ఫుట్‌బాల్ ప్రపంచకప్‌: మొరాకో ఓటమిపై అభిమానులు.. ‘మేం ఓడిపోయాం.. కానీ, చాలా గర్వంగా ఉంది’

మొరాకో అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ‌కప్ ఫైనల్‌కు చేరిన మొదటి ఆఫ్రికన్ దేశంగా తమ జట్టు అవతరించాలని మొరాకో ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.

గత రాత్రి ఫ్రాన్స్‌‌తో జరిగిన సెమీ‌ఫైనల్లో మొరాకో 2-0 తేడాతో ఓడిపోయింది.

అంతకుముందు మొరాకో అంతటా ఫ్యాన్స్ చేరిపోయారు. ఖతార్‌లో తమ మాజీ వలస పాలకులపై తమ జట్టు పైచేయి సాధించగలదని ఆశలు పెట్టుకున్నారు. కానీ, అలా జరగలేదు.

థియో హెర్నాండెజ్, కైలియన్ ఎంబాపెలు తమ గోల్‌లతో ప్రపంచ ఛాంపియన్‌ను ఫైనల్‌కు చేర్చారు.

"మేం ఓడిపోయాం, కానీ చాలా గర్వంగా ఉంది" అని కాసాబ్లాంకాకు చెందిన ఒక అభిమాని బీబీసీకి చెప్పారు. 

ఫుట్‌బాల్
ఫొటో క్యాప్షన్, హేగ్‌లో మొరాకో అభిమానుల వద్ద భద్రతా సిబ్బంది

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో మొరాకో వారసత్వం కలిగిన వేలాది మంది నివసిస్తుండటంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

అంతేకాకుండా మొరాకో జెండాలతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల రంగులతో కూడిన జెండాలతో మొరాకో ఫ్యాన్స్ చాంప్స్ ఎలిసీస్‌లో గ్రూపుగా చేరి మద్దతు తెలిపారు.

తమ చివరి మ్యాచ్ గెలిచినపుడు మొరాకో ఫ్యాన్స్ బాణసంచాలతో సందడి చేసిన పలు ప్రాంతాలతో పాటు యూరప్‌లోని బ్రస్సెల్స్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొరాకో ఓడిపోవడం, వాతావరణం సహకరించకపోవడంతో నెదర్లాండ్‌లో మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌తో నిర్వహించే కార్యక్రమాలు తగ్గించారు.

మొరాకో ఓడిపోయాక అక్కడి వీధుల్లో వారి సంప్రదాయంలో భాగమైన మంటలు కనిపించాయి. అయితే తాము శాంతిని కాపాడేందుకే ప్రయత్నిస్తున్నామని డచ్ మొరాకన్‌లు స్పష్టం చేశారు.

ఫుట్‌బాల్

కాసాబ్లాంకాలోని మహమ్మద్ వీ స్టేడియంలోని ఏర్పాటు చేసిన ఫ్యాన్ జోన్‌లో మొరాకో మద్దతుదారుడొకరు సెమీఫైనల్ ఫలితంపై స్పందిస్తూ.. ''పర్లేదు.. ఇది గేమ్'' అని అన్నారు.

మ్యాచ్ చూస్తున్న చాలా మంది మాత్రం ఖతార్‌లో తమ జట్టు ప్రదర్శన మొరాకో ఫుట్‌బాల్ ఆటగాళ్ల మంచి భవిష్యత్‌కు నాంది అని చెప్పారు.

అయితే తమ జట్టు గోల్ చేయడానికి కష్టపడటంతో కాసాబ్లాంకాలోని ఓ కేఫ్‌లో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మొరాకోలో జన్మించి ఫ్రాన్స్‌లో పెరిగిన ఒక ఫ్యాన్ మాట్లాడుతూ.. మొరాకో గెలవాలని కోరుకుంటున్నానని, ఎందుకంటే ప్రపంచకప్‌ను ఆఫ్రికా ఎత్తాల్సిన సమయమిదని స్పష్టం చేశారు.

ఫుట్‌బాల్

''మా ఆటగాళ్లు చాలా ఇచ్చారు.. అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం..''

మాడ్రిడ్‌లోని కాసా అరబే సాంస్కృతిక కేంద్ర మైదానంలో ఏర్పాటుచేసిన పెద్ద టెంట్‌లో మొరాకో అభిమానులు ఆటను వీక్షించారు.

తమ జట్టును ఉత్సాహపరస్తూ అభిమానులు సంప్రదాయ మొరాకో స్నాక్స్ అందజేసుకున్నారు.

మొరాకో జట్టు చొక్కా ధరించిన రిఫ్‌కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు ఇనాస్ స్పందిస్తూ.. నేను మా జట్టును చూసి గర్వపడుతున్నానని బీబీసీకి చెప్పారు.

"వారు ఫుట్‌బాల్ కంటే ఎక్కువే చేశారు. మాకు చాలా విధాలుగా విజయాలను అందించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం వచ్చేలా చేశారు." అని అన్నారు.

కాసాబ్లాంకాకు చెందిన పెట్రోల్ బంక్ అటెండెంట్ మునీర్ గేమ్ అంతటా స్నేహితులతో కలసి ఉత్సాహంగా కనిపించారు.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్ రెండో గోల్ చేసినపుడు కొంత నిరాశకు గురైనప్పటికీ, మళ్లీ జట్టును ఉత్సాహపరుస్తూ ఉన్నారు.

సెమీఫైనల్‌కు చేరిన మొరాకో జట్టు గురించి "ఇది జీవితకాలంలో ఒకసారి జరిగే ఈవెంట్. మా పిల్లలు కూడా మళ్లీ చూస్తారో లేదో. ఇది మాకు చాలా ముఖ్యమైంది'' అని అన్నారు.

 సెమీఫైనల్ మ్యాచ్ ముగిసే ముందు రిఫరీ ఆఖరి విజిల్ వెయ్యడంతో యూకేలోని నార్త్-వెస్ట్ లండన్‌లోని క్రికిల్‌వుడ్‌లో మొరాకో మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

అభిమానులు తమ జట్టు ఆటతీరుపై గర్వంగానే ఉన్నారు. గడ్డకట్టే చలి ఉన్నా కూడా మొరాకో ఫ్యాన్స్ దుప్పట్లు కప్పుకుని, టీ తాగుతూ, షిషా ధూమపానం సేవిస్తూ కనిపించారు.

ట్యునీషియన్లు, అల్జీరియన్లు, ఈజిప్షియన్లు కేఫ్ ప్రీగోలో ఉన్నారు.

లండన్‌లోని అరబ్ ప్రవాసులను ఏకం చేసిన ఈ ప్రపంచకప్ అత్యుత్తమమైనదిగా ఒక అభిమాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ''మనమంతా ఒకే దేశం'' అంటూ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, మ్యూనిక్ ఒలింపిక్స్‌ నరమేధంలో మృతులైన ఇజ్రాయెల్ ఆటగాళ్ల కుటుంబాలు ఇప్పుడేమంటున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)