Cost Of Living: ‘Oil, Milk, Gas ఒకటేమిటి అన్ని ధరలూ పెరిగిపోయాయి’.. ధరల పెరుగుదలపై Hyderabadకు చెందిన ఈ గృహిణి ఏమంటున్నారంటే

వీడియో క్యాప్షన్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం.. ఓ మధ్యతరగతి ఇల్లాలిపై ఎలా ఉంది?

ఎవర్ని కదిలించినా, పది మాటల్లో కనీసం రెండు మూడైనా ఇప్పుడు పెరిగిన ధరల గురించే ఉంటున్నాయి.

పెట్రోల్, వంట నూనె, కరెంట్ బిల్, పాల ప్యాకెట్.. వస్తువు ఏదైనా పెరుగుదల అనే పాయింట్ మాత్రం కామన్. తినడమూ, ఖర్చు పెట్టడమూ మానలేము.

మరి ఈ అంశంపై ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది?

ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకుండా, ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలితో మాట్లాడి ధరల పెరుగుదల ఆమెను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేశాం.

రాజకీయ నాయకులు తరచూ మాట్లాడే, ధర్నాలు చేసే, గ్యాస్ సిలిండర్లు నెత్తిన పెట్టుకుని, ఎడ్ల బండిపై వెళుతూ చేసే ప్రదర్శనలన్నీ ఒకవైపు.. ఆర్టీసీ బస్సులో కూర్చునో, బైక్ పై వెళ్తూనో, షేర్ ఆటోలో నుంచి తొంగి చూసి ఆ ఆందోళనకు కారణం తెలుసుకుని నిట్టూర్చే మధ్య తరగతి, పేదలు మరోవైపు.

ఇంతకీ ధరల పెరుగుదల సామాన్య కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. ఈ విషయం కోసం ఒక కేస్ స్టడీగా హైదరాబాద్ కాచీగూడ ప్రాంతంలో ఉంటోన్న సునీత అనే మహిళతో మాట్లాడింది బీబీసీ.

ఆ వివరాలివీ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)