Football Accidents: ఫుట్‌బాల్ అభిమానులు అత్యధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన 15 దుర్ఘటనలు..

ఇండోనేసియా ఫుట్‌బాల్ మ్యాచ్ తొక్కిసలాట

ఫొటో సోర్స్, EPA

ఇండోనేసియా పోలీసుల వివరాల ప్రకారం ఈస్ట్ జావాలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 125 మంది చనిపోయారు.

ఒక ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి, ప్రేక్షకులు భారీగా చనిపోవడం అనేది ఇప్పుడు మొదటిసారి జరగలేదు.

గత కొన్ని దశాబ్దాలుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల సమయంలో జరిగిన భారీ ప్రమాదాలను ఒకసారి చూద్దాం.

బీబీసీ రెడ్‌లైన్
కామెరూన్ స్టేడియం వద్ద తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు
ఫొటో క్యాప్షన్, కామెరూన్ స్టేడియం వద్ద తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు

కామెరూన్, జనవరి 2022

ఇదే ఏడాది జరిగిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌కు కామెరూన్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్-16 పోటీలో కామెరూన్, కోమోరోజ్ టీమ్‌లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోగా, మరో 38 మంది గాయపడ్డారు.

బీబీసీ రెడ్‌లైన్
2015లో ఈజిప్టులో రెండు ప్రమాదాలు జరిగాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2015లో ఈజిప్టులో రెండు ప్రమాదాలు జరిగాయి

ఈజిఫ్ట్, ఫిబ్రవరి 2015

రాజధాని కైరోలోని స్టేడియంలో పోలీసులు, కైరోకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ జమాలేక్ ఫుట్‌బాల్ క్లబ్ అభిమానుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కనీసం 22 మంది చనిపోయారు. ఇది ఈజిఫ్టులోని పోర్ట్ సయీద్‌లో 2012లో జరిగిన ఫుట్‌బాల్ ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చింది.

2012 ఫిబ్రవరిలో ఫోర్ట్ సయీద్ నగరంలో అల్-మస్రీ, అల్-అహ్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండు జట్ల అభిమానులు గొడవలకు దిగారు. ఈ ఘటనలో కనీసం 73 మంది చనిపోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఈజిఫ్ట్ ఫుట్‌బాల్ లీగ్‌ను రెండేళ్లు రద్దు చేశారు.

బీబీసీ రెడ్‌లైన్

ఐవరీ కోస్ట్, మార్చి 2009

మలావీ-ఐవరీ కోస్ట్ మధ్య అబిద్‌జాన్‌లోని ఫెలిక్స్ హుఫే బొహానీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ సాకర్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో తొక్కిసలాట జరగడంతో కనీసం 19 మంది చనిపోయారు.

బీబీసీ రెడ్‌లైన్
ఆఫ్రికాలో జరిగిన అత్యంత ఘోరమైన ఫుట్‌బాల్ ప్రమాదంలో కనీసం 126 మంది చనిపోయారు

ఫొటో సోర్స్, ISSOUF SANOGO

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికాలో జరిగిన అత్యంత ఘోరమైన ఫుట్‌బాల్ ప్రమాదంలో కనీసం 126 మంది చనిపోయారు

ఘనా, మే 2001

ఆఫ్రికాలో జరిగిన అత్యంత ఘోరమైన ఫుట్‌బాల్ ప్రమాదంలో కనీసం 126 మంది చనిపోయారు. ఘనా రాజధాని అక్రాలోని ప్రముఖ స్టేడియంలో మ్యాజ్ జరుగుతున్న సమయంలో అభిమానులు రెచ్చిపోయారు. పోలీసులు కాల్పులు జరపడంతో తొక్కిసాలట మొదలైంది. దీంతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో చనిపోయారు. ఈ ఘటనలో పోలీసులపైనే ఆరోపణలు వచ్చాయి.

బీబీసీ రెడ్‌లైన్

దక్షిణాఫ్రికా, ఏప్రిల్ 2001

దక్షిణాఫ్రికా లీగ్‌లో ఒక మ్యాచ్ సందర్భంగా అభిమానులు మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించారు. అక్కడ తొక్కిసలాట జరగడంతో 43 మంది చనిపోయారు.

బీబీసీ రెడ్‌లైన్

గ్వాటెమాలా, అక్టోబర్ 1996

గ్వాటెమాలా సిటీలో కోస్టారికా, గ్వాటెమాలా మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో 82 మంది చనిపోయారు. 147 మంది గాయపడ్డారు.

బీబీసీ రెడ్‌లైన్

ఫ్రాన్స్, మే 1992

ఫ్రాన్స్ కప్ సెమీ ఫైనల్ జరుగుతున్నప్పుడు బాస్తిథా ఫురానీ స్టేడియంలోని ఒక స్టాండ్ కూలిపోవడం వల్ల కనీసం 18 మంది చనిపోయారు. 2300 మంది గాయపడ్డారు.

ఈ ఘటనలో జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 5న ఎలాంటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగకుండా ఫ్రాన్స్ పార్లమెంట్ గత ఏడాది ఒక చట్టం ఆమోదించింది.

బీబీసీ రెడ్‌లైన్

దక్షిణాఫ్రికా, జనవరి 1991

ఓపన్‌హీమర్ స్టేడియంలో జరుగుతున్న ఓపెనింగ్ మ్యాచ్‌లో తొక్కిసలాట జరగడంతో 42 మంది చనిపోయారు. ఓర్కనీ నగరంలో కైజర్ చెఫ్స్, ఓర్లాండో పైరేట్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. పైరేట్‌కు చెందిన ఒక అభిమాని చెప్స్‌కు చెందిన ఒక అభిమానిని కత్తితో పొడవడంతో ఈ తొక్కిసలాట మొదలైంది.

బీబీసీ రెడ్‌లైన్
1989లో బ్రిటన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 96 మంది అభిమానులు చనిపోయారు

ఫొటో సోర్స్, Manchester Daily Express

ఫొటో క్యాప్షన్, 1989లో బ్రిటన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 96 మంది అభిమానులు చనిపోయారు

బ్రిటన్, ఏప్రిల్ 1989

షోఫీల్డ్స్‌లోని హిల్స్‌బరో స్టేడియంలో లివర్‌పూల్, నాటింఘమ్ ఫారెస్ట్ మధ్య జరిగిన ఎఫ్ఏ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ సమయంలో కిక్కిరిసిన ఒక స్టాండ్ తలుపులు మూసేశారు. దీంతో కనీసం 96 మంది లివర్‌పూల్ అభిమానులు నలిగిపోయి చనిపోయారు. ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని భావించారు. ఘటన తర్వాత బ్రిటన్‌లో చాలా స్టేడియంలలో కూర్చునే ఏర్పాట్లు మాత్రమే చేశారు. మైదానం స్టాండ్ మధ్య ఉన్న బారికేడ్లను తొలగించారు.

బీబీసీ రెడ్‌లైన్

నేపాల్, మార్చి 1988

నేపాల్‌లోని నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియంలో వడగళ్ల వాన కురవడంతో మోసి ఉన్న స్టేడియం నుంచి బయటకు వెళ్లాలనే తొందరలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 90 మంది అభిమానులు చనిపోయారు.

బీబీసీ రెడ్‌లైన్

బెల్జియం, మే 1985

బ్రసెల్స్‌లోని హెసెల్ స్టేడియంలో జువెంటస్, లివర్‌పూల్ మధ్య యూరోపియన్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రెండు జట్ల అభిమానులు కొట్టుకున్నారు. హింస జరగడంతో కనీసం 39 మంది అభిమానులు చనిపోయారు. 600 మందికి పైగా గాయపడ్డారు.

బీబీసీ రెడ్‌లైన్

బ్రిటన్, మే 1985

బ్రైడ్‌ఫర్డ్‌లో జరిగిన ఒక థర్డ్ డివిజన్ మ్యాచ్ సందర్భంగా అగ్ని ప్రమాదం జరగడంతో కనీసం 56 మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు.

బీబీసీ రెడ్‌లైన్

రష్యా, అక్టోబర్ 1982

మాస్కోలోని లుజ్నీకీ స్టేడియంలో రష్యా జట్టు స్పార్టాక్ మాస్కో, నెదర్లాండ్స్ జట్టు హెచ్ఎఫ్‌సి హార్లేమ్ మధ్య యూఈఎఫ్ఏ కప్ మ్యాచ్ సమయంలో అభిమానులు నలిగిపోయారు.

సోవియట్ రష్యా చాలా ఏళ్ల వరకూ ఈ ఘటన గురించి సమాచారం ఇవ్వలేదు. తర్వాత ఈ ప్రమాదంలో 66 మంది చనిపోయారని అది తర్వాత చెప్పింది. అయితే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండచ్చు. ఒక అంచనా ప్రకారం ఆ సమయంలో ఒక తలుపు దగ్గరే 340 మంది అభిమానులు కాళ్ల కింద నలిగిపోయారు. అయితే మృతుల అసలు సంఖ్య ఎంత అనేది ఎప్పుడూ ధ్రువీకరించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)