Rebel Wilson: మహిళా ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో పడ్డ సినీ నటి.. వ్యక్తిగత సంబంధం బయటపెడతానన్న ఆస్ట్రేలియా పత్రిక తీరుపై విమర్శల వెల్లువ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ థెర్రీన్
- హోదా, బీబీసీ న్యూస్
సినీ నటి రెబెల్ విల్సన్‌కు ఒక మహిళతో కొత్త సంబంధం గురించి ఆస్ట్రేలియా వార్తాపత్రిక 'సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్' రాసిన కథనాలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ పత్రికను తప్పుపడుతూ విమర్శలు వెల్లువెత్తాయి.
రెబల్ విల్సన్ తనకు తన 'డిస్నీ ప్రిన్సెస్' దొరికినట్లు చెప్తూ తన కొత్త భాగస్వామితో సెల్ఫీని శుక్రవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
''నేను నా డిస్నీ ప్రిన్స్ (యువరాజు) కోసం ఎదురుచూస్తున్నానని నేను అనుకునేదాన్ని. కానీ ఇంతకాలం నాకు నిజంగా కావలసింది ఓ డిస్నీ ప్రిన్సెస్ (యువరాణి) కావచ్చు'' అని ఆ పోస్టులో ఆమె తెలిపారు.
అయితే.. వీరి సంబంధం గురించి ప్రపంచానికి తెలియక ముందే తమకు తెలుసునని, దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా విల్సన్‌కు రెండు రోజులు సమయం ఇచ్చామని చెప్తూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ శనివారం నాడు ఒక కథనం రాసింది.
ఆ సంబంధం గురించి బయటకు చెప్పాల్సిందిగా రెబల్ విల్సన్ మీద తాము ఒత్తిడి తెచ్చామనటాన్ని తిరస్కరిస్తూ.. తాము 'కేవలం ప్రశ్నలను అడిగాం' అని బదులిచ్చింది.
కానీ.. ఆ పత్రిక మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తులు తమ సంబంధాలను బయటకు చెప్పాలని ఒత్తిడి చేయటం ఆమోదనీయం కాదని ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ఉద్యమకారులు మండిపడ్డారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ఆస్ట్రేలియా నటి రెబల్ విల్సన్ వయసు 42 సంవత్సరాలు. బ్రైడ్స్‌మెయిడ్స్, పిచ్ పెర్ఫెక్ట్ తదితర సినిమాల్లో నటించారు.
ఆమె తన సంబంధం గురించి వెల్లడించటం ఆమె ఇష్ట ప్రకారం జరగలేదని, దానిని బయటపెడతామంటూ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఆమెకు రెండు రోజుల గడువు ఇచ్చి ఆమెపై ఒత్తిడి తెచ్చారని, ఇది దారుణమని అభివర్ణించిన ఒక ట్వీట్‌కు రెబెల్ విల్సన్ బదులిస్తూ.. ''ఇది చాలా కష్టమైన పరిస్థితి కానీ గౌరవప్రదంగా వ్యవహరించటానికి ప్రయత్నిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశారు.
లీజర్‌వేర్ డిజైనర్ రమోనా అగ్రుమాతో తన సంబంధం గురించి విల్సన్ చేసిన పోస్టుకు అభిమానులు, స్నేహితులు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ పోస్టుకు 17 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
కానీ ఆ మరుసటి రోజు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌లో వ్యాసకర్త ఆండ్రూ హార్నరీ ఒక వ్యాసం రాస్తూ.. వారిద్దరి సంబంధం గురించి తమ పత్రికకు ముందే తెలుసునని, గురువారం ఉదయం రెబల్ విల్సన్ ప్రతినిధిని తమ పత్రిక 'ఎంతో జాగ్రత్తతో గౌరవంతో' సంప్రదించిందని, ఈ అంశంపై వ్యాఖ్యానించాలని కోరిందని పేర్కొన్నారు.
''నిఖార్సైన ప్రపంచంలో, సెలబ్రిటీల స్వలింగ సంబంధాలను బయటకు చెప్పటం అనేది 2022లో అనవసరమైన విషయంగా ఉండాలి. ప్రేమ అంటే ప్రేమే. కదా?'' అని ఆ వ్యాసంలో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''రెబల్ విల్సన్‌కు తెలిసినట్లుగానే మనం నిఖార్సైన ప్రపంచంలో లేం. కాబట్టి మా మీడియా సంస్థ అత్యంత జాగ్రత్తతో, గౌరవంతో రెబల్ విల్సన్ ప్రతినిధులకు గురువారం ఉదయం ఈమెయిల్ పంపించింది. మేం ఒక్క పదమైనా ప్రచురించటానికి ముందు.. ఎల్ఏ లీజర్ వేర్ డిజైనర్ రమోనా అగ్రుమాతో ఆమె కొత్త సంబంధం గురించి వ్యాఖ్యానించటానికి ఆమెకు రెండు రోజుల (గడువు) ఇచ్చాం'' అని రాశారు.
కానీ తాము అడిగినట్లు వ్యాఖ్యానించటానికి బదులుగా ఆమె ''ఆ కథను ఎక్కువగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ రెబల్ విల్సన్‌ను విమర్శించారు. ''మేము గోప్యంగా, నిజాయితీగా అడిగిన ప్రశ్నలను ఆమె విస్మరించటం మా అభిప్రాయంలో నిరాశాజనకం''గా ఉందని వ్యాఖ్యానించారు.
ఆ పత్రిక పాత్రికేయ పద్ధతులను, ఆ వ్యాసపు స్వరాన్ని సోషల్ మీడియాలో విమర్శించిన వారిలో బీబీసీ విలేకరి మేఘా మోహన్ కూడా ఉన్నారు. ''2022లో ఒక వ్యక్తి తన సంబంధాన్ని బయటికి చెప్పాలంటూ ఒక పత్రిక రెండు రోజుల గడువు ఇచ్చిందనే వాస్తవం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను. బహుశా నేను చాలా అమాయకంగా ఉన్నానేమో. కానీ 90ల నాటి సంకుచిత పత్రికారంగం ఇలా ఉండేదని, అప్పటి నుంచి అత్యధిక జర్నలిస్టుల ప్రమాణాలు చాలా మారిపోయాయని నేను అనుకున్నా'' అని ఆమె రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆ పత్రికను ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ఉద్యమకారులు కూడా విమర్శించారు.
''సంబంధం గురించి బయటికి చెప్పటం అనేది చాలా వ్యక్తిగతమైన నిర్ణయం. బయటకు చెప్పాలా వద్దా, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఆ వ్యక్తి, పూర్తిగా తన సొంత విచక్షణతో తీసుకోవాల్సిన నిర్ణయం'' అని స్టోన్వాల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
''ఎల్‌జీబీటీక్యూ ప్లస్ వ్యక్తుల సంబంధాలను బయటకు చెప్పటం, బయటకు చెప్పాలని వారి మీద ఒత్తిడి తేవటం ఏమాత్రం సరికాదు. ఎల్‌జీబీటీక్యూ ప్లస్ జీవితాలు, సంబంధాలను సంచలనాత్మకంగా మార్చకుండా ఉండేలా మీడియా సంస్థలు జాగ్రత్త వహించాలి'' అని హితవుపలికారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే.. రెబెల్ విల్సన్ సంబంధం గురించి తమ పత్రిక బయటకు చెప్పలేదని, తాము ఏం ప్రచురించాలనే అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ సంపాదకుడు బెవాన్ షీల్డ్స్ పేర్కొన్నారు.
''ప్రతి రోజూ ఇతర పత్రికలు చేసినట్లుగానే మేం కేవలం ప్రశ్నలు అడిగాం. ప్రామాణిక విధానం మేరకు స్పందించటానికి ఒక తుది గడువును చేర్చాం'' అని చెప్పారు.
రెబెల్ విల్సన్ గత నెలలో పీపుల్ మేగజీన్‌తో మాట్లాడుతూ.. తను ఒక ఫ్రెండ్ ద్వారా కొత్త భాగస్వామిని కలిశానని చెప్పారు. కానీ వారి వివరాలు వెల్లడించటానికి తిరస్కరించారు.
''మేం కలవటానికి ముందు కొన్ని వారాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి అది చాలా మంచి మార్గం'' అని ఆమె పేర్కొన్నారు.
''ఆరకంగా అది కాస్త పాత పద్ధతి - చాలా రొమాంటిక్‌గా ఉంది'' అన్నారు.
రెబెల్ విల్సన్ గతంలో వ్యాపారవేత్త జాకబ్ బుష్‌తో సంబంధంలో ఉన్నారు.
వారివురూ కలిసి 2020 సెప్టెంబర్‌లో మొనాకోలో ఒక కార్యక్రమంలో తొలిసారిగా రెడ్ కార్పెట్ మీద కనిపించారు. కానీ ఆ మరుసటి ఏడాది ఫిబ్రవరిలో తాము విడిపోతున్నట్లుగా దాదాపు నిర్ధారించారు.
రెబెల్ విల్సన్ ఈ ఏడాది ఆరంభంలో లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాఫ్టా సినిమా అవార్డులకు హోస్ట్‌గా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి:
- పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













