‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి అవమానం జరిగిందా? ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఆయనతో అగౌరవంగా ప్రవర్తించాయా

ఫొటో సోర్స్, THEKASHMIRFILES
- రచయిత, ప్రశాంత్ శర్మ
- హోదా, బీబీసీ డిస్‌ఇన్ఫర్మేషన్ యూనిట్
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి చెందిన ఒక వీడియో సందేశం, సోషల్ మీడియాతో పాటు న్యూస్ చానళ్లలో ప్రైమ్ టైమ్ చర్చనీయాంశంగా మారింది.
మే 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో రెండు నిమిషాల 14 సెకన్లు ఉన్న వీడియోను అగ్నిహోత్రి పోస్ట్ చేశారు.
తను పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రద్దు చేయడం గురించి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తన సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయనివ్వకపోవడం గురించి ఆ వీడియోలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీడియోలో అగ్రిహోత్రి మాట్లాడుతూ.... ''మీ అందరికీ తెలిసినట్లుగానే నేను ప్రస్తుతం యూరప్‌లో 'హ్యూమానిటీ టూర్'లో ఉన్నాను.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్ పార్లమెంట్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ప్రసంగించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించాయి.
నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకీ చేరుకున్నాక, చివరి నిమిషంలో... 'మీ సెషన్‌ను వీడియో రికార్డింగ్ చేయలేమని' వారు నాకు చెప్పారు. కొందరు పాకిస్తానీ, ముస్లిం విద్యార్థులు నా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వల్ల ఇలా జరిగింది. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుదారుని కాబట్టి వారు ఇలా చేశారు.
ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నేను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది. ప్రసంగించాల్సిందిగా కోరుతూ చాలా కాలం క్రితమే ఆక్స్‌ఫర్డ్ యూనియన్ నన్ను ఆహ్వానించింది.
కానీ, వారు చివరి నిమిషంలో నా ప్రసంగాన్ని రద్దు చేశారు. 'మే 31వ తేదీన పొరపాటున ఇద్దరి సెషన్లు బుక్ చేశాం. కాబట్టి మీ సెషన్‌ను 31కి బదులుగా జూన్ 1కి మార్చుతున్నాం' అని యూనివర్సిటీ వారు చెప్పారని వివేక్ అగ్నిహోత్రి వీడియోలో అన్నారు.
ఆయన వీడియోలో ఇంకా మాట్లాడుతూ... ''వారు నా కార్యక్రమాన్ని రద్దు చేశారు. కానీ, నిజానికి వారు హిందూ మారణకాండను, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మైనారిటీలుగా ఉన్న హిందు విద్యార్థుల గొంతును నొక్కేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఒక పాకిస్తానీయుడు. దయచేసి ఈ పోరాటంలో అందరూ నాకు మద్దతుగా నిలవండి'' అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ వీడియో, సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, ఇప్పుడు మీడియాలో కూడా ప్రధాన వార్తగా మారింది. ఈ అంశంపై దేశంలోని అనేక వార్తా చానళ్లు ప్రైమ్ టైమ్ చర్చను నిర్వహించాయి.

ఫొటో సోర్స్, YOUTUBE/GRAB
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అగ్నిహోత్రి కార్యక్రమాన్ని రద్దు చేసిన ఘటనను ఖండిస్తూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు.
ఈ మొత్తం అంశాన్ని బీబీసీ పరిశోధించినప్పుడు.... "ది కశ్మీర్ ఫైల్స్" సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి చేసిన వాదనలు పూర్తిగా నిజం కావని, తప్పుదారి పట్టించేలా ఉన్నట్లు తేలింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అసలు విషయం ఏంటి?
వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం 'హ్యూమేనిటీ టూర్'లో ఉన్నారు. దీని గురించి ఆయన మే 26వ తేదీనే తన సోషల్ మీడియాలో పోస్ట్ కార్డ్ న్యూస్ ద్వారా సమాచారం ఇచ్చారు.
ఆ పోస్ట్‌కార్డ్ న్యూస్ ప్రకారం... వివేక్ అగ్నిహోత్రి, మే 28 నుంచి జూన్ 26 వరకు యూరప్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఫొటో సోర్స్, VIVEK AGNIHOTRI/FB
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఫిట్జ్ విలియం కళాశాల, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు ఉపన్యాసం ఇవ్వడానికి తనను ఆహ్వానించినట్లు వివేక్ అగ్నిహోత్రి వీడియోలో చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్‌ను వీడియో రికార్డింగ్ చేసేందుకు అనుమతించలేదని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యూనియన్ ఆయన షెడ్యూల్ ప్రోగ్రామ్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.
ఫిట్జ్ విలియం కళాశాల చేసిన ట్వీట్‌ను షేర్ చేస్తూ త్రిశాంత్ సిమ్లాయ్ అనే ట్విటర్ ఖాతాదారుడు ఒక ట్వీట్‌ను చేశారు. అందులో ''వివేక్ అగ్నిహోత్రి ప్రసంగం కేవలం ఒక ప్రైవేటు కార్యక్రమం మాత్రమే. దీనితో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి, ఫిట్జ్ విలియం కళాశాలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని కాలేజీ తరఫు నుంచి చాలాసార్లు ఆయన టీమ్‌కు తెలియజేశారు. అయినప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగానే దీన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కార్యక్రమంగా చిత్రీకరిస్తున్నారు'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వివేక్‌ను ఆహ్వానించలేదా?
మీరు చెప్పినట్లుగానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మిమ్మల్ని అధికారికంగా ఆహ్వానించిందా? లేదా సోషల్ మీడియా పేర్కొంటున్నట్లుగా ఒక ప్రైవేటు కార్యక్రమాన్ని మీరు అధికారిక కార్యక్రమం అని పిలుస్తున్నారా? అని వివేక్ అగ్నిహోత్రిని బీబీసీ అడిగింది.
దీనికి జవాబుగా, తన కేంబ్రిడ్జ్ కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దీనిపై మరింత వ్యాఖ్యానించడానికి అగ్నిహోత్రి నిరాకరించారు.
ఈ విషయంపై స్పష్టత కోసం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఫిట్జ్ విలియం కాలేజీని బీబీసీ సంప్రదించింది.

ఫొటో సోర్స్, WHATTSAPP/GRAB
ఈమెయిల్ ద్వారా బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఫిట్జ్ కాలేజీ కమ్యూనికేషన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ నికోలా జోన్స్ అధికారికంగా సమాధానాలు ఇచ్చారు.
"మే 30న జరిగే పూర్తి ప్రైవేట్, వాణిజ్యపరమైన ఈవెంట్ కోసం లార్డ్ రాణా ఫౌండేషన్ నుంచి కళాశాల బుకింగ్‌ను అంగీకరించింది. వివేక్ అగ్నిహోత్రి ప్రోగ్రామ్‌తో ఫిట్జ్ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు. కాలేజీ ట్విటర్ ఖాతా ద్వారా ఆయనకు ఈ సమాచారాన్ని కూడా అందించాం.''

వీడియో రికార్డింగ్ అడిగిన ప్రశ్నపై కూడా నికోలా బదులిచ్చారు. "ఏదైనా ప్రోగ్రామ్‌ను వీడియో రికార్డింగ్ చేయాలంటే ముందుగా అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ప్రోగ్రామ్ కోసం వివేక్ అగ్నిహోత్రి ఎలాంటి అనుమతి తీసుకోలేదు" అని చెప్పారు.
బీబీసీ చేసిన దర్యాప్తులో వివేక్ అగ్నిహోత్రిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వనించలేదని, రాణా ఫౌండేషన్ ప్రైవేట్ ఈవెంట్‌లో హాజరయ్యేందుకు ఆయన ఇక్కడికి వచ్చినట్లు తేలింది.
ఆక్స్‌ఫర్డ్ వెనుక కథ ఏంటి?
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మొదట తనను ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో మాట్లాడమని ఆహ్వానించిందని, చివరి నిమిషంలో ప్రోగ్రామ్‌ను రద్దు చేసి, తనకు చెప్పకుండానే సెషన్‌ను మే 31 నుంచి జూన్ 1వ తేదీకి మార్చిందని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు.
"ఇందిరా గాంధీ, భుట్టో వంటి నియంతలకు అనేక మంది ఆఫ్రికన్ ఛాందసవాదులకు ఈ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆతిథ్యమిచ్చింది. నేను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని వివేక్ వీడియోలో చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

ఫొటో సోర్స్, GRAB
ఈ విషయంపై బీబీసీ నేరుగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించింది. వివేక్ అగ్నిహోత్రి చేసిన వాదనల్లోని నిజం తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీఫెన్ బీబీసీకి మెయిల్ ద్వారా సమాధానాలు ఇచ్చారు. ''ఆక్స్‌ఫర్డ్ యూనియన్ అనేది ఒక ప్రైవేట్, స్వతంత్ర సంస్థ. అది ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భాగం కాదు. ఈ యూనియన్‌పై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఎటువంటి నియంత్రణ లేదు'' అని స్టీఫెన్ చెప్పారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ జవాబు ఇచ్చిన తర్వాత మేం ఆక్స్‌ఫర్డ్ యూనియన్ అధికారిక వెబ్‌సైట్‌ని తనిఖీ చేశాం. అది ఒక స్వతంత్ర చర్చా సంస్థ అని తేలింది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లోని చాలా మంది సభ్యులు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చారు. అయితే ఈ సంస్థ, యూనివర్సిటీకి చెందిన భాగం కాదు. ఇందులో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు.
వివేక్ అగ్నిహోత్రిని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఏ కార్యక్రమం కోసం ఆహ్వానించలేదని, ఆక్స్‌ఫర్డ్ యూనియన్ అనేది యూనివర్సిటీలో భాగం కాదని బీబీసీ పరిశోధనలో తేలింది. కాబట్టి యూనియన్ నుంచి వచ్చే ఏ ఆహ్వానాన్ని కూడా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారిక ఆహ్వానంగా పరిగణించలేం.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో బ్రిటన్ రాచ కుటుంబం సందడి
- ‘ప్రతి మసీదు కింద శివలింగాన్ని ఎందుకు వెతుకుతారు?’ - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
- మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
- ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది
- విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












