#TheKashmirFiles సినిమాపై సోషల్ మీడియాలో ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది?

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్

ఫొటో సోర్స్, @AnupamPKher

    • రచయిత, భూమికా రాయ్
    • హోదా, బీబీసీ హిందీ ప్రతినిధి

''అదిసరే కానీ, కశ్మీరీ పండిట్లు తిరిగి తమ ఇళ్లకు, కశ్మీర్‌కు వెళ్లే అవకాశం లభిస్తుందా?''

తాజాగా విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మొత్తం కథను ఈ ఒక్క డైలాగ్ వివరిస్తోంది.

ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఈ సినిమా పేరు మార్మోగుతోంది.

కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లు వలసవెళ్లిపోవడంపై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ సినిమా మార్చి 11వ తేదీన విడుదలైంది.

నాలుగు రాష్ట్రాలు.. హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇవన్నీ బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలు.

దేశవ్యాప్తంగా చాలా థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ షోలు కూడా పడుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా కూడా మార్చి 11వ తేదీనే దేశవ్యాప్తంగా విడుదలైంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ సినిమాను కూడా తట్టుకుని 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీసు వద్ద మూడు రోజుల్లో రూ. 27 కోట్లకు పైగా రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో కొన్ని మాత్రమే బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. వాటితో పోలిస్తే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని పంపిణీదారులు అంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రాజకీయ ప్రకంపనలు..

చిత్రం విడుదలైన రెండో రోజు.. మార్చి 12వ తేదీన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

''ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం గొప్ప అనుభవం. అయితే, 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాను అభినందిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ప్రత్యేకం'' అని అభిషేక్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను వివేక్ అగ్నిహోత్రి రీట్వీట్ చేస్తూ.. ''భారతదేశంలో గొప్ప సవాలుతో కూడిన వాస్తవాన్ని చిత్రీకరించేందుకు మీరు చూపిన తెగువ అభినందనీయం. సినిమాకు అమెరికాలో వస్తున్న ఆదరణ.. నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రపంచం వైఖరి ఎలా మారుతోందో నిరూపిస్తోంది'' అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. కొందరు సినిమాను, వివేక్ అగ్నిహోత్రిని ప్రశంసిస్తే.. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

వీడియో క్యాప్షన్, ప్రధాని మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’

'కపిల్ శర్మ షో'లో ప్రమోషన్‌పై వివాదం

బాలీవుడ్‌లో కొత్త సినిమాలు విడుదలైనప్పుడు 'కపిల్ శర్మ షో' అనే ఒక కామెడీ షోలో వాటి ప్రమోషన్స్ జరుగుతుంటాయి. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాను కూడా అందులో ప్రమోట్ చేయాలని కొందరు ట్వీట్లు చేశారు. కాగా, ఆ షోలో ప్రమోషన్‌కు సంబంధించి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కపిల్ శర్మ భయపడ్డారని, అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేయట్లేదని చాలామంది యూజర్లు ట్వీట్లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

దీనికి కపిల్ శర్మ స్పందిస్తూ.. ''ఇది నిజంకాదు. ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో వన్‌సైడ్ స్టోరీలను ఎప్పుడూ నమ్మొద్దు' అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై ఒక యూజర్ స్పందిస్తూ.. 'మీ షోలోకి వివేక్ అగ్నిహోత్రిని ఆహ్వానిస్తారా? ఎస్, నో.. ఏదో ఒకటి నేరుగా చెప్పండి' అని అడిగారు.

దీనికి కపిల్ శర్మ స్పందించలేదు. కానీ, వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'నో' అని ట్వీట్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో కపిల్ శర్మను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఎంతో మంది యూజర్లు ఆ షోను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

సురేశ్ రైనాపైనా ట్రోలింగ్..

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు మద్దతుగా క్రికెటర్ సురేశ్ రైనా కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబం కూడా కశ్మీర్ నుంచి వలసవచ్చి, ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

అయితే, సురేశ్ రైనా ట్వీట్‌కు కొందరు యూజర్లు స్పందిస్తూ.. 'కశ్మీరీ పండిట్లకు జరిగిన దాన్ని మేం ఎప్పుడూ ఖండిస్తాం. కానీ గుజరాత్‌లో ముస్లింల ఊచకోతను మీరు ఖండిస్తారా? దీనిపై వివేక్ అగ్నిహోత్రి సినిమా తీస్తారా'' అని కొందరు ప్రశ్నించారు.

గుజరాత్‌లో ముస్లింల ఊచకోత, దిల్లీలో అల్లర్లను ప్రస్తావిస్తూ కొందరు ట్వీట్లు చేశారు.

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైన తర్వాత గుజరాత్ అల్లర్లపైనా చర్చ జరిగింది.

'వివేక్ అగ్నిహోత్రి తర్వాతి చిత్రం గోద్రా మారణకాండపై తీస్తారు. అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది' అంటూ కేఆర్కే ట్వీట్ చేశారు.

ఈ సినిమాపై సోషల్ మీడియాలో యూజర్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ సినిమాలో నిజాలు చూపించారని అంటుంటే మరికొందరు గోద్రా, అయోధ్య మొదలైనవాటిని ప్రస్తావిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఈ సినిమాకు అనుకూలంగా సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

'అమాయక ప్రజల రక్తంతో తడిసిన చరిత్ర.. మళ్లీ ఎన్నటికీ పునరావృతం కాదు' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ నటనకు సంబంధించి చాలా వింటున్నానని, త్వరలోనే సినిమా చూస్తానని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

ఐఎండీబీ 10 స్టార్ రేటింగ్..

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు ఐఎండీబీ 10కి 10 స్టార్ల రేటింగ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

అయితే, దీనికి సంబంధించిన సమాచారం ఇదీ.. అంటూ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఒక ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 11

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అనుపమ్ ఖేర్

ఫొటో సోర్స్, Twitter

కేరళ కాంగ్రెస్ ట్వీట్లు

'ది కశ్మీర్ ఫైల్స్' విడుదల నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల గురించి కేరళ కాంగ్రెస్ పలు ట్వీట్లు చేసింది.

''కశ్మీరీ పండిట్ల విషయంలో వాస్తవాలు: ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయిన గవర్నర్ జగ్‌మోహన్ సూచనతోనే కశ్మీరీ పండిట్లు సామూహికంగా లోయను వీడారు. బీజేపీ మద్దతుగల వీపీ సింగ్ ప్రభుత్వంలోనే ఈ వలసలు మొదలయ్యాయి''

''తీవ్రవాదుల దాడుల తర్వాత పండితులకు రక్షణ కల్పించడానికి బదులు బీజేపీకి చెందిన గవర్నర్ జగ్‌మోహన్.. వీరందరికీ జమ్మూలో పునరావాసం కల్పించాలని చెప్పారు. అయితే, పెద్ద సంఖ్యలో ఉన్న పండితుల కుటుంబాల్లో ఒక్కటి కూడా సురక్షిత వాతావరణం లేదని భావించి లోయను విడిచిపెట్టాయి''.

బీజేపీ దేశంలో హిందూ, ముస్లింల మధ్య విభజనను సృష్టిస్తోందని, కశ్మీరీ పండిట్ల సమస్యపై ఎన్నికల్లో లబ్ధి పొందాలని నకిలీ ఆగ్రహావేశాలను పెంచుతోందని కూడా కేరళ కాంగ్రెస్ ఆరోపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 12
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 12

కాగా, తాను చేసిన ట్వీట్లలో కొన్నింటిని కేరళ కాంగ్రెస్ తొలగించింది. బీజేపీ హేట్ ఫ్యాక్టరీ వీటిని అసందర్భంగా వాడుకుంటోందని, అందుకే తొలగించామని, అయితే.. తాము చేసిన ట్వీట్లలోని వాస్తవాలకు మాత్రం తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

''బీజేపీకి కశ్మీర్ అంశం హిందూ-ముస్లిం సమస్య. కాంగ్రెస్‌కు మాత్రం ఇది వేర్పాటు వాదులు, భారత్ వైపు నిలబడ్డ ప్రజల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటం. అందుకే ఈ యుద్ధంలో ప్రాణాలర్పించిన కశ్మీరీలందరినీ గౌరవించండి. కాంగ్రెస్ శాంతిని తెచ్చింది. బాధితులను తిరిగి వారి సొంత ప్రాంతాలకు తీసుకెళ్లింది. బీజేపీ మాత్రం తన రాజకీయాల కోసం దీనిని నాశనం చేసింది'' అని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

వీడియో క్యాప్షన్, ‘జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’

'కాంగ్రెస్‌ చరిత్రను అర్థం చేసుకోలేదు .. వారి చరిత్ర అంతా వక్రీకరణే' - బీజేపీ ఎంపీ ఆల్ఫోన్స్

కాంగ్రెస్ పార్టీ ట్వీట్లపై బీజేపీ ఎంపీ కేజే ఆల్ఫోన్స్ స్పందించారు.

''కాంగ్రెస్ పార్టీ చరిత్రను అర్థం చేసుకోలేదు. వాళ్ల దగ్గర ఉన్నదంతా వక్రీకరించిన చరిత్రే. మతం ఆధారంగా 1.5 లక్షల మంది కశ్మీరీ పండిట్లను అధికార పక్షం రెచ్చగొట్టడం వల్లనే లోయ నుంచి బయటకు పంపించిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ల మద్దతు ఉన్న ప్రభుత్వాలే. కాంగ్రెస్ పార్టీ, వాళ్ల మిత్రపక్షాలు కలిసి లోయలో కశ్మీరీ పండిట్లు ఉండలేని పరిస్థితులను సృష్టించాయి. అందుకే కశ్మీరీ పండిట్లు లోయను వదిలివెళ్లాల్సి వచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తోంది'' అని వార్తా సంస్థ ఏఎన్ఐఈతో మాట్లాడుతూ అన్నారు.

వీడియో క్యాప్షన్, కశ్మీరీ పండిట్లు: "అత్యంత దారుణ పరిస్థితుల నడుమ బతుకుతున్నాం’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)