జాకీ అన్వారీ: గాల్లోకి ఎగురుతున్న అమెరికా విమానాన్ని పట్టుకుని దేశం దాటాలనే ప్రయత్నంలో అఫ్గాన్ ఫుట్‌బాల్ ఆటగాడి మృతి

అఫ్గాన్ ఫుట్ బాల్ ఆటగాడు జాకీ అన్వారీ

ఫొటో సోర్స్, AFGHAN SPORTS SOCIETY

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో జాకీ అన్వారీకి పలువురు నివాళులు అర్పిస్తున్నారు

కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన అమెరికా విమానాన్ని పట్టుకుని వేలాడుతూ దేశం దాటాలని ప్రయత్నించి, ఆకాశం నుంచి కిందపడి మరణించిన యువకుడు ఓ ఫుట్‌బాల్ ఆటగాడు అని అఫ్గానిస్తాన్ అధికారులు ధ్రువీకరించారు.

అఫ్గానిస్తాన్ జాతీయ యూత్ టీమ్‌కు జాకీ అన్వారీ(19) పాత్రినిధ్యం వహించాడు. అయితే, అతను ఏ సమయంలో చనిపోయాడన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు.

అఫ్గానిస్తాన్ తాలిబాన్ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి వేలాది మంది ప్రజలు కాబుల్ ఎయిర్ పోర్టుకు తరలివస్తున్నారు. మరోవైపు పాశ్చాత్య దేశాలు వారి పౌరులను, సహోద్యోగులైన అఫ్గానీయులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

రన్ వేపై బయల్దేరుతున్న విమానాన్ని వందలాది మంది ప్రజలు చుట్టుముట్టారు. తమనూ తీసుకెళ్లాలంటూ దాని వెంటే పరుగులు తీశారు. కొందరైతే విమానాన్ని పట్టుకుని వేలాడారు. ఈ సంఘటనలకు సంబంధించిన ఫొటోలు సోమవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. కనీసం ఇద్దరు వ్యక్తులు ఈ విమానం నుంచి పడిపోయి ప్రాణాలు వదిలారు. ఖతార్లో దిగిన ఓ విమానం ల్యాండింగ్ గేర్లో మానవ అవశేషాలు దొరికినట్లు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

అఫ్గానిస్తాన్ భౌతిక విద్య, క్రీడల జనరల్ డైరెక్టరేట్ అన్వారీకి నివాళులు అర్పించింది. 'ఆయన స్వర్గంలో విశ్రాంతి తీసుకోవాలి. ఆయన కుటుంబాన్ని, స్నేహితులను, క్రీడా సహచరులను ఆ దేవుడు కాపాడాలి' అని క్రీడా సంస్థ కోరింది.

కాబుల్‌లోని కార్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా 4500 మంది అమెరికన్ సైనికుల అదుపులో ఉంది. ప్రయాణ ధ్రువపత్రాలు లేని వారిని తాలిబాన్ ఎయిర్ పోర్టులోకి వెళ్లకుండా ఆపేస్తోంది. పత్రాలు ఉన్న వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎయిర్ పోర్టులో నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య సైన్యం ఉపసంహరణ సబబేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సమర్ధించుకున్నారు.

తరలింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆగస్టు 31 కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని బిడెన్ వ్యాఖ్యానించారు. తాలిబాన్‌తో ఆగస్టు 31లోగా తరలింపును పూర్తి చేస్తామని అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది.

వీడియో క్యాప్షన్, కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)