‘22 ఏళ్లలో తొలిసారి హీరోతో సమానంగా పారితోషికం తీసుకున్నా’’

వీడియో క్యాప్షన్, ‘22 ఏళ్లలో తొలిసారి హీరోతో సమానంగా పారితోషికం తీసుకున్నా’’
‘22 ఏళ్లలో తొలిసారి హీరోతో సమానంగా పారితోషికం తీసుకున్నా’’

గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్న ప్రియాంకా చోప్రా, 22 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారిగా తన సహనటుడితో సమానంగా వేతనం పొందినట్లు బీబీసీతో చెప్పారు.

త్వరలో విడుదల కానున్న అమెరికా స్పై వెబ్ సిరీస్ ‘సిటాడెల్’‌లో పోషించిన పాత్రకుగానూ తనకు, తన సహనటుడికి సమాన వేతనం ఇచ్చారని ఆమె వెల్లడించారు.

భారత సినీ రంగంలో ఆమె స్టార్ నటి. 60కి పైగా బాలీవుడ్ సినిమాల్లో ప్రియాంక నటించారు. దశాబ్దం కిందట హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

ప్రియాంకా చోప్రా

అమెరికా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తోన్న కొంతమంది భారత నటుల్లో ప్రియాంక కూడా ఒకరు.

బీబీసీ 100 మహిళలు-2022 జాబితాలో ప్రియాంకా చోప్రా కూడా చోటు దక్కించుకున్నారు. యువ నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అప్పటికే అక్కడ పాతుకుపోయిన ‘పితృస్వామ్య’ వ్యవస్థను అతి సాధారణంగా ఎలా పరిగణించారో ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)