అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు

అర్నబ్ గోస్వామి, ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి, బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తాకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు లీక్ అయిన వివాదం ఇప్పుడు పాకిస్తాన్‌ వరకు చేరింది.

సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై అనేక వాదోపవాదాలు సాగుతున్నాయి.

అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్‌ అంటూ బయటకొచ్చిన ఈ సంభాషణల్లో పుల్వామా దాడి, బాలాకోట్‌ దాడుల ప్రస్తావన ఉంది.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, WAKIL KOHSAR/GETTYIMAGES

ఈ చాట్‌ల స్క్రీన్‌షాట్లు వైరల్ అయిన తరువాత పుల్వామా దాడి, బాల్‌కోట్ వైమానిక దాడి గురించి అర్నబ్‌కు ముందే ఎలా తెలుసు అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో అర్నబ్ మద్దతుదారులు, ప్రత్యర్థులు కూడా తమ తమ వాదనలను ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ అంశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

అర్నబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఈ అంశంపై పలు ట్వీట్లు చేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది.

ఈ అంశంలో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ మోడీ ప్రభుతాన్ని దుయ్యబట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మోదీ ప్రభుత్వం బాలాకోట్ సమస్యను ఎన్నికల లాభాల కోసం ఎలా ఉపయోగించుకుందో 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్‌జీఏ) నేను వివరించి చెప్పాను.

ఇటీవల లీక్ అయిన ఒక ఇండియన్ జర్నలిస్ట్ సంభాషణలు..మోదీ ప్రభుత్వానికి, భారతదేశ మీడియాకు మధ్య ఉన్న విధేయ సంబంధాన్ని బయటపెడుతున్నాయి" అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

తరువాతి ట్వీట్‌లో.. "ఇదే, ఎన్నికలు గెలవడంకోసం ప్రమాదకరమైన సైనికదాడికి దారి తీసింది. దాడి జరిపిన ప్రాంతంలో ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయాన్ని కూడా విస్మరించింది. బాలాకోట్ విషయంలో పాకిస్తాన్ బాధ్యతాయుతంగా ప్రతిస్పందించడం ద్వారా పెద్ద సంక్షోబాన్ని నివారించగలిగింది” అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ తన మరో ట్వీట్‌లో "భారతదేశం, పాకిస్తాన్‌లో ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం, 15 ఏళ్లుగా ఇండియా మాపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు...అన్నీ బహిర్గతమయ్యాయి. ఇండియా ప్రభుత్వానికి, మీడియాకు ఉన్న విధేయ సంబంధాన్ని ఆ దేశ సొంత మీడియానే ఇప్పుడు బయటపెట్టింది. దీనివల్ల అణుసంపత్తి కలిగిన ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అది ఈ ప్రాంతానికి ఎంత మాత్రం మంచిది కాదు" అన్నారు.

తన ఆఖరు ట్వీట్‌లో.."పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న కుట్రలను, మోదీ ప్రభుత్వ ఫాసిజాన్ని మా ప్రభుత్వం బయటపెడుతూనే ఉంటుందని నేను మరోసారి నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అంతర్జాతీయ సమాజం..భారత్ నిర్లక్ష్య సైనికవాద అజెండాను నిలువరించాల్సిన అవసరం ఉంది. లేదంటే మోదీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కోలుకోలేని వివాదంలోకి నెట్టేస్తుంది" అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్‌లు వైరన్ అయిన తరువాత.."2019లో జరిగిన పుల్వామా దాడి ఒక 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్" అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వం ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లను నిర్వహించడమే కాకుండా ఉగ్రవాద సంబంధ ఆరోపణలతో పాకిస్తాన్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందని, ఎన్నికలు గెలవడం కోసం తీవ్ర జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుందనే మా అభిప్రాయాన్ని ఇటీవల బయటపడిన సంభాషణలు నిరూపిస్తున్నాయి" అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

అర్నబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ ఏం చెప్పింది?

"ముంబయి పోలీసులు చార్జ్‌షీట్‌లో బయటపెట్టిన వాట్సాప్ సంభాషణలు జాతీయ భద్రతతో చెలగాటం ఆడుతున్నట్లు ఉన్నాయి.

ఆర్థిక మోసాలు, అందులో భాగం పంచుకున్నవారి వివరాలు, మంత్రిమండలిలో ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే నిర్ణయాలు...ఇవన్నీ ఇందులో ఉన్నాయి.

ముంబయి చార్జ్‌షీట్ వెయ్యి పేజీలు ఉంది. దీన్ని మేము కూలంకుషంగా పరిశీలిస్తున్నాం.

దీని మీద వివరంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేస్తాం" అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆదివారం తెలిపారు.

అర్నబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

రిపబ్లిక్ టీవీ స్పందన

అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్‌లు లీకు అయిన తరువాత రిప్లబ్లిక్ టీవీ ఏ రకంగానూ స్పందించలేదు. కానీ పాకిస్తాన్ వ్యాఖ్యల తరువాత ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది.

పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ..."రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి గత 15 ఏళ్లుగా పాకిస్తాన్, ఐఎస్ఐ ఉగ్రవాద కార్యకలాపాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారు.

పుల్వామా దాడి తరువాత పాకిస్తాన్ బండారాన్ని మొట్టమొదట బయటపెట్టింది అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ మీడియా. తమ స్టింగ్ ఆపరేషన్లు, పరిశోధనల ద్వారా ఉగ్రవాద మూకలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని, వారి కార్యకలాపాలు స్పాన్సర్ చేస్తుందని రిపబ్లిక్ మీడియా బయటపెట్టింది” అని ఆ ప్రకటనలో రాశారు.

అదే ప్రకటనలో కాంగ్రెస్ పార్టీని కూడా రిపబ్లిక్ టీవీ విమర్శించింది…”తెలిసో తెలియకో పాకిస్తాన్ ప్రభుత్వం తరపున పని చేయడం మానేయాలని, భారత ప్రయోజనాలను దెబ్బ తీసే అబద్ధపు ప్రచారాలు ఆపివేయాలని” అన్నది.

ఈ ప్రకటన చివర్లో సత్యమేవ జయతే, భారత్ మాతా కీ జై, జై హింద్ అనే నినాదాలు రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)