ఖతార్ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్‌లో ఫుట్‌బాల్ క్రీడల కోసం డబ్బులు చెల్లించి నకిలీ ఫుట్‌బాల్ అభిమానులను నియమించారంటూ వచ్చిన ఆరోపణలు ఈ ఏడాది ప్రపంచ కప్ పోటీలపై తలెత్తిన వివాదాల్లో ఒకటి. అయితే.. ఈ ప్రాంతంలో ఫుట్‌బాల్ పట్ల ఉన్న ప్రేమను పొరపాటుగా అర్థం చేసుకున్నారని కొందరు స్థానికులు దీనిని సమర్థించుకున్నారు.
కానీ.. బీబీసీ పరిశోధనలో ‘ఫుట్‌బాల్ అభిమానుల’కు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. విదేశీ అభిమానులు ఈ టోర్నమెంట్ గురించి సోషల్ మీడియాలో సానుకూల కామెంట్లు పోస్ట్ చేసేట్లయితే.. ఖతార్‌లో ఈ టోర్నీకి వచ్చివెళ్లటానికి విమానం టికెట్లు, బస చేయటానికి ఏర్పాట్లు ఉచితంగా అందిస్తామని ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది.
వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకల్లో వేల సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటంతో పాటు, దోహా నగరంలో వీధులను నింపటానికి నకిలీ అభిమానులకు డబ్బులు చెల్లించి పంపించారనే ఆరోపణలతో.. ఖతార్‌లో జనం గుంపులు మరోసారి అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కాయి.
దోహాలో ‘ఫేక్ ఫ్యాన్స్’ ఆరోపణలను దర్యాప్తు చేస్తుండగా.. వివిధ దేశాలకు చెందిన వీరాభిమానులకు ఉచిత విమానయానం, బస ఏర్పాట్లు చేసినట్లు బీబీసీ కనుగొన్నది. ఈ టోర్నమెంటు గురించి సోషల్ మీడియాలో సానుకూలంగా పోస్టులు చేయటంతో పాటు.. ఇతర అంశాలనూ లైక్ చేయటం, షేర్ చేయటం చేయటానికి సిద్ధపడిన వారికి ఈ ఉచిత ఆఫర్లు ఇచ్చినట్లు వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
వీధుల్లో ‘నకిలీ’ అభిమానులు
మొదటి మ్యాచ్ జరగటానికి ముందు వందలాది మంది అభిమానులు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలు చేతుల్లో పట్టుకుని ఊపుతూ దోహా నగర వీధుల్లో నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు.
అయితే.. అధికారిక వరల్డ్ కప్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసిన పలు వీడియోలకు కొందరు ప్రతిస్పందిస్తూ.. ప్రపంచంలో వేర్వేరు దేశాల జట్లకు మద్దితిస్తున్నట్లుగా ఉన్న సదరు అభిమానుల్లో చాలా మంది పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా జనం లాగా ఎందుకు కనిపిస్తున్నారని ప్రశ్నించారు.
‘‘ఇతర దేశాలకు అభిమానులుగా ఉండటానికి వారికి డబ్బులు చెల్లిస్తున్నారా, ఏంటి?’’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
అటువంటి వ్యాఖ్యలు ఈ ప్రాంతాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్నట్లు చెప్తున్నాయని ఆరన్ ఫెర్నాండాజ్ అనే ఖతార్ నివాసి దోహాలో బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఆరన్ కుటుంబ మూలాలు భారతదేశంలో ఉన్నాయి.
చాలా మంది వలసవచ్చి ఖతార్‌ను తమ నివాసంగా మలచుకున్నారని, కాబట్టి వివిధ అంతర్జాతీయ జట్లను సమర్థించే అభిమానులు ఈ దేశంలో ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని ఆయన పేర్కొన్నారు.
‘‘ఈ క్రీడను చాలా ప్రేమించే భారతీయ అభిమానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఫుట్‌బాల్‌ను భారతీయులు ఎంతగా ఇష్టపడతారనే విషయాన్ని ఈ ఫిఫా వరల్డ్ కప్ చాటిచెప్పటం సంతోషంగా ఉంది’’ అని ఆరన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ ఆసియాలో జనం ఎక్కువగా క్రికెట్‌ను ఇష్టపడుతున్నప్పటికీ.. ఈ ప్రాంతంలోని క్రీడాభిమానుల్లో చాలా మంది ఫుట్‌బాల్‌ను కూడా ప్రేమిస్తారని ఆయన చెప్పారు.
అయితే ఇండియా వంటి దేశాలు ప్రపంచ కప్‌లో ఎన్నడూ ఆడనందున.. ఆ అభిమానులు ఇతర దేశాలను ఎంచుకుని మద్దతిస్తుంటారని, ఆటను చూడటానికి విదేశాలకు కూడా ప్రయాణిస్తుంటారని ఆయన వివరించారు.
ఆరన్ రెండు సపోర్టర్ల గ్రూపుల్లో – ఒకటి ఫిఫా ఫ్యాన్ మూవ్‌మెంట్, రెండోది ఖతార్ ఫ్యాన్ లీడర్ స్కీమ్ - కూడా సభ్యుడిగా ఉన్నారు. ఫిఫా, ప్రపంచ కప్ 2022 నిర్వహణ కమిటీ ఈ గ్రూపులను ఏర్పాటు చేసి నడుపుతున్నాయి.
ఫ్యాన్ లీడర్ స్కీమ్‌లో భాగంగా ఏదైనా ఒప్పందం మీద సంతకం చేయాల్సి వచ్చిందా అన్న ప్రశ్నకు ఆరన్ స్పష్టంగా బదులివ్వలేదు.
‘‘సహజంగానే బాధ్యతలు ఉంటాయి. కానీ అన్నీ క్రీడకు సంబంధించినవే. వాళ్లు ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తున్నారు. ఇందులో పెద్ద విషయమేమీ లేదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరన్ అస్పష్టంగా సమాధానం చెప్పినప్పటికీ.. ఫ్యాన్ లీడర్ ప్రోగ్రామ్‌లోని చాలా మంది సభ్యులతో కాంట్రాక్టుల మీద సంతకాలు చేయించుకున్నారని, అదే సమయంలో వారికి టోర్నమెంటు నిర్వాహకుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభించాయని బీబీసీకి తెలిసింది.
ఇలాంటి ప్రోత్సాహకాల్లో భాగంగా చాలా మంది విదేశీ అభిమానులు, మద్దతుదారులకు ఖతార్ రావటానికి ఉచిత విమానాలు, హోటల్ బస అందించినట్లు బీబీసీ చూసిన పత్రాలు, పలువురు నిర్వాహక అధికారుల వాంగ్మూలాలు నిర్ధారించాయి. అయితే అభిమానుల అనుభూతిని మెరుగుపరచటానికి ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.
ఈ ప్రోత్సాహకాలకు ప్రతిఫలంగా.. ఒక ప్రవర్తనా నియమావళి మీద సంతకాలు చేయాలని అభిమానులను నిర్వాహకులు కోరారు. ‘‘అనువైన చోట ఎస్ (సుప్రీం) సీ(కమిటీ) కంటెంట్‌ను మీ పోస్టులతో జత చేయాలి’’ అని, థర్డ్ పార్టీ మెటీరియల్‌ను లైక్ చేయటం, షేర్ చేయటం వంటివి చేయాలనే నిబంధనలు ఆ ఒప్పందంలో ఉన్నాయి.
సుప్రీం కమిటీ అంటే ఫీఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 టోర్నమెంటును నిర్వహిస్తున్న సంస్థ.
ఈ ఒప్పందాల్లో అభిమానులను ‘‘ఖతార్‌కు ప్రచారకులు’’గా ఉండాలని తాము కోరుకోవటం లేదని, అయితే ఖతార్ సుప్రీం కమిటీని కానీ, వరల్డ్ కప్ ఖతార్ 2022ను కానీ చులకన చేయవద్దని చెప్పారు.
‘‘మొదటి ఆటకు, ప్రారంభోత్సవాలకు అభిమానులకు ఒక ఉచిత టికెట్ ఇచ్చార’’ని బెల్జియం ఫుట్‌బాల్ అసోసియేషన్ మీడియా అధికారి పియెర్రి కార్నెజ్ చెప్పారు.
కేవలం బెల్జియం అభిమానులకు మాత్రమే కాకుండా.. ‘‘వరల్డ్ కప్‌లో ఆడుతున్న అన్ని దేశాలకూ’’ ఈ ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
అయితే.. ఈ పథకంలో చేరిన అభిమానులు అందరూ కూడా ఈ ఒప్పందం మీద సంతకాలు చేయలేదని పేర్కొన్నారు.

ఉచిత విమానాలు, హోటళ్లు

ఖతార్‌లో కార్మిక హక్కులు, ఎల్‌జీబీటీక్యూ హక్కులు, వాక్‌స్వాతంత్ర్య హక్కుల విషయంలో ప్రతికూల చరిత్ర రీత్యా.. వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహణను ఖతార్‌కు కేటాయించాలన్న నిర్ణయాన్ని పదే పదే విమర్శిస్తున్నారు.
కాబట్టి ఖతార్ టోర్నమెంట్ ప్రతిష్టను ‘పెంచే’ ప్రయత్నాల్లో భాగంగా ఖతార్ ఈ ఫ్యాన్ లీడర్ స్కీమ్‌ను ప్రారంభించినట్లు కొన్ని స్వతంత్ర, క్షేత్రస్థాయి మద్దతుదారుల క్లబ్‌లు భావిస్తున్నాయి.
ఇలాంటి వ్యవస్థలను ఇంతకుముందు ఏ ప్రధాన టోర్నమెంటులోనైనా ఉపయోగించినట్లు తను ఎన్నడూ వినలేదని ఫ్యాన్ సపోర్టర్స్ యూరప్ అనే క్లబ్ బోర్డు సభ్యురాలు మార్తా జెన్స్ చెప్పారు.
‘‘ఇది ఫ్యాన్ మూవ్‌మెంట్ కాదు.. ఇది ఫ్యాన్ ఫ్రాడ్. ఇది విచిత్రం. అనుమానాస్పదం. సరైన పని కాదు’’ అని ఆమె పేర్కొన్నారు.
అయితే ఈ పథకాన్ని సుప్రీం కమిటీ (ఎస్‌సీ) సమర్థించుకుంది. ‘‘ఈ ప్రోత్సాహక కార్యక్రమం.. 59 వేర్వేరు దేశాల నుంచి వచ్చే అభిమానుల అవసరాలు, సమస్యలను ఎస్‌సీ అర్థం చేసుకోవటానికి దోహదపడింది’’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- 2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి.. ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా
- బిడ్డ నల్లగా పుట్టిందనే అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేయించిన ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే...
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?