కశ్మీరీ పండిట్లు: "అత్యంత దారుణ పరిస్థితుల నడుమ బతుకుతున్నాం’’
జమ్మూ నగరం వెలుపల పుర్ఖూలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్న వీళ్లంతా కశ్మీరీ పండింతులు. తమ కష్టాలు తీరాలని ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో వారు దైవాన్ని ప్రార్థిస్తున్నారు.
అయితే, వీళ్లు పాడుతున్న ప్రార్థనా గీతాలు వారి మాతృభాష అయిన కశ్మీరీలో లేవు. వీళ్లంతా జమ్మూలోని స్థానిక భాషైన డోగ్రీలో ప్రార్థనలు చేస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో తలెత్తిన హింస వాళ్లను జమ్మూకు వలస వచ్చేలా చేసింది.
తమ ఊళ్లను, నివాసాలను, పొలాలను, చివరకు తమ సంస్కృతిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు. చివరకు, నేటి తరానికి వారి మాతృభాష కూడా రాకుండా పోయింది. జమ్మూలో నివసిస్తున్న సుమారు 20 వేల మంది పండిట్లకు ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా తిరిగి తమ స్వస్థలానికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు.
లోయ నుంచి నిర్వాసితులై ఇక్కడికి వచ్చిన 40 వేల మంది కశ్మీరీ పండితుల భవిష్యత్తు సంగతేంటి, వారిని తమ స్వస్థలాలకు చేర్చే ప్రణాళిక ఏంటి అనే విషయాల గురించి ఎవరూ మాట్లడడం లేదు.
దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద గానీ, కేంద్రం వద్ద గానీ లేదు. అందుకే, కశ్మీరీ పండితుల సముదాయం అనేక పరిమితుల మధ్య, పేదరికంలో జీవించాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘జీవితంలో మొదటిసారి నేను ముస్లిం అని నాకు అనిపించింది‘
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి?
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)