కశ్మీర్ ఫైల్స్ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరూ ఫ్రీగా చూస్తారు కదా.. ట్యాక్స్ ఫ్రీ ఎందుకు?: కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI
''కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పన్నులు మినహాయించాలని వాళ్లు చెప్తున్నారు. సినిమాను యూట్యూబ్‌లో పెట్టండి. ఉచితంగా చూస్తారు. ట్యాక్స్ ఫ్రీ ఎందుకు చేస్తున్నారు? మీకు అంత ఇష్టమైతే వివేక్ అగ్నిహోత్రికి చెప్పండి. యూట్యూబ్‌లో పెట్టేస్తారు. సినిమా అంతా ఫ్రీ అయిపోతుంది. జనమంతా ఒక్క రోజులోనే చూస్తారు. ట్యాక్స్ ఫ్రీ అవసరం ఏముంది?'' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
దిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. వివేక్ అగ్నిహోత్రి సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'కు దిల్లీలో పన్ను మినహాయించాలన్న డిమాండ్లకు కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.
కశ్మీరీ పండితుల వలస ఆధారంగా రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ రూ. 200 కోట్లకు పైగా ఆర్జించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''కొంతమంది కశ్మీరీ పండితుల పేరుతో కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తున్నారు. మీకు పోస్టర్లు అంటించే పని అప్పగిస్తున్నారు. మీ కళ్లు తెరవండి. మీరేం చేస్తున్నారో చూడండి. కశ్మీరీ పండితుల పేరుతో వాళ్లు కోట్లు సంపాదించుకున్నారు, మీరేమో పోస్టర్లు అంటిస్తూనే ఉండిపోయారు'' అని కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ సినిమా చూసి, దానిని మెచ్చుకున్నారు. అంతేకాదు.. జనం ఈ సినిమా చూడాలని కూడా ఆయన కోరారు.
ఈ అంశంపై కేజ్రీవాల్ స్పందిస్తూ, బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''మేం మీతో అబద్ధపు సినిమాల పోస్టర్లను అంటించనివ్వం. మీరు ఏం చేయాల్సివచ్చినా.. కనీసం ఈ సినిమాల ప్రమోషన్‌నైనా ఆపండి. మీరు రాజకీయాల్లో ఏదో చేద్దామని వచ్చారు. అబధ్దపు సినిమాల పోస్టర్లు ఎందుకు అతికిస్తున్నారు?'' అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, కేజ్రీవాల్ గతంలో నీల్ బట్టే సన్నాటా, సాండ్ కి ఆంఖ్ లాంటి సినిమాలకు దిల్లీలో పన్ను మినహాయింపు ఇచ్చారని బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ గుర్తు చేశారు.
ఆ సినిమాలను యూట్యూబ్‌లో పెట్టమని కేజ్రీవాల్ ఎందుకు సలహా ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, @AnupamPKher
కశ్మీర్ ఫైల్స్ సినిమా 1990లలో కశ్మీర్ లోయలో కశ్మీరీ పండితుల మీద హింసను, ఆ తర్వాత అక్కడి నుంచి వారు వలస వెళ్లిపోవటాన్ని చూపుతుంది. ఈ సినిమాను సమర్థిస్తున్న వారు.. కశ్మీరీ పండితుల వలసకు సంబంధించిన వాస్తవాలను ఈ సినిమా చూపుతోందని అంటుంటే.. ఈ సినిమా తీవ్ర హింసాత్మకంగా ఉందని, కేవలం సంఘటనలను ఒకవైపు మాత్రమే చూపుతోందని విమర్శకులు అంటున్నారు.
ఈ సినిమా ఏకపక్ష కథనాన్ని మాత్రమే ఇస్తోందని.. ముస్లింలను తప్పుగా చిత్రీకరిస్తోందనే ఆరోపణ కూడా ఉంది. ఈ సినిమా నుంచి కొన్ని దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దానిని కోర్టు కొట్టివేసింది.
ఈ సినిమాను చూడాలని చాలా హిందుత్వ సంస్థలు కూడా పిలుపునిచ్చాయి. హరియాణాకు చెందిన ఒక నాయకుడు ఇటీవల ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తామని ప్రకటించారు. కానీ అందుకు వివేక్ అగ్నిహోత్రి వ్యతిరేకించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
హరియాణాలోని రేవారిలో స్థానిక బీజేపీ నాయకుడు.. ఈ సినిమాను ఎల్‌సీడీ స్క్రీన్ల మీద ఉచితంగా ప్రదర్శిస్తామని ప్రకటించారు. దీనికి అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. ''సినిమాలను ఉచితంగా బహిరంగంగా ప్రదర్శించటం నేరం. దీనిని ఆపాలని ఖట్టార్‌జీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్‌ను ట్యాగ్ చేస్తూ వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.
''సృజనాత్మక వ్యాపారాన్ని, నిజమైన జాతీయతావాదాన్ని రాజకీయ నాయకులు గౌరవించాలి. సమాజ సేవ అంటే అర్థం.. ఒక సినిమాను టికెట్ తీసుకుని చట్టబద్ధంగా చూడటం'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. చాలా చోట్ల సినిమా హాళ్లను బుక్ చేసి మరీ జనానికి ఈ సినిమాను ఉచితంగా చూపిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ సినిమా రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించటంతో.. ఆ లాభాల్లో కొంత భాగాన్ని సినిమాకు ఆధారమైన సంఘటనలతో ప్రభావితులైన వారికి అందించాలని సోషల్ మీడియాలో డిమాండ్ వచ్చింది.
ఇదిలావుంటే.. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచీ తనకు బెదిరింపులు వస్తున్నాయని వివేక్ అగ్నిహోత్రి 'బాలీవుడ్ హంగామా'తో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులు తన ఆఫీస్‌లోకి ప్రవేశించి, తన మేనేజర్‌తో తప్పుగా ప్రవర్తించారని చెప్పారు.
ఆ సమయంలో తాను, తన భార్య అక్కడలేమన్నారు. ''ఈ సంఘటన గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే అలాంటి శక్తులకు ప్రచారం రాకూడదనేది నా అభిప్రాయం'' అని చెప్పారు.
ఈ సినిమాపై ఎంత తీవ్రంగా చర్చ జరిగిందో, అంత తీవ్రంగా వివాదమూ రేగింది. ఈ సినిమా నిర్మాత వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది.
ఇవి కూడా చదవండి:
- కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
- యుక్రెయిన్: భారీ రష్యా సైన్యాన్ని ఓ చిన్న పట్టణం ఎలా ఓడించి వెనక్కు తరిమింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









