BBC ISWOTY : రతన్‌బాలా దేవీ.. భారత ఫుట్‌బాల్ జట్టుకు ఊపిరి

ఫొటో సోర్స్, Aiff
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో ఉన్న నంబోల్ ఖతాంగ్ గ్రామంలో ఓ సాదాసీదా కుటుంబంలో జన్మించారు రతన్‌బాల దేవీ. ఆమె పూర్తి పేరు నాంగ్‌మెతెమ్ రతన్‌బాలా దేవి.
దేశం గర్వించదగ్గ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా ఎదగడానికి ఆమె అహర్నిశలు కష్టపడ్డారు.
చిన్నతనం నుంచి అబ్బాయిలతోనే ఆమె ఫుట్‌బాల్ ఆడేవారు.
మొదట్లో ఏదో సరదాగా ఆడిన ఆమె, తర్వాత దాన్ని తన కెరీర్‌గా మలుచుకున్నారు. గ్రౌండ్‌లోనే ఎక్కువ సమయం గడపడానికి ఆమె ఆసక్తి చూపించేవారు.

ఆరంభంలో అడ్డంకులు దాటుకుంటూ...
రతన్‌బాలా తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తుండేవారు.
ఐదుగురు పిల్లల కుటుంబాన్ని ఆయనే పోషించేవారు.
ఫుట్‌బాల్ పట్ల తనకున్న ఆసక్తిని ప్రోత్సహించిన నాన్నే నా హీరో అంటారు రతన్‌బాలా.
ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఆయన తనను ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదని ఆమె అంటారు.
తన బాబాయిల్లో ఒకరు కూడా తాను ఈ స్థితిలో ఉండటానికి కారణమంటారామె.
కుటుంబ సహకారం, ప్రోత్సాహతో ఇంఫాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ చేరారు రతన్‌బాలా.
అయితే అక్కడ సదుపాయాలు సరిగా లేవని, తనకు ఎక్కువ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదని, తన ప్రతిభ బైటికి రాకపోవడానికి అది కూడా ఒక కారణమన్నారామె.
ఆ తర్వాత ఆమె KRYHPSA ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరారు. ఓజా చౌబా అనే కోచ్ ఆమెకు శిక్షణ ఇచ్చారు. ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ఈ క్లబ్ ద్వారా తనకు అవకాశం కలిగిందని ఆమె వివరించారు.
ఈ క్లబ్ కారణంగానే అనేక టెక్నిక్‌లు నేర్చుకుని ఆట తీరును మెరుగు పరుచుకున్నానని ఆమె తెలిపారు.

ఎన్నెన్నో కలలు
రతన్‌బాలా దేవిలోని ప్రతిభ ఆమెను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆమె జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించారు.
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ నిర్వహించే అనేక టోర్నమెంట్లలో ఆమె పాల్గొన్నారు.
2015లో ఇండియన్ విమెన్ జూనియర్ టీమ్‌లో స్థానం సంపాదించారు. బెస్ట్ ప్లేయర్‌తోపాటు ఆమె ఎన్నో బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు.
2017లో ఇండియన్ సీనియర్ ఫుట్‌బాల్ టీమ్‌లో స్థానం సంపాదించడం ద్వారా రతన్‌బాలా తన కలను నెరవేర్చుకున్నారు.
మిడ్‌ఫీల్డ్‌లో డిఫెన్స్ ప్లేయర్‌గా ఆమె ఆడేవారు. జట్టులో ఆమె ఉందంటే ప్రత్యర్ధి జట్లకు దడపుట్టేది
2019లో నేపాల్‌లో జరిగిన 5వ SAFF ఛాంపియన్ షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో రతన్‌బాల కూడా సభ్యురాలు.
అదే సంవత్సరం 13వ ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెల్చుకున్న జట్టులో కూడా ఆమె ఉన్నారు.
స్పెయిన్‌లో జరిగిన కోటిఫ్ విమెన్స్ టోర్నమెంటులో ఇండియా జట్టుకు రతన్ బాల రెండు గోల్స్ సాధించి పెట్టారు.
దేశీయంగా కూడా ఆమె అనేక టోర్నమెంట్లలో తన ప్రతిభ చూపి అందరి మన్ననలు పొందారు. 2019లో జరిగిన హీరో ఇండియన్ విమెన్స్ లీగ్‌లో బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ బహుమతిని గెలుచుకున్నారు.
2020లో జరిగిన అదే టోర్నమెంటులో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు సాధించారు. ఈ సీజన్‌లో ఆమె తన జట్టును రెండో స్థానం వరకు తీసుకెళ్లగలిగారు.
గుర్తింపు వచ్చిందిలా..
2020లో రతన్‌బాల ఏఐఎఫ్‌ఎఫ్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కు రతన్‌బాల దేవి ఊపిరి అంటూ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
నిరంతరం కష్టపడతానని, ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నం చేస్తుంటానని రతన్‌బాలా దేవీ బీబీసీతో అన్నారు. ఏదో ఒక రోజు తాను ప్రిమియర్ లీగ్‌కు ఆడతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
(ఈ కథనంలోని అంశాలు రతన్ బాలాదేవితో బీబీసీ ఈ-మెయిల్ ఇంటర్వ్యూ ఆధారంగా రాసినవి)
ఇవి కూడా చదవండి:
- సుమిత్రా నాయక్: రగ్బీ మైదానం లోపలా బయటా సవాళ్లతో సావాసం
- సొనాలీ విష్ణు: ‘ఒకప్పుడు వేసుకునేందుకు షూస్ లేవు... ఇప్పుడు భారత్‌కు ఆడుతున్నా’
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- జాక్ మా: కనిపించకుండా పోయిన చైనా బిలియనీర్ 3 నెలల తరువాత ప్రత్యక్షం
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- జో బైడెన్ నుంచి తెలుగువారు ఏం కోరుకుంటున్నారు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








