ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ

ఫొటో సోర్స్, PATRICK HAMILTON/gettyimages
- రచయిత, మానసి కపూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత రాత్రి నిద్రపోయే సమయంలో భారత జట్టు వరుణ దేవుడిని ప్రార్థించి ఉంటుంది. గబ్బా పిచ్ మీద ఆస్ట్రేలియా అయిదో రోజు భారత్‌కు 328 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చింది.
ఈ టెస్ట్‌కు ముందు బోర్డర్-గావస్కర్ సిరీస్ 1-1తో సమానంగా ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయితే భారత్ ట్రోఫీని నిలబెట్టుకోవచ్చు.
కానీ, ఈ ట్రోఫీని తిరిగి దక్కించుకుని, పరువు కాపాడుకోవాలంటే ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ గెలవడం అవసరం.
భారత్ ఈ మ్యాచ్ గెలవడం అనేది అసలు అంచనాల్లోనే లేదు. కానీ ఈ భారత జట్టు ప్రణాళికలు మాత్రం వేరేలా ఉన్నాయి.
అది బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు. బ్రిస్బేన్‌లోని ఆస్ట్రేలియా కోటగా పేరు పడిన గబ్బా మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.
1988 నుంచి ఆతిథ్య జట్టు ఇక్కడ ఓటమి అనేది చూడలేదు. గబ్బా పిచ్ ఫాస్ట్‌బౌలర్లకు స్వర్గధామం. ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలర్లతో ఆడుతోంది.

ఫొటో సోర్స్, PATRICK HAMILTON/gettyimages
జట్టంతా గాయాలు.. టెస్టులకు కొత్త ముఖాలు
మరోవైపు భారత బౌలింగ్ విభాగం ఆసుపత్రి వార్డును తలపిస్తోంది. భారత జట్టులోని ఐదుగురు ఉత్తమ పేస్ బౌలర్లు, బ్యాట్‌తో కూడా రాణించగల ఇద్దరు కీలక స్పిన్నర్లు గాయపడ్డారు.
జట్టులో 8వ స్థానం నుంచి 11వ స్థానం వరకు బౌలర్లే కనిపిస్తున్నారు. 12వ ఆటగాడూ బౌలరే.
అంటే మిగతా బౌలర్లంతా ఆడ్డానికి ఫిట్‌గా ఉన్నారు.
ముఖ్యంగా కెరీర్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ ఉన్న బౌలర్లలో సీనియర్. నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ తమ రెండో టెస్ట్ ఆడుతున్నారు.
ఇక వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్‌లకు ఇది మొదటి టెస్ట్ మ్యాచ్.
వీళ్లిద్దరూ నిజానికి టెస్ట్ స్క్వాడ్‌లో భాగం కూడా కాదు. టీ20, వన్డే సిరీస్ తర్వాత నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి వాళ్లను జట్టుతోపాటూ ఉండమన్నారు.
దీన్నే సందర్భోచితంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లోని ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్‌లో పడగొట్టిన మొత్తం వికెట్ల సంఖ్య 1033 అయితే. భారత బౌలింగ్ విభాగం పడగొట్టిన మొత్తం వికెట్లు 13 మాత్రమే.

ఫొటో సోర్స్, Bradley Kanaris/gettyimages
ఈ మ్యాచ్ తొలి రోజు క్రీజులోకి వచ్చిన కొన్ని గంటలకే నవదీప్ సైనీ గాయపడ్డాడు. మొదటి రెండు రోజులు చెత్త షాట్లు ఆడిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు కూడా కాస్త సాయం చేయడంతో ఈ బౌలర్ల బృందం ఆ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకే కట్టడి చేయగలిగింది.
తర్వాత ప్రపంచంలోనే లీడింగ టెస్ట్ బౌలర్ అయిన పాట్ కమిన్స్ నేతృత్వంలో జాష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లైన్‌లతో ఆస్ట్రేలియా బౌలింగ్ దాడి మొదలైంది.
గబ్బా పిచ్ మీద బంతి ఫుల్ బౌన్సయి వేగంగా దూసుకెళ్తుంది. అంటే గాల్లో గంటకు 90 మైళ్ల వేగంతో దూసుకొచ్చే బంతులు మన భుజాలను, చేతులను, పక్కటెముకలను తాకవచ్చు. హెల్మెట్లు, బ్యాట్లతోపాటూ కొన్ని ఎముకలు కూడా విరగొచ్చు.

ఫొటో సోర్స్, Bradley Kanaris/gettyimages
పెవిలియన్ బాటపట్టిన బ్యాట్స్‌మెన్లు
భారత్ అనుకున్నట్లే ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొందరగానే చెత్త షాట్లు ఆడుతూ బ్యాటింగ్ లైనప్‌లోని ప్రధాన ఆటగాళ్లు రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరారు.
అప్పటికి ఆస్ట్రేలియా దాదాపు 200 పరుగుల ఆధిక్యంతో ఉంది.

ఫొటో సోర్స్, Bradley Kanaris/gettyimages
వాషింగ్టన్ సుందర్‌కు గంట ముందు తెలిసింది
ఆరు వికెట్లకు 186 పరుగులు చేసిన జట్టు ఓటమి దిశగా వెళ్తున్న దిశలో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు.
సుందర్ తమిళనాడుకు చెందిన ఆఫ్‌స్పిన్నర్. తను టీ20ల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు ఆడబోతున్నట్లు ఆయనకు తెలిసింది.
గత కొన్నివారాలుగా ఆయన నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లకు లియాన్‌ను అనుకరిస్తూ బంతులేస్తున్నాడు.
నిజానికి అతడు ఇంతకు మూడేళ్ల క్రితం ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. చెన్నైలో ఉన్న అతడి కుటుంబం తమ అబ్బాయి 21 ఏళ్ల వయసులో ఆడే మొదటి టెస్ట్ మ్యాచ్ చూడాలని ఉదయం 3.15కు అలారం పెట్టుకుంది.
వాళ్లు మనసులో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు. మిగతా దేశమంతా ఒకటి జరగాలని ప్రార్థిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ముంబయి పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ రిషబ్ పంత్ అవుట్ కాగానే అప్పుడే క్రీజులోకి వచ్చాడు.
కాస్తో కూస్తో ఆడగలిగిన చివరి బ్యాట్స్‌మెన్ అతడే. ఠాకూర్ ఈ మ్యాచ్ ముందు ఒక టెస్ట్ ఆడాడు. అక్కడ తను గాయపడ్డానికి ముందు 10 బంతులు వేశాడు. 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత్‌లో టిఫిన్ టైమయ్యింది. జనం జరగబోయేది ఊహించి తమ పనులకు కదిలారు. ఠాకూర్ సిక్స్‌తో తన ఖాతా తెరిచాడు.
చిన్నచిన్నగా ఒకటి, రెండు పరుగులు చేస్తున్నారు. కోట్ల మంది ఊపిరి బిగబట్టారు. అతడు సుందర్‌తో కలిసి భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇద్దరూ కొన్ని అద్భుతమైన, తెగించిన షాట్లు కొట్టారు.
ప్రధానంగా తమ బౌలింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ వెళ్లారు. ముఖ్యంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడిని ఆడుకున్నారు. బాడీని లక్ష్యంగా చేసుకుని వేసిన బంతులను బౌండరీలుగా సిక్సులుగా మలిచారు.
స్టార్క్ వేసిన ఒక బంతి గంటకు 90 మైళ్ల వేగంతో సుందర్‌ను తాకింది. అయినా కూడా ఆయన బెదరలేదు.
ఠాకూర్, సుందర్ ఇద్దరూ ఈ టెస్ట్ ఆడుతామని, వెళ్లి మొదటి టెస్టుల్లోనే హాఫ్ సెంచరీలు చేస్తామని అసలు కల్లో కూడా ఊహించి ఉండరు. చివరికి వాళ్లు బయటికి వచ్చినా, అప్పటికే 123 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గట్టున పడేశారు. భారత మొదటి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచారు.ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ పరుగులన్నీ చెత్త బంతులు, గుడ్డిగా ఊపడం వల్ల వచ్చినవ కాదు.
అవి గబ్బా పిచ్‌లో అత్యంత ఒత్తిడిలో బీకరమైన బౌలింగ్ దాడిని ఎదుర్కుంటూ చేసినవి.
వాళ్లను మాత్రం అవేవీ కదిలించినట్లు అనిపించదు. సుందర్, ఠాకూర్ దగ్గర అద్భుతమైన టెక్నిక్ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
కానీ అది వారి ప్రదర్శనను నడిపించలేదు. అది లక్ కూడా కాదు.ఇదే టీమ్ మొదట ఎంపిక చేసిన ఆటగాళ్లు సలక్షణంగా ఉన్నప్పుడు.. ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్ మొదటి టెస్టులో 36 పరుగులకే మొత్తం వికెట్లు పోగొట్టుకుంది. ఇంతకు ముందు భారత్ అత్యల్ప స్కోర్ 42. భారత్ ఆ మ్యాచ్ కూడా ఓడిపోయింది.తర్వాత వాళ్లకు జట్టు బెస్ట్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమయయాడు. అతడి స్థానంలో కెప్టెన్ అయిన అజింక్య రహానే సెంచరీతో భారత్ రెండో టెస్ట్ గెలిచింది.ఠాకూర్, సుందర్ ఇంత నైపుణ్యం చూపారంటే, మూడో టెస్ట్ చివరి రోజు ఆట కూడా వారిని ప్రభావితం చేసుండాలి.
జనవరి 11న హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ గాయపడినా మూడు గంటలకు పైగా పోరాడారు.
దానిని క్రికెట్ ప్రపంచం ఇటీవల కాలంలో డ్రా అయిన మ్యాచ్‌లలో అత్యుత్తమ మ్యాచ్‌గా అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Chris Hyde - CA/gettyimages
తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూడ్డానికి తండ్రి లేరు
గబ్బాలో నాలుగో రోజు జుట్టుకు టాప్ నాట్ వేసుకున్న మహమ్మద్ సిరాజ్ తన తండ్రి కలలు నెరవేర్చడానికి బరిలోకి దిగాడు.
సిరాజ్ భారత జట్టు కోసం టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే చూడాలన్నది ఆయన తండ్రి కోరిక.
కొన్ని గంటల తర్వాత అతను చేత్తో బంతితో, కళ్లనిండా నీళ్లతో మైదానంలో భారత బౌలర్లను లీడ్ చేస్తుంటాడు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 294 పరుగులకు ముగిసింది.
ఆటో డ్రైవర్ అయిన సిరాజ్ తన మూడో టెస్టులోనే ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.
ఆ కన్నీళ్లు గత నవంబర్‌లో సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు చనిపోయిన తన తండ్రి కోసం.
కొన్నిరోజుల క్రితం సిరాజ్ సిడ్నీలో ప్రేక్షకుల నుంచి వచ్చిన జాత్యహంకార వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి మ్యాచ్ ఆపేశాడు.
తను ఏంటి అనేదానికి ఆ కన్నీరు ఒక సందేశం.
ఐదో రోజు - డ్రాకు, ఓటమికి మధ్య వర్షం మాత్రమే ఉంది. ఫస్ట్ సెషన్‌లో పిచ్ ట్రిక్స్ చేయడం మొదలైంది.
ఆస్ట్రేలియా బౌలర్లు రోహిత్ శర్మను త్వరగానే పెవిలియన్ చేర్చారు. దేవుడా వర్ష రావాలి అనే ప్రార్థనలు మరింత పెరిగాయి.21 ఏళ్ల శుభమ్ గిల్ మనసులో వేరే ఆలోచనలున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంపైనే అతడు నమ్మకం పెట్టలేదు. తను దేశం నమ్మేలా చేయాలనుకున్నాడు.
శరీరంపైకి దూసుకొస్తున్న బంతులను గ్యాప్‌లు వెతికి బౌండరీకి పంపడంపై దృష్టిపెట్టాడు.
91 దగ్గర అవుట్ అయినప్పుడు.. భారత్ ఇంకా వరుణదేవుడిని ప్రార్థిస్తూనే ఉంది. ఈసారీ మాత్రం వాళ్లు వర్షం ఆగితే బావుణ్ణు అనుకున్నారు. ఎందుకంటే డ్రా అనేది రెండో ఆప్షన్.
అక్కడ భారత జట్టుతో విజయం దోబూచులాడుతోంది.
కెప్టెన్ అజింక్య రహానే వికెట్ పడిన తరువాత రిషబ్ పంత్ వచ్చాడు. మయాంక్ అగర్వాల్ కంటే ముందు వచ్చాడు. అసాధ్యమైన దానిని భారత్ వెంటాడబోతోంది అనే సందేశం దేశానికి అందింది. ఎనిమిది ఓవర్ల లోపే ఆస్ట్రేలియన్ల మనసుల్లో అనుమానం నిజమైంది.
ఒక సిక్స్, ఒక ఫోర్, మరో ఫోర్.. అంతా మారిపోయింది
ఒక సిక్స్, ఒక ఫోర్, మరో ఫోర్.. హఠాత్తుగా ఆరు ఓవర్లలో విజయానికి 24 పరుగులు కావాలి.
పంత్, లాస్ట్ ఇన్నింగ్స్ హీరో సుందర్ క్రీజులో ఉన్నారు. 32 ఏళ్లుగా తెరుచుకోని కోట తలుపులను బలంగా గుద్దుతున్నారు. సుందర్ అవుటైనా, ఠాకూర్ వెళ్లిపోయాడు. కానీ ఆశలు పెరుగుతూనే ఉన్నాయి.
తర్వాత ఒక బౌండరీతో ఆ కోట తలుపు బద్దలైంది. అది సుదీర్ఘ కాలం వరకూ గుర్తుండిపోతుంది.భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది. ఒక జీవితకాలం పాటు మిగిలిపోయే గౌరవాన్ని కూడా గెలిచింది.
ఇవి కూడా చదవండి:
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- Ind vs Aus: బాక్సింగ్ డే టెస్టుకు ఈ పేరు ఎలా వచ్చింది? క్రికెట్‌తో సంబంధంలేని రోజును అలా ఎందుకు పిలుస్తారు?
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?
- విరాట్ కోహ్లీ వీడియోపై విమర్శల వెల్లువ... ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
- ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక తమిళుడిపై తమిళుల ఆగ్రహం ఎందుకు? ఆయన బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








