‘బియ్యం ఇవ్వండి’: ఖాళీ గిన్నెలు, ప్లేటులు పట్టుకుని చైనా మహిళలు ఈ బాలీవుడ్ పాటను ఎందుకు వైరల్ చేస్తున్నారు?

చైనాలో 'జిమీ... జిమీ... ఆజా' పాట వైరల్ అవుతోంది. ఖాళీ గిన్నెలు, ప్లేటులు పట్టుకుని ప్రజలు ఆ పాటను పాడుతున్నారు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, చైనాలో 'జిమీ... జిమీ... ఆజా' పాట వైరల్ అవుతోంది. ఖాళీ గిన్నెలు, ప్లేటులు పట్టుకుని ప్రజలు ఆ పాటను పాడుతున్నారు

డిస్కో డ్యాన్సర్... 1982లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఇది.

'ఐ యామ్ డిస్కో డ్యాన్సర్' అంటూ మిథున్ చక్రవర్తి వేసిన స్టెప్పులు నాడు చాలా ఫేమస్. బప్పి లహిరి కంపోజ్ చేసిన ఆ సినిమా పాటలు నాడు మంచి హిట్.

బప్పి లహిరి తెలుగులో సింహాసనం(1986), గ్యాంగ్ లీడర్(1991), రౌడీ అల్లుడు(1991) వంటి సినిమాలకు మ్యూజిక్ అందించారు.

డిస్కో డ్యాన్సర్ సినిమాను ఆ తరువాత బాలకృష్ణ హీరోగా 'డిస్కో కింగ్' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.

ఇప్పుడు ఈ సినిమాలోని మరొక సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది. అదీ చైనాలో... 'జిమీ... జిమీ... జిమీ...ఆజా... ఆజా... ఆజా...' అనే పాటను చైనా ప్రజలు ఇప్పుడు హమ్ చేస్తున్నారు.

చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో 'జిమీ... జిమీ...' పాటకు యూజర్లు రీల్స్ చేస్తున్నారు.

1980ల నాటి ఆ పాట ఇప్పుడు చైనాలో ఫేమస్ కావడానికి కారణం అక్కడి కోవిడ్-19 లాక్‌డౌన్ ఆంక్షలు.

'జీరో కోవిడ్ పాలసీ'తో ఇంకా చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తోంది. దీనిపై తమన నిరసనను చైనా ప్రజలు 'జిమీ... జిమీ... ఆజా' పాట రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

చైనాలో టిక్‌టాక్‌ను డుయిన్ అని పిలుస్తారు. ఇందులో 'జిమీ... జిమీ... జిమీ...ఆజా... ఆజా... ఆజా...' పాట వైరల్ అవుతోంది. ఖాళీ గిన్నెలు, ప్లేటులు పట్టుకుని ప్రజలు ఆ పాటను పాడుతున్నారు. మాండరీన్ భాషలో 'జే మీ జే మీ' అంటే బియ్యం ఇవ్వమని అర్థం.

కరోనా లాక్‌డౌన్ వల్ల తమ వద్ద తినడానికి తిండి లేదని, బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని సింబాలిక్‌గా వారు చెబుతున్నట్లుగా అర్థమవుతోంది.

ఇంకా చైనా అధికారుల దృష్టిలో ఈ వీడియోలు పడినట్లుగా కనిపించడం లేదు. అక్కడ ఇంటర్నెట్‌ను ప్రభుత్వం గమనిస్తూ సెన్సార్ చేస్తూ ఉంటుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కఠిన కరోనా ఆంక్షలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీసుకొచ్చిన 'జీరో కోవిడ్' విధానంలో భాగంగా కరోనావైరస్ నియంత్రణ కోసం కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలితే వారిని క్వారంటైన్ కేంద్రాలు పంపిస్తున్నారు.

కొన్ని వారాలుగా షాంఘై నగరం లాక్‌డౌన్‌లో ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనవ్యక్తం చేయగా అధికారులు వాటిని అణచివేశారు. కరోనా వచ్చిన వారికి ప్రభుత్వం సరిగ్గా చికిత్స అందించడం లేదంటూ జెంగ్జూలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో కార్మికులు పని చేయడం ఆపేశారు.

చైనాలో కొనసాగుతున్న లాక్‌డౌన్ చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. తిండికి కొరత ఉంది, వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు, ఆర్థికవ్యవస్థ పడిపోతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

చైనాలో 'జిమీ... జిమీ... ఆజా' పాట వైరల్ అవుతోంది. ఖాళీ గిన్నెలు, ప్లేటులు పట్టుకుని ప్రజలు ఆ పాటను పాడుతున్నారు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

చైనాలో భారత సినిమాలు

చైనాలో భారత సినిమాలకు మంచి ఆదరణ ఉంది. బాలీవుడ్ నటుడు రాజ్‌ కపూర్ అక్కడ చాలా ఫేమస్. 1950, 60లలో ఆయన సినిమాలను చైనా ప్రజలు బాగా చూసేవారు.

ఆమిర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్, సీక్రెట్ సూపర్‌స్టార్, దంగల్ వంటి సినిమాలు అక్కడ హిట్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాకు చైనాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'హిందీ మీడియం', ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అంధాధున్' సినిమాలు కూడా చైనా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.

నటుడు చిరంజీవితో సంగీత దర్శకుడు బప్పి లహిరి

ఫొటో సోర్స్, Twitter/Chiranjeevi Konidela

ఫొటో క్యాప్షన్, చిరంజీవితో సంగీత దర్శకుడు బప్పి లహిరి

బప్పి లహిరికి ఫేమ్

బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో బప్పి లహిరి ఒకరు.

ఆయన సంగీతం అందించిన 'డిస్కో డ్యాన్సర్(1982)' సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన శకం దానితోనే ప్రారంభమైంది.

'ఐ యామ్ డిస్కో డ్యాన్సర్', 'జిమీ... జిమీ', 'కోయి యహా నాచే నాచే', 'యాద్ ఆ రహా హై తేరా ప్యార్' వంటి పాటలు నాడు సూపర్ హిట్.

'డిస్కో డ్యాన్సర్' సినిమా పాటలు చైనా, రష్యాలలోను మంచి ఆదరణ పొందాయి.

ఒకనాడు రాజ్ కపూర్ పాట 'ఆవారా హూ' మాత్రమే రష్యాలో బాగా వినిపించేది. కానీ 'డిస్కో డ్యాన్సర్' విడుదల అయిన తరువాత 'జిమీ... జిమీ... ఆజా' పాట దాన్ని బీట్ చేసింది.

'నేటికీ రష్యాలో జిమీ... జిమీ పాట చాలా ఫేమస్. ఆ పాటతో మిథున్ చక్రవర్తి కూడా ఇక్కడ బాగా పాపులర్ అయ్యారు. భారతీయులను చూసినప్పుడు రష్యన్లు నవ్వుతూ జిమీ... జిమీ... పాటను పాడుతుంటారు. అంటే మాకు భారతదేశ సినిమాలు తెలుసు అని చెప్పాలనేది వారి ఉద్దేశం' అని మాస్కోలో ఉంటున్న ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు.

బప్పి లహిరి తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించారు.

1986లో కృష్ణ నటించిన 'సింహాసనం' సినిమాతో ఆయన తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ సినిమాలోని 'ఆకాశంలో ఒక తార', 'వహ్ వా యవ్వనం' వంటి పాటలు సూపర్ హిట్.

తేనె మనసులు(1987), శంఖారావం(1987), ఇంధ్రభవనం(1991) వంటి కృష్ణ సినిమాలకు బప్పి లహిరి సంగీతం అందించారు.

చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ(1989), గ్యాంగ్ లీడర్(1991), రౌడీ అల్లుడు(1991), బిగ్‌బాస్(1993) సినిమాలకు కూడా ఆయన పని చేశారు.

బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్‌స్పెక్టర్(1992), నిప్పురవ్వ(1992) వంటి సినిమాలకు కూడా బప్పి లహిరి సంగీత దర్శకత్వం వహించారు.

వీడియో క్యాప్షన్, డ్రై షాంపూలను యూనిలీవర్ ఎందుకు రికాల్ చేసింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)