Prabhas: ఆదిపురుష్ రామాయణాన్ని వక్రీకరిస్తోందా? బాలీవుడ్ ‘రావణ బ్రహ్మను రావణ్ ఖిల్జీ’గా మార్చేసిందా? - సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఫొటో సోర్స్, T SERIES/SCREEN GRAB
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటుడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్‌ను అక్టోబరు 02న విడుదలయ్యింది. ఈ టీజర్‌ను అయోధ్యలో విడుదల చేశారు. కానీ, టీజర్ విడుదల కాగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ టీజర్‌లో కనిపిస్తున్న రావణాసురుడు, హనుమంతుని పాత్రల చిత్రీకరణను ఎత్తిచూపుతూ.. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెరుగుతున్నాయి.
ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
రావణాసురుడి పాత్ర చిత్రీకరణపై వెల్లువెత్తుతున్న విమర్శలు హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుని పాత్రలో కృత్రిమంగా కనిపిస్తున్నారని అంటూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు.
తలపై నిక్కబొడుచుకున్న జుట్టు, పొడవైన గెడ్డం, కాటుక కళ్ళతో సైఫ్ రావణాసురుడి కంటే కూడా అలావుద్దీన్ ఖిల్జీలా కనిపిస్తున్నారని పలువురు విమర్శించారు.
బీజేపీ ప్రతినిధి మాళవిక అవినాష్ కూడా ఈ సినిమా టీజర్ రామాయాణాన్ని వక్రీకరించి చూపిస్తోందని విమర్శించారు. ఈ టీజర్‌లో రావణుడి రూపాన్ని, వ్యక్తిత్వాన్ని చిత్రీకరించిన విధానాన్ని కూడా ఆమె తప్పు పట్టారు.

ఫొటో సోర్స్, ADIPURUSH TRAILER SCREEN GRAB/T SERIES
"ఈ సినిమా దర్శకుడు వాల్మీకి, కంబ, తులసీదాస్ రామాయణం అధ్యయనం చేయలేకపోతే కనీసం గతంలో రామాయాణానికి సంబంధించి చిత్రీకరించిన తెలుగు, కన్నడ, తమిళ సినిమాలనైనా చూసి ఉండాల్సింది" అని మాళవిక ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ఈ సినిమాల్లో రావణాసురుని చిత్రీకరించిన శైలిని చూసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
"రావణుడి పాత్ర చిత్రీకరణ కోసం భూకైలాస్‌లో ఎన్‌టీ రామారావు పాత్రను, సంపూర్ణ రామాయణంలో ఎస్‌వీ రంగారావు పాత్రలను చూసి ఉండాల్సింది" అని వ్యాఖ్యానించారు.
"ఈ ఫోటోలో నేను చూసిన రావణుడు భారతీయునిలా కనిపించడం లేదు. ఆయన కళ్ళకు నీలం రంగు మేక్‌అప్ వేసి, తోలు జ్యాకెట్‌లను ధరింపచేశారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఇలా చేయకూడదు" అని అన్నారు.
‘‘రామాయణం ఈ దేశానికి, నాగరికతకు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని ఎవరూ తమకిష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఈ విధమైన చిత్రీకరణతో నాకు చాలా విచారంగా ఉంది" అని ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు 64 కళల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తి. వైకుంఠాన్ని కాపలా కాసిన జయుడు శాపం పొంది భూలోకంలో రావణునిగా పుట్టారు. ఈ సినిమాలో రావణుడి చిత్రీకరణ తుర్కియే నియంతను తలపిస్తోంది కానీ, రావణుడిని కాదు. బాలీవుడ్! రామాయణాన్ని, చరిత్రను వక్రీకరించడం ఆపండి. ఎన్‌టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా?" అని ట్వీట్ చేశారు.
"కళాత్మకంగా ఉండే పుష్పక విమానాన్ని’’ కూడా భయంకరమైన గద్దలా చూపించారని కొంత మంది విమర్శించారు.
"ఇది చాలా నిరుత్సాహకరంగా ఉంది. ఇదొక 500 కోట్ల కార్టూన్ సినిమాలా ఉంది. రావణాసురుడు దారుణంగా కనిపిస్తున్నారు. ప్రభాస్ యానిమేటెడ్ హాస్యం మాదిరిగా కాకుండా బాహుబలి తరహాలో కనిపించి ఉంటే బాగుండేది" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"రామాయణంలో హనుమంతుడు ఆదిపురుష్‌లో ముస్లిం" అంటూ నార్బర్ట్ ఎలెక్స్ అనే వ్యక్తి ట్వీట్ చేసారు.
హిందువులెవరూ మీసం లేకుండా గెడ్డం పెంచుకోరు" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సైఫ్ అలీ ఖాన్ "ఛంగీజ్ ఖాన్‌లా, ఔరంగజేబులా ఉన్నారు అంటూ మరి కొంత మంది విమర్శించారు. "మహా పండితుడి నుదుటిపై తిలకం ఎందుకు లేదు? హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకు అవమానిస్తున్నారు? అని మిర్రర్ నౌ ఛానెల్ తో మాట్లాడుతూ రాహుల్ బుఖార్ అన్నారు.
"సినిమా చూడకుండా నేనేమి వ్యాఖ్యానించను" అని టీవీ నటుడు బిందు ధారా సింగ్ అన్నారు.
"రావణాసురుడు దుష్టుడే కానీ, పిశాచి కాదు" అని అన్షుల్ సక్సేనా అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కొంత మంది యూజర్లు రావణుడు ఇలా ఉంటాడంటూ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు రావణాసురుడి పాత్రలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.
"ఆదిపురుష్ నిర్మాతలు రావణుడు రాక్షస రాజు కానీ ప్రపంచ డ్రాకులా అసోసియేషన్ అధిపతి కాదని తెలుసుకోండి" అంటూ ది ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"రావణుడు అహంకారే. కానీ, ఆయనకు బ్రహ్మ వరం, శివుడి ఆశీర్వాదంతో జ్ఞానంతో కూడిన అహంకారం ఉంది. ఆయన విస్తృతమైన లంకా రాజ్యానికి అధిపతి కావడంతో అహంకారి. ఆ అహంకారాన్ని ఎన్‌టీ రామారావు పోషించిన పాత్రలో ప్రతిబింబించారు. సైఫ్ నటించినట్లుగా రావణాసురుడు ఉన్మాది కాదు" అంటూ డాక్టర్ కిరణ్ కుమార్ కర్లాపు అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
‘‘విశ్రవ ఋషి పుత్రుడు, నాలుగు వేదాలను ఔపాసన పట్టిన, తాండవ స్తోత్రాన్ని రచించిన, రుద్ర వీణను వాయించిన రావణాసురుడు తన కంటే గొప్పగా వీణను వాయిస్తారని స్వయంగా శివుడే అంగీకరించిన రావణుడు బట్టతలతో ఉన్న గజనీ మహమూద్‌లా కనిపిస్తున్నారు" అంటూ ఆనంద్ రంగనాథన్ అనే రచయత, స్వరాజ్య పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ ట్వీట్ చేశారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"బాలీవుడ్ రావణ బ్రహ్మ పేరును రావణ్ ఖిల్జీ అని మార్చేసింది" అంటూ రాఘవ్ చతుర్వేది అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
‘అజెండాతోనే రావణుని పాత్రను చిత్రీకరించారు’
అయితే, రామాయణాన్ని ఎవరు చిత్రీకరించినా కూడా దానికి పూర్తి ఆమోదం ఎప్పుడూ రాలేదని విశాఖపట్నానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వేదుల మూర్తి అన్నారు. అనేక రామాయణాలు అందుబాటులో ఉండటమే దీనికి కారణం అని అభిప్రాయపడ్డారు. అయితే, గతంలో ఈ విమర్శలు రామాయాణాన్ని అధ్యయనం చేసిన వారి నుంచి వచ్చేవి. కానీ, సోషల్ మీడియా యుగంలో ఈ విమర్శలు పామరుల నుంచి వస్తున్నాయి" అని అన్నారు.
కవుల వర్ణన, సినిమాల్లో చిత్రీకరణ, ఇంట్లో చూసే రాముని ఫోటోల ప్రభావం కూడా పాత్రను ఆమోదించలేకపోవడానికి ఒక కారణం అని అంటారు.
సైఫ్ అలీ ఖాన్ రావణుని చిత్రీకరణ ఎజెండాతో చేసినట్లుగా కనిపిస్తోంది తప్ప, సృజనాత్మకతతో చిత్రీకరించినట్లుగా లేదు" అని వేదుల మూర్తి అన్నారు.

ఫొటో సోర్స్, OM RAUT/TWITTER
"రావణుడు వేదాలు, జ్యోతిషంలో నిష్ణాతుడు. బంగారు భవనాలు నిర్మించుకున్నవాడు. ఆయన అహంకారంతో మాత్రమే సీతను అపహరించారు. కానీ, రావణుడిని దుర్మార్గుడిలా, బూచాడిలా చూపించారు" అని విమర్శించారు.
"కధను, పాత్రలను వక్రీకరించకూడదు" అని అన్నారు.
ఈ సినిమా టీజర్‌లో గ్రాఫిక్స్ కూడా చాలా చౌకబారుగా ఉన్నాయనే విమర్శలు కనిపించాయి.
"గ్రాఫిక్స్ చిత్రీకరణను ఆధునిక తరాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్మించినట్లు అనిపిస్తోంది" అని అభిప్రాయపడ్డారు.
"యువతను ఆకర్షించేందుకు హాలీవుడ్ తరహాలో చిత్రీకరించినట్లు అనిపిస్తోంది. రాముడిని ఒక సూపర్ హీరోగా చూపించాలని దర్శకుని ప్రయత్నమై ఉంటుంది" అని అన్నారు.
ఆదిపురుష్ టీజర్ విడుదల తర్వాత సినిమాలో సీత పాత్ర నటించిన కృతి సనన్ గతంలో జేఎన్‌యూ గురించి చేసిన ట్వీట్ వైరల్ కావడం మొదలయింది.
ఆది పురుష్ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ నిర్మించారు. ఈ సినిమా జనవరి 12, 2023లో థియేటర్‌లో విడుదల కానుంది.
ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)