ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ 2022: చివరి దశకు పోరు.. అర్జెంటీనాను మెస్సీ ఫైనల్స్‌కు తీసుకెళ్తాడా?

ఫుట్‌బాల్ వరల్డ్ కప్

ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఇంగ్లండ్ ప్రపంచ కప్ ఆశలు ఆవిరయ్యాయి. టోర్నీలో ప్రస్తుతం అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో మిగిలాయి.

ప్రతీ జట్టు ఈ వారంలో ట్రోఫీని అందుకుంటామనే గట్టి నమ్మకంతో ఉంది. ఇది చాలా కొద్ది మంది మాత్రమే ఈ నాలుగు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా వేశారు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు కావొచ్చు.

మెస్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఇది మెస్సీ సమయమా?

సెమీ‌ ఫైనల్స్‌పై వార్తలన్నీ ప్రస్తుతం లియోనెల్ మెస్సీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అర్జెంటీనా సూపర్‌స్టార్ మొదటిసారి ప్రపంచ కప్‌ను గెలవగలడా? లేదా అనేదే హాట్ టాఫిక్. మెస్సీ తన కెరియర్‌లో 10 స్పానిష్ లీగ్ టైటిళ్లు, ఫ్రాన్స్‌లో మరొకటి గెలుచుకున్నాడు.

నాలుగు ఛాంపియన్స్ లీగ్స్, 2021 కోపా అమెరికా లీగ్‌తోపాటు ఏటా అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడికి ఇచ్చే బాలన్ డీ ఓర్ అవార్డులు ఏడు మెస్సీ గెలుచుకున్నారు.

కానీ, బ్రెజిల్‌కు చెందిన పీలే, అర్జెంటీనాకు చెందిన డిగో మారడోనా వంటి ఇతర ఆల్-టైమ్ గొప్ప ఆటగాళ్లు తమ ప్రపంచకప్ కలను నెరవేర్చుకున్నారు. కానీ, 35 ఏళ్ల మెస్సీకి అంది అందని ద్రాక్షలానే మిగిలింది.

2014లో అర్జెంటీనాను మెస్సీ రన్నరప్‌గా నిలిపారు. అర్జెంటీనా చివరి ప్రపంచకప్‌ సాధించి 36 ఏళ్లు పూర్తయ్యాయి. మారడోనా సారథ్యంలోని జట్టు అప్పుడు కప్ గెలుచుకుంది.

అయితే మెస్సీ ఈ ఫీట్‌ను పునరావృతం చేయగలరా అనేదే నేడు అసలు ప్రశ్న.

మొరాకో

ఫొటో సోర్స్, Getty Images

మొరాకో సంచలనం స‌ృష్టించనుందా?

మొరాకో ఇప్పటికే చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ సెమీస్ చేరిన మొదటి ఆఫ్రికన్, అత్యధిక ముస్లింలు గల జట్టు మొరాకో.

చెల్సియా హకీమ్ జియెచ్, ప్యారిస్ సెయింట్-జర్మైన్, అచ్రాఫ్ హకీమి వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టుతో ఈ దశకు చేరుకొని అందరి అంచనాలను తలకిందులు చేసింది.

రౌండ్ 16లో స్పెయిన్‌ను, క్వార్టర్-ఫైనల్స్‌లో పోర్చుగల్‌ను ఓడించడానికి ముందు క్రొయేషియా, బెల్జియం జట్లు ఉన్న గ్రూపులో అగ్రస్థానం కైవసం చేసుకుంది మొరాకో. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లాలనుకుంటోంది.

వారి విజయ రహస్యం దుర్భేధ్యమైన ఢిఫెన్స్‌లోనే ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మొరాకోపై ఏ ప్రత్యర్థి ఆటగాడు స్కోర్ చేయలేదు.

ఆ జట్టు ప్రత్యర్థికి ఒకే ఒక గోల్ ఇచ్చింది. అది కూడా కెనడాకు ఇచ్చిన సెల్ఫ్ గోల్‌ మాత్రమే.

టోర్నమెంట్ సమయంలో అత్యంత ఉత్సాహంగా మద్దతు పొందిన జట్లలో మొరాకో కూడా ఒకటి.

ఈ ప్రపంచకప్ ఖతార్‌కు సంబంధించినది మాత్రమే కాదని, ఇది మిడిల్ ఈస్ట్ ప్రాంతం, మొత్తం ముస్లింలకు సంబంధించినదని నిర్వాహకులు తెలిపారు.

మరి వారు మంగళవారం ఎంత ఉత్సాహంగా ఉంటారో చూడాలి.

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్ తిరగరాస్తుందా?

మొరాకో కాకుండా అత్యంత ప్రభావం చూపగల మరొక యూరప్ జట్టు ఫ్రాన్స్.

అరవై ఏళ్ల క్రితం 1962లో బ్రెజిల్ జట్టు పేరిట ఉన్న రికార్డు (ప్రపంచకప్ వరుసగా రెండోసారి దక్కించుకోవడం)ను మొరాకో తిరగరాయడానికి ప్రయత్నిస్తోంది.

ఇటీవల కాలంలో విజేతలకు కలిసిరాలేదు. గత 12 ఏళ్లలో డిఫెండింగ్ ఛాంపియన్‌లు‌గా బరిలో దిగిన ఇటలీ, స్పెయిన్ , జర్మనీ జట్లు ముందుగానే నిష్క్రమించాయి. అయితే ఫ్రాన్స్ ఆ చరిత్రను తిరగరాసింది.

ఇంగ్లండ్‌పై శనివారం విజయం సాధించడం ద్వారా 1998లో బ్రెజిల్ తర్వాత సెమీ-ఫైనల్‌కు చేరిన మొదటి డిఫెండింగ్ ఛాంపియన్‌గా మారింది.

కాగా, మేనేజర్ డిడియర్ డెస్చాంప్స్ మొరాకో జట్టుపై దృష్టి సారించారు. వరుసగా రెండో ఫైనల్‌కు చేరే అవకాశాల గురించి ప్రశ్నించగా "మీరు చాలా ముందున్నారు" అని వ్యాఖ్యానించారు.

క్రొయేషియా

ఫొటో సోర్స్, Getty Images

క్రొయేషియా మరో‌సారి సాధిస్తుందా?

ఒకవేళ మొరాకోను ఫ్రాన్స్, అర్జెంటీనాను క్రొయేషియా ఓడిస్తే 2018 ఫైనల్ రిపీట్ అవుతుంది.

నాలుగేళ్ల క్రితం డెన్మార్క్, రష్యాలపై పెనాల్టీ షూటౌట్‌ల ద్వారా క్రొయేషియా ఫైనల్ చేరింది. ఈ ఏడాది కూడా జపాన్, బ్రెజిల్‌లపై షూటౌట్ల ద్వారానే ఇక్కడికి చేరింది.

కాగా, ప్రపంచ కప్ నాకౌట్ గేమ్‌ 90 నిమిషాల్లో చివరిసారిగా క్రొయేషియా గెలిచి 24 సంవత్సరాలైంది. 1998లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీపై 3-0 తేడాతో గెలిచింది.

ఈ ఏడాది మొరాకో గుర్తుండిపోయే ఆటతీరు కనబరచడానికి 37 ఏళ్ల మిడ్ ఫీల్డర్ లూకా మోడ్రిక్ ఘనత కూడా ఓ కారణమే .

అదనపు సమయాల్లో లూకా మంచి ఆటతీరు కనబరిచారు. 2018 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజీలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఓడిపోయిన అర్జెంటీనా, ఇపుడు ఆ జట్టును తక్కువ అంచనా వేసే ధైర్యం చేయదు.

వీడియో క్యాప్షన్, జర్మనీ, కోస్టారికా తలపడిన మ్యాచ్‌లో ముగ్గురు సభ్యులున్న బృందానికి నాయకత్వం వహించారామె.

సెమీ-ఫైనల్‌ ఎలా చూడాలి?

బుధవారం రాత్రి 7 గంటలకు (జీఎంటీ)కి ప్రారంభం కానున్న ఫ్రాన్స్ vs మొరాకో, యూకేలోని బీబీసీ వన్, ఐ ప్లేయర్ (iPlayer) లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

అర్జెంటీనా vs క్రొయేషియా మ్యాచ్ మంగళవారం రాత్రి 7 గంటలకు (జీఎంటీ)కి, ITVలో చూడవచ్చు.

ఈ రెండు సెమీ‌ఫైనల్ మ్యాచ్‌ల కామెంటరీ బీబీసీ రేడియో 5 లైవ్, బీబీసీ సౌండ్స్ యాప్‌లలో వినవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)