయి.
రిషి రాజ్‌పోపట్ సంప్రదాయబద్ధమైన ఈ మెటారూల్ నిర్వచనాన్ని కొట్టివేశారు. పాణిని నియమంలో పదానికి కుడి, ఎడమ వైపు నిబంధనలు వర్తింపచేసే సమయంలో, పదానికి కుడి వైపున వర్తించే నియమాన్నే ఎంచుకోవాలని పాణిని చెప్పారని ఆయన వివరించారు.
ఈ భాష్యాన్ని ఉపయోగించటం ద్వారా.. పాణిని ‘భాషా యంత్రం’ - అంటే వ్యాకరణం.. దాదాపుగా ఎలాంటి మినహాయింపులూ లేకుండా వ్యాకరణ పరంగా సరియైన పదాలను రూపొందిస్తున్నట్లు ఆయన గుర్తించారు.
భారత్‌కు చెందిన రాజ్‌పోపట్, ఈ సమస్యను పరిష్కరించే ప్రారంభంలో ఎంతో ఒత్తిడికి గురయ్యారు.
ఆ సమయంలో కొన్ని నెలల పాటు పుస్తకాలను మూసివేసి, స్విమ్మింగ్, సైక్లింగ్, కుకింగ్, ప్రార్థనలు, ప్రాణాయామం చేస్తూ వేసవి సెలవులను పూర్తిగా ఆనందంగా గడిపినట్లు రిషి రాజ్‌పోపట్ తెలిపారు.
ఆ తర్వాత మళ్లీ పనిలో మునిగిపోయినట్టు చెప్పారు. లైబ్రరీలోనే ఎన్నో గంటలు గడిపేవాడినని, రాత్రుళ్లు కూడా లైబ్రరీలోనే ఉండేవాడినని రిషి రాజ్‌పోపట్ తెలిపారు. కానీ, ఇంకా ఈ సమస్యపై మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉందని అన్నారు.
‘నేను కనుగొన్న ఈ పరిష్కారం భారత్‌లోని విద్యార్థులలో విశ్వాసాన్ని, గౌరవాన్ని, సరికొత్త ఆశను కలిగిస్తుంది. వారు కూడా ఇలాంటి ఎన్నో ఉత్తమమైన వాటిని సాధిస్తారు’ అని చెప్పారు.
కేంబ్రిడ్జ్‌లో సంస్కృత ప్రొఫెసర్ విన్సెంజో వెర్జియాని, రిషికి మార్గనిర్దేశం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మంది పండితులు పరిష్కరించలేని ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని రిషి కనుకొన్నాడని విన్సెంజో అన్నారు.
ఇది సంస్కృతం భాషపై మరింత మంది ఆసక్తి చూపించేందుకు స్ఫూర్తినిచ్చే ఒక విప్లవాత్మకమైన అధ్యయనం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా ఉద్రిక్తతలు: సరిహద్దుల్లో ఇప్పుడు ఘర్షణ ఎందుకు, ఇది చైనా వ్యూహమా
- ఫుట్బాల్ ప్రపంచకప్: ‘మేం ఓడిపోయాం.. కానీ, చాలా గర్వంగా ఉంది’
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు మరణానికి కారకులెవరు
- మాండోస్ తుపాను: “ఒక్కసారిగా వచ్చిన నీళ్లు మా పొలాలపై పడ్డాయి.. ఇసుక మేటలు వేశాయి”
- షాలిని చౌహాన్: మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ బయటపెట్టడానికి స్టూడెంట్ వేషంలో 3 నెలలు రహస్య ఆపరేషన్ చేపట్టిన లేడీ కానిస్టేబుల్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















