బాయ్‌కాట్ లైగర్: విజయ్ దేవరకొండ సినిమాకు బాయ్‌కాట్ ఎఫెక్ట్ ఏంటి... సోషల్ మీడియాలో ఎందుకీ ఆగ్రహం?

విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్ నడుస్తోంది

''నాకు బోలెడన్ని సమస్యలున్నాయి. నాకు భయమేస్తోంది. నా జీవితం ఓ సినిమాలాగ అయ్యింది. నా ముందు ఎన్నో సమస్యలున్నాయి. మా నాన్న ఏ పెద్ద హీరోనో, నిర్మాతో అయ్యుంటే బాగుండేది అప్పుడప్పుడు అనుకుంటుంటాను'' అని విజయ్ దేవరకొండ కొన్నేళ్ల కిందట పింక్ విల్లా అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

లైగర్ సినిమా త్వరలో విడుదల కానుండగా, విజయ్ దేవరకొండ అనూహ్యంగా బాయ్ కాట్ వివాదంలో చిక్కుకున్నారు. బాయకాట్ ట్రెండ్ మీద ఆయన చేసిన కామెంట్ల తర్వాత దాని ప్రభావం కొద్ది రోజుల్లో విడుదల కాబోయే ఆయన సినిమా మీద కూడా పడింది.

ప్రస్తుతం ట్విటర్‌లో బాయట్ లైగర్ ట్రెండింగ్‌లో ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ సింప్లిసిటీ మీద అనేక రీల్స్ పోస్ట్ అవుతున్నాయి. ఇందులో ఆయన స్లిప్పర్లు వేసుకోవడం, సాదాసీదా దుస్తులు వేసుకోవడం గురించి చాలామంది ప్రస్తావిస్తున్నారు.

ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారని వ్యాఖ్యలు చేస్తున్నారు.

బాయ్‌కాట్ లైగర్

ఫొటో సోర్స్, ANI

అయితే, బాయ్‌కాట్ ట్రెండ్ ఎవరు మొదలు పెట్టారో, ఎందుకు మొదలు పెట్టారో అర్ధంకావడం లేదన్న విజయ్ దేవరకొండ మన పని మనం చేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ సినిమా నిర్మాణ, నిర్వహణలో కరణ్ జోహర్ ఇన్వాల్వ్ కావడమే ఈ‘ బాయ్‌కాట్ లైగర్’ ట్రెండ్‌కు కారణం కావచ్చని సినిమా పరిశ్రమకు చెందినవారు అనుమానిస్తున్నారు.

ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు, సినిమా పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఆయనకు మద్ధతు తెలుపుతున్నారు.

విజయ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తని, సొంతబలంతో స్టార్ ఎదుగుతున్న ఆయనపై ఇలాంటి ప్రచారాల ద్వారా ఆయన కెరియర్ ను దెబ్బతీయవద్దని కోరుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్, మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్లు. విజయ్ ఎదుగుతున్న స్టార్. జనం ఆయనను ఇష్టపడుతున్నారు. బాహుబలితో ప్రభాస్‌లాగే, లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ జాతీయ స్థాయి నటుడు అవుతారు'' అని తెలుగు సినీ విమర్శకుడు భరద్వాజ్ అన్నారు.

విజయ్ దేవరకొండ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విజయ్ దేవరకొండ

లాల్ సింగ్ చడ్డా తర్వాత లైగర్ వంతు

బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్రెండ్ కొనసాగుతుండగానే, బాయ్‌కాట్ లైగర్ ట్రెండ్ మొదలైంది. లైగర్ సినిమా త్వరలో విడుదల కానుంది.

బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా గురించి ఇటీవల ఇండియా టుడే మేగజైన్‌తో మాట్లాడుతూ, సినిమాలు బాయ్‌కాట్ చేయడం వల్ల హీరో ఒక్కరే నష్టపోరని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.

''ఒక సినిమాను బహిష్కరిస్తే అది ప్రధాన స్టార్లకే కాదు, ఆ సినిమాతో అనుబంధం ఉన్న చాలా మందిపై కూడా ప్రభావం చూపుతుంది'' అని అన్నారు.

''సినిమా సెట్స్‌లో నటులు, నటీమణులు, దర్శకులతో పాటు వేలమంది పని చేస్తుంటారు. ఆమిర్ సినిమా తీశారంటే అది ఆయన ఒక్కరే తీసింది కాదు. రెండు మూడు వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మీరు ఆమిర్ సినిమాను బాయ్‌కాట్ చేస్తే ఆ కుటుంబాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఎందుకు మొదలైందో తెలియదు. కానీ అది జరుగుతోంది. దానివల్ల ఆర్ధికంగా దెబ్బ తగులుతోంది'' అని వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, జనగణమన: అవసరమైన ప్రశ్నలను రేకెత్తించిన సినిమా - ఎడిటర్స్ కామెంట్

ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత బాయ్ కాట్ లైగర్ ట్రెండ్ మొదలైంది. లైగర్ ఒక్కటే కాకుండా, యూజర్లు కరణ్‌జోహార్, అనన్య పాండేలను కూడా టార్గెట్ చేసుకున్నారు.

విజయవాడలో సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఆయన్ను ఈ విషయమై ప్రశ్నించగా ''మూడేళ్ల కిందట ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించినప్పుడు 'బాయ్‌కాట్ బాలీవుడ్' అనే ట్రెండ్‌ ఉండేది కాదు. మేం లాక్‌డౌన్‌లో షూటింగ్‌ ప్రారంభించాం. సినిమాని యావత్ భారతదేశానికి తీసుకెళ్లడంలో కరణ్ జోహార్‌ను మించిన వారు లేరని అప్పట్లో భావించాం'' అన్నారు విజయ్ దేవరకొండ.

'పాప్ డైరీస్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్ గురించి ప్రస్తావించగా...''బాయ్‌కాట్ చేసేవాళ్లను చేసుకోనివ్వండి. ఏం చేస్తాం. ఒక సినిమా తీస్తాం. చూడాలనుకునేవారు చూస్తారు. వద్దనుకునేవారు తర్వాత ఏ టీవీలోనో, ఫోన్‌లోనో చూస్తారు'' అన్నారు విజయ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)