కోవిన్ (Co-Win) యాప్: దీన్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? వ్యాక్సీన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీనేషన్ కార్యక్రమం ఈ రోజు(జనవరి 16న) భారీ స్థాయిలో మొదలవుతోంది.
30 కోట్లకుపైగా మందికి ఈ కార్యక్రమం ద్వారా వ్యాక్సీన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి దశలో దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు వ్యాక్సీన్ ఇవ్వనున్నారు.
50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మందికి రెండో దశలో వ్యాక్సీన్ ఇస్తారు.
కోవిన్ యాప్ ఏంటి?
కోవిడ్-19 వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు తోడ్పడాలన్న ప్రాథమిక ఉద్దేశంతో కోవిన్ యాప్ తీసుకువచ్చామని, దీని ద్వారా వ్యాక్సీన్ తీసుకునేందుకు జనాలు దరఖాస్తు కూడా చేసుకోవచ్చని భారత ప్రభుత్వం అంటోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కోవిడ్-19 వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు కోవిన్ డిజిటల్ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ పాత్రికేయులతో సమావేశంలో అన్నారు.
ఈ యాప్‌లో వ్యాక్సీనేషన్‌కు సంబంధించిన డేటా, గణాంకాలు నమోదవుతాయని... వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందికి సంబంధించి డేటాబేస్ కూడా రూపొందిస్తామని ఆయన చెప్పారు.
ఈ యాప్ పేరు విషయంలో కాస్త అయోమయం నెలకొంది.
అధికారిక వెబ్‌సైట్‌లో కోవిన్ (Co-Win) పూర్తి పేరును కోవిడ్-19పై విజయం అని అర్థం వచ్చేలా Co-Win: Winning Over COVID-19 అని పెట్టారు.
మరోవైపు భారతీయ మీడియా మాత్రం దీన్ని కోవిడ్ వ్యాక్సీన్ ఇంటెలిజన్స్ నెట్‌వర్క్ అని పిలిచింది.

ఫొటో సోర్స్, ANI
ఎప్పుడు, ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
ప్రస్తుతానికి మాత్రం కోవిన్ యాప్ ప్లేస్టోర్‌లో గానీ, యాప్‌స్టోర్‌లో గానీ అందుబాటులో లేదు.
అయితే, ఇదే పేరుతో కొన్ని నకిలీ యాప్‌లు ఆ వేదికల్లో కనిపిస్తున్నాయి.
ఈ విషయమై ఇటీవల భారత ఆరోగ్య శాఖ ప్రజలను హెచ్చరించింది.
నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్‌లోడ్ గానీ, షేర్ గానీ చేయొద్దని సూచించింది.
కోవిన్ యాప్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేదీ సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని వివరించింది.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, ఈ యాప్‌ను ప్లేస్టోర్, యాప్ స్టోర్‌ల్లో అందుబాటులోకి తేనుంది.
ప్రజలందరికీ ఎస్ఎంఎస్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పంపే అవకాశాలున్నట్లు కూడా భావిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎలా పనిచేస్తుంది?
కోవిడ్-19 వ్యాక్సీనేషన్ కార్యక్రమానికి సంబంధించి ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ కోసం అభివృద్ధి చేస్తున్న క్లౌడ్ ఆధారిత వేదిక కోవిన్.
ఎప్పటికప్పుడు వ్యాక్సీన్లను తీసుకునేవారిని ట్రాక్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
దీనిలో చాలా మాడ్యూళ్లు ఉండబోతున్నాయి. ఈ యాప్‌ను ఉపయోగించి, అధికారులు అవసరానికి తగ్గట్లుగా డేటా అప్‌లోడ్ చేస్తారు.
వ్యాక్సీన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారున్న ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తారు. వ్యాక్సీనేషన్ ఎప్పుడు నిర్వహించేది సమాచారం కూడా ఇస్తారు.
ఇక వ్యాక్సీన్ తీసుకున్నవారికి, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. వారికి క్యూఆర్ కోడ్‌తో ఉన్న సర్టిఫికేట్లు కూడా ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
వ్యాక్సీనేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఇది.
అయితే, ఇది ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. అందుకే సాధారణ ప్రజలు ప్రస్తుతానికి ఇందులో రిజిస్టర్ అవ్వడం కుదరదు.
సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు మాత్రమే ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది.
యాప్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక రిజిస్ట్రేషన్‌కు మూడు పద్ధతుల్లో అవకాశం కల్పిస్తారు.
మొదటిది సెల్ఫ్ (స్వీయ) రిజిస్ట్రేషన్. రెండోది వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్.
మూడోది బల్క్ (చాలా మందికి కలిపి) రిజిస్ట్రేషన్.
అయితే, వీటిని ఎలా చేసుకోవచ్చన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఏ పత్రాలు కావాలి?
రిజిస్ట్రేషన్ కోసం ఫొటోతో ఉన్న గుర్తింపు కార్డు అవసరం.
సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం ఈ-కేవైసీ ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. ఇందుకు ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లాంటి 12 రకాల గుర్తింపు కార్డులు, పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఓటీపీ, బయోమెట్రిక్, పుట్టినతేదీ లాంటి వాటి ఆధారంగా గుర్తింపును ధ్రువీకరిస్తారు.

ఫొటో సోర్స్, Anil Vij
తర్వాత ఏం జరుగుతుంది?
రిజిస్టర్ చేసుకున్నవారి మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారం అందుతుంది.
దీనితోపాటు వ్యాక్సీన్ ఇచ్చే ప్రదేశం, తేదీ, సమయం లాంటి సమాచారం కూడా ఇస్తారు.
యాప్‌లో ఏయే మాడ్యుళ్లు ఉంటాయి?
కోవిన్ యాప్‌లో ఐదు మాడ్యూళ్లు ఉంటాయి. అవి... అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, వ్యాక్సీనేషన్ మాడ్యూల్, బెనిఫిషీయరీ అక్నాలెడ్జ్‌మెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్.
అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ వ్యాక్సీనేషన్ కార్యక్రమాల నిర్వహణలో భాగమయ్యేవారి కోసం.
రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ద్వారా రిజిస్టర్ అయినవారి సమాచారం అడ్మినిస్ట్రేటర్‌లకు అందుతుంది. ఆ తర్వాత శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాక్సీనేషన్ చేస్తారు. వ్యాక్సీనేషన్ చేయించుకున్నవారికి అవసరమైన సమాచారం, అలెర్ట్స్ కూడా అందుతాయి.
వ్యాక్సీనేషన్ మాడ్యూల్‌లో లబ్ధిదారుల వివరాలను తనిఖీ చేసి, వారి వ్యాక్సీనేషన్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేస్తారు.
బెనిఫిషీయరీ మాడ్యూల్‌లో ఆ సమాచారం, క్యూఆర్ కోడ్ సర్టిఫికేట్లు అందుతాయి.
రిపోర్ట్ మాడ్యూల్‌లో ఎంత మంది వ్యాక్సీనేషన్ శిబిరాల్లో పాల్గొన్నారు? ఎంత మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉంది? లాంటి సమాచారం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
గోప్యతకు ప్రమాదమా?
ఇప్పటికి ఇంకా యాప్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానప్పటికీ, దీని వల్ల ప్రజలకు గోప్యతకు ప్రమాదం ఉండొచ్చంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజల సమాచారం బయటకు పొక్కదని, గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
ఇదివరకు ఆరోగ్య సేతు యాప్ విషయమై కూడా నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ యాప్ ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న సమాచారంలో సున్నితమైన ఆరోగ్య సమాచారం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం గోప్యత విషయంలో భారత్‌లో సరైన చట్టాలు లేకపోవడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- రాయల్ ఎన్ఫీల్డ్ బాటలో భారత్‌లోకి ‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ బైక్‌లు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








