ఇండియా క్షిపణి పాకిస్తాన్‌లో పడటంపై ఇమ్రాన్ ఖాన్: ‘తల్చుకుంటే ఏదైనా చేయగలం.. బంగాళాదుంప-టమోటా ధర తెలుసుకోవాలని రాజకీయాల్లోకి రాలేదు’

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

భారతదేశపు క్షిపణి ఒకటి పొరపాటున పాక్ భూభాగంలో పడటంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్పందించారు. పాకిస్తాన్ కోరుకుంటే దానికి ప్రతీకారంగా ఏదైనా చేయగలదని, కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని ఇమ్రాన్ ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు.

''మనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు భారత క్షిపణి కూడా వచ్చింది. మనం తల్చుకుంటే ఏదైనా చేయగలం'' అని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని హఫీజాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన అన్నారు.

''సరైనా మార్గంలో వెళుతున్న మన దేశం తనను తాను రక్షించుకోగలదు'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, కొండచిలువను దత్తత తీసుకున్న విశాఖ యువతి

అసలేం జరిగింది?

మార్చి 9న తమ మిసైల్ ఒకటి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోని మియాన్ చన్ను ప్రాంతంలో పడిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగిందని తెలిపింది.

''పాకిస్తాన్ భూభాగంలో పడిన ఒక హై స్పీడ్ ఆబ్జెక్ట్ భారత్ నుంచి వచ్చింది కావచ్చు'' అని పాకిస్తాన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అధిపతి మేజర్ బాబర్ ఇఫ్తికార్ మార్చి 10న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

''మెయింటెనెన్స్‌ సందర్భంగా పొరపాటు ఒక మిసైల్ ఫైర్ అయ్యింది. ఇది కేవలం సాంకేతిక సమస్యల వల్లే జరిగింది'' అని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'కూరగాయల ధరలు తెలుసుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదు'

ఇదే ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. ''బంగాళాదుంప-టమోటా ధర తెలుసుకోవాలని నేను రాజకీయాల్లోకి రాలేదు. దేశంలోని యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని నేను అర్ధం చేసుకున్నా'' అన్నారు.

''మీకు ఒక విషయం చెప్పాలి. నేను పాతికేళ్ల కిందట రాజకీయాలలోకి వచ్చేటప్పుడు, టమాటా ధర ఎంత, బంగాళదుంప ధర ఎంత అని తెలుసుకునేందుకు రాలేదు. ఒక జాతిని నిర్మించాలని వచ్చాను'' అన్నారు.

''నేను అసలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? అల్లా నాకు అన్నీ ఇచ్చాడు. జీవితంలో ఏది కోరుకుంటే అది ఇచ్చాడు. మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే మీరే దేశానికి భవిష్యత్తు'' అని యువతను ఉద్దేశించి అన్నారు.

''చెడుకు వ్యతిరేకంగా నిలబడితే తప్ప మనం ముందుకు సాగలేమని 25 ఏళ్లుగా నేను చెబుతూ వస్తున్నా'' అన్నారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వీడియో క్యాప్షన్, ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది

ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంలో భారత్ ప్రస్తావన

జాతి పిత మహమ్మద్ అలీ జిన్నా బానిసత్వంలో ఉన్న భారతదేశంలో స్వేచ్ఛను కోరుకున్న నాయకుడని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆయనను చూసి ముస్లింలంతా గర్వపడాలని వ్యాఖ్యానించారు.

యుక్రెయిన్ సంక్షోభం గురించి మాట్లాడుతూ భారత దేశాన్ని ప్రస్తావించారు ఇమ్రాన్ ఖాన్.

''రష్యాకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేయాలని యూరోపియన్ యూనియన్ రాయబారులందరూ ఇప్పుడే ఒక లేఖ రాశారు. ఇది అన్ని ప్రొటోకాల్స్‌కు విరుద్ధం. భారత్‌కు వాళ్లు అలా రాసే ధైర్యం చేస్తారా'' అని ఇమ్రాన్ ప్రశ్నించారు.

భారత బ్రహ్మోస్ క్షిపణులు (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత బ్రహ్మోస్ క్షిపణులు (ఫైల్ ఫొటో)

అవిశ్వాస తీర్మానంపై వ్యాఖ్యలు

ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రధానిని గద్దె దించాలంటే ప్రతిపక్షాలకు 272 ఓట్లు కావాలి.

69 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2018 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. వచ్చే ఏడాది దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

'మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నారు.

''వేటకు వచ్చిన ఈ మూడు ఎలుకలు పడగొడతాయో, లేక బలవుతాయో రాబోయే కాలంలో చూస్తారు'' అని ఖాన్ తన ప్రసంగం చివర్లో అన్నారు.

1947 నుంచే పాక్ నాయకులు సరైన మార్గంలో పయనించి ఉంటే ఈ రోజు ఎక్కడికో చేరుకునేవాళ్లమని కూడా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)