IND vs AUS: ఆస్ట్రేలియా కంచుకోట బద్దలుకొట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ సొంతం

ఫొటో సోర్స్, Getty Images
బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
ఐదోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడి 328 పరుగుల భారీ టార్గెట్ చేధించింది.
2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది.
మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలవగా, రెండో టెస్ట్‌ను భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో టెస్ట్ డ్రా అయ్యింది. నాలుగో టెస్ట్‌ను భారత జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిషభ్ పంత్ (89 పరుగులు) చివరి వరకూ క్రీజులో నిలిచి, ఫోర్‌తో జట్టుకు విజయం ఖరారు చేశాడు.
అంతకు ముందువాషింగ్టన్ సుందర్ 22 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు.
చటేశ్వర్ పుజారా 56 పరుగులు చేసి ఔటయ్యాడు.
యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ధాటిగా బ్యాటింగ్ చేసి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
కెప్టెన్ అజింక్యా రహానే సైతం వేగంగా పరుగులు చేశాడు. 22 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి ఔటయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో విజయానికి అవసరమైన 328 పరుగులకంటే ఒక పరుగు ఎక్కువే చేసింది.
ఈ పర్యటనలో మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టుపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ పరాభవం నుంచి వెంటనే కోలుకున్న భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్‌ను గెలిచింది.
అయితే, వరుసగా సీనియర్ ప్లేయర్లు గాయాలపాలు కావడం ఆందోళన కలిగించింది.
కానీ, జట్టులోకి వచ్చిన యువ ప్లేయర్లు సత్తా చాటడంతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించిన గంగూలీ
ఆస్ట్రేలియా వెళ్లి, ఆ జట్టుపై ఈ తరహాలో విజయం సాధించడం.. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని బీసీసీఐ ఛైర్మన్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభివర్ణించారు.
భారత జట్టుకు బీసీసీఐ తరపున రూ.5 కోట్ల నజరానా ప్రకటించారు.
ఇది అంకెలకు అందని విలువైన విజయం అని గంగూలీ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాగా, ఘన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
భారత జట్టు గొప్ప సంకల్ప బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘అసంతృప్తికి గురయ్యా.. కానీ, టెస్ట్ క్రికెట్ జీవించే ఉంది..’
భారత జట్టు గెలుపుపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నేను అసంతృప్తికి గురయ్యా. కానీ, టెస్ట్ క్రికెట్ జీవించే ఉంది’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, twitter/BCCI
ఆస్ట్రేలియా కోట గబ్బా మైదానం
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కోట లాంటిది. ఇక్కడ ఆ జట్టు ఆడిన గత 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో 33 గెలిచింది. 13 డ్రా కాగా, ఒక మ్యాచ్ టై అయ్యింది. 8 టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది.
పైగా, 1988 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆ జట్టు ఈ మైదానంలో ఓటమి చవి చూడలేదు.
ఇవి కూడా చదవండి:
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








