RRR, NTR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రానుందా... సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్

ఫొటో సోర్స్, Facebook/RRR

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్‌ఆర్ఆర్ సినిమా మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఈసారి అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్.

2022కు సంబంధించి ఆస్కార్‌కు నామినేట్ అయ్యే సత్తా ఉన్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారంటూ అమెరికాకు చెందిన 'వెరైటీ' అనే వెబ్‌సైట్ చెప్పిందనేది 'ఆర్ఆర్ఆర్' తాజా ట్రెండ్‌కు కారణం.

ఇక అదే మ్యాగజీన్‌కు చెందిన ‘ఆస్కార్ ఎనలిస్ట్’ క్లేటన్ డేవిస్ అయితే 21 ఏళ్ల తరువాత భారత్‌కు 'ఆర్ఆర్ఆర్' రూపంలో ఆస్కార్ నామినేషన్ దక్కొచ్చని కూడా అంచనా వేశారు. దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశారు.

అంతేకాదు 'అవతార్' డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 'యాక్షన్ సెన్సిబిలిటీస్' ఈ సినిమాలో కనిపిస్తున్నాయంటూ పొగిడారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇప్పటికే ఈ సినిమాకు చాలా మంది హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి ప్రశంసలు వచ్చాయి.

స్కాట్ డెరిక్షన్(మార్వెల్ స్టూడియో: డాక్టర్ స్ట్రేంజ్) నుంచి జాన్ స్పయిత్స్(ది మమ్మీ, డ్యూన్) వరకు చాలా మంది 'ఆర్ఆర్ఆర్' సినిమాను మెచ్చుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'ఆర్‌ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఆ సినిమా బడ్జెట్ దాదాపు రూ.560 కోట్లు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన హిందీ వెర్షన్ అయితే ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఇండియా సినిమాగా నిలిచింది.

'గే లవ్'ను సినిమాలో చాలా బాగా చూపించారంటూ వెస్ట్రన్ కంట్రీస్‌ ఆడియెన్స్ స్పందించారు.

ఈ నేపథ్యంలోనే ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సౌండ్ ఇంజినీర్ రసూల్ పుకుట్టి, ఈ సినిమాను 'గే సినిమా' అనడం, దానికి బదులుగా కీరవాణి ఇచ్చిన సమాధానం వివాదంగా మారాయి.

ఆర్ఆర్ఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఆస్కార్... అనేవి ఇప్పుడు నార్త్ ఇండియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలతో అది మరికాస్త పెరిగింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్

ఫొటో సోర్స్, Facebook/RRR

భారత్ నుంచి 'ఆర్ఆర్ఆర్'ను పంపితే ఆ సినిమా 99శాతం ఆస్కార్‌కు నామినేట్ కావొచ్చని 'బాలీవుడ్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ అన్నారు.

'మార్వెల్ సినిమా కంటే గొప్పగా ఆర్ఆర్ఆర్‌ను వెస్ట్రన్ ప్రజలు చూస్తున్నారు. యాక్షన్, డ్యాన్స్ వారికి బాగా నచ్చాయి. వాళ్లకు ఆర్ఆర్ఆర్ ఒక కిక్ ఇచ్చింది.

ఆ సినిమాను మనం ఒక విధంగా చూస్తే వెస్ట్రన్ ప్రజలు దాన్ని మరొకలా చూశారు. భారత్‌ నుంచి RRRను పంపితే 99శాతం అది ఆస్కార్‌కు నామినేట్ కావొచ్చు. హాలీవుడ్‌ ప్రపంచంలో అది సృష్టించిన క్రేజ్ అలాంటిది' అని ఆయన అన్నారు.

అయితే వ్యక్తిగతంగా తనకు ఆర్ఆర్ఆర్ సినిమా అంటే అంతగా నచ్చ లేదని అన్నారు అనురాగ్ కశ్యప్.

ఇక 'కశ్మీర్ ఫైల్స్' సినిమాను ఆస్కార్ కోసం పంపకూడదని ఆయన చెప్పారు.

అనురాగ్ కశ్యప్ చేసిన ఈ వ్యాఖ్యల మీద ఆ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. కశ్మీరీ పండిట్ల జాతి హననాన్ని వ్యతిరేకించే బాలీవుడ్ లాబీ, కశ్మీర్ ఫైల్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టిందని ఆయన విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

લાઇન

భారత్ నుంచి ఆస్కార్‌కు సినిమాలను ఎలా నామినేట్ చేస్తారు

ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎఫ్ఐ), భారత్‌ నుంచి ఆస్కార్‌కు సినిమాలను పంపుతుంది. ప్రతి ఏడాదీ ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో ఎంట్రీని పంపుతారు.

సమర్పించాల్సిన డాక్యుమెంట్స్

  • భారత్, విదేశాల్లో(అమెరికా కాకుండా) విడుదలైన తేదీలు
  • కోవిడ్-19 వల్ల సినిమా థియేటర్లు మూతపడి ఉంటే విడుదలైన ఓటీటీ ప్లాట్ ఫాం పేరు, తేదీ
  • సెన్సార్ సర్టిఫికేట్ కాపీ
  • ఇంగ్లిష్‌లో సినిమా గురించి చిన్న సారాంశం
  • సినిమా నటులు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర విభాగాల నిపుణుల జాబితా
  • జీఎస్‌టీ నెంబరు
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ తేజ్, రాజమౌళి

ఫొటో సోర్స్, Facebook/RRR

લાઇન

ఆస్కార్ నిబంధనలు

  • సినిమా తీసిన దేశంలో విడుదల కాకపోయినా ఇతర దేశాల్లో విడుదలైనా ఎంట్రీకి పంపొచ్చు. కాకపోతే కనీసం వారం రోజులు వరుసగా సినిమా ఆడి ఉండాలి.
  • కనీసం వారం రోజులు వరుసగా థియేటర్లలో సినిమా ఆడి ఉండాలి. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్‌లకు లాభాలు వచ్చి ఉండాలి.
  • 35ఎమ్‌ఎమ్ లేదా 70ఎమ్ఎ ఫిలిం అయి ఉండాలి.
  • 24 లేదా 48 ఫ్రేమ్స్ ప్రొగ్రెసివ్ స్కాన్ డిజిల్ సినిమా ఫార్మెట్‌లో ఉండాలి
  • కనీసం 2048x1080 రెజల్యూషన్ ఉండాలి
  • థియేటర్లలో విడుదల కాకముందే... టీవీ, డీవీడీ, ఆన్‌లైన్, ఇన్‌ఫ్లైట్ ఎయిర్‌లైన్ డిస్ట్రిబ్యూషన్, నాన్-థియేటర్ పబ్లిక్ ఎగ్జిబిషన్... వంటి రూపంలో సినిమాను ప్రదర్శించకూడదు
  • సినిమా తీసిన దేశం తప్పనిసరిగా క్రియేటివ్ హక్కులను ధ్రువీకరించాలి.
  • ఒక దేశం నుంచి ఒక సినిమాను మాత్రమే పంపాలి.
લાઇન
oscar

విజేతను ఎలా ఎంపిక చేస్తారు?

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం నామినేషన్లను రెండు రౌండ్ల ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు.

అర్హత సాధించిన ఎంట్రీలను 'ది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ప్రిలిమినరీ కమిటీ' చూస్తుంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో కమిటీ సభ్యులు ఓటు వేస్తారు. అలా 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఆ తరువాత 'ది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం నామినేటింగ్ కమిటీ' ఆ 15 సినిమాలను చూస్తుంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో సభ్యులు ఓటు వేసి టాప్-5 సినిమాలను ఎంపిక చేస్తారు.

అకాడమీలోని యాక్టివ్, జీవిత కాల సభ్యులు మాత్రమే ఆ టాప్-5 సినిమాలను చూసి తుది ఓటు ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు 2022లో తీసిన సినిమాలను నవంబరు 15లోగా పంపాల్సి ఉంటుంది. డిసెంబరు 12న ప్రిలిమినరీ ఓటింగ్ మొదలు కానుండగా 2023 మార్చి 7న తుది ఓటింగ్ ముగుస్తుంది. మార్చి 12న నిర్వహించే వేడుకలో విజేతను ప్రకటిస్తారు.

వీడియో క్యాప్షన్, లీటర్ 80 కోట్ల రూపాయలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)