#BoycottHyundai #BoycottKia: కియా, హ్యుందాయ్ కార్లు కొనుగోలు చేయొద్దంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం

హ్యుందాయ్ షోరూమ్

ఫొటో సోర్స్, YURIKO NAKAO/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హ్యుందాయ్ షోరూమ్

పాకిస్తాన్‌లో కశ్మీర్ యూనిటీ డే సందర్భంగా దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీలైన హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్‌లకు సంబంధించిన పోస్ట్‌పై ఇండియాలో వివాదం చెలరేగుతోంది.

#BoycottHyundai హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ కంపెనీల కార్లను కొనుగోలు చేయవద్దంటూ కొందరు ఆన్‌లైన్‌లో హెచ్చరిస్తున్నారు.

హ్యుందాయ్ మోటార్స్ కియా మోటార్స్ మాతృ సంస్థ. పాకిస్తాన్‌లోని ఆ రెండు కంపెనీల యూనిట్లు ఫిబ్రవరి 5న కశ్మీర్‌కు సంబంధించిన పోస్ట్‌ను ట్విటర్‌లో పెట్టాయని, అందులో కశ్మీర్ స్వాతంత్ర్యానికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పాకిస్తాన్‌లో పెట్టిన పోస్టుల వ్యవహారం ఇండియా దాకా రావడంతో, ఈ రెండు సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కియా, హ్యుందాయ్‌లను బహిష్కరించాని కొందరు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.

అయితే, హ్యుందాయ్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో దీనిపై వివరణ ఇచ్చింది. హ్యుందాయ్ ఇండియాతో ఆ పోస్ట్‌ను ముడిపెట్టడం సరికాదని పేర్కొంది.

కియా మోటార్స్ హ్యాండిల్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ట్వీట్

ఫొటో సోర్స్, SOCIAL

ఫొటో క్యాప్షన్, కియా మోటార్స్ హ్యాండిల్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ట్వీట్

ట్వీట్‌లలో ఏముంది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కియా మోటార్స్ ట్వీట్ 'కియా మోటార్స్ క్రాస్‌రోడ్స్-హైదరాబాద్' అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చింది.

'కశ్మీర్ స్వేచ్ఛ కోసం మనమంతా కలిసికట్టుగా ఉందాం'' అని అందులో పేర్కొన్నారు.

ఇటు 'హ్యుందాయ్ పాకిస్తాన్' యూనిట్ అధికారిక హ్యాండిల్ నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది.

''మన కశ్మీరీ సోదరుల త్యాగాలను స్మరించుకుందాం. వారి పోరాటాన్ని కొనసాగించడానికి మద్ధతు ఇద్దాం'' అని ఉంది.

హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ట్వీట్

ఫొటో సోర్స్, SOCIAL

ఫొటో క్యాప్షన్, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ట్వీట్

ఈ రెండు ట్వీట్‌లపై ఇండియాలో అనేకమంది యూజర్లు మండిపడుతున్నారు. మీరు హ్యుందాయ్ పాకిస్తాన్ ట్వీట్‌లకు మద్ధితిస్తున్నారా అంటూ హ్యుందాయ్ ఇండియాను ట్యాగ్ చేస్తూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.

వారిలో చాలామంది హ్యుందాయ్‌ను బహిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ రెండు ట్విటర్ హ్యాండిల్స్ కంపెనీల అధికారిక హ్యాండిల్సా కాదా అన్న దానిపై స్పష్టత లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''హ్యుందాయ్, కియా కంపెనీలు కశ్మీర్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని అడుగుతున్నాయి. అంటే, నా కారును అమ్మేసే సమయం వచ్చింది'' అని జాక్ రెడ్డి అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రాటి హెగ్డే అనే యూజర్ హ్యుందాయ్ గ్లోబల్‌ను ట్యాగ్ చేసి "హ్యుందాయ్ గ్లోబల్, కశ్మీర్ విషయంలో మీరు ఒకపక్షం వైపు వెళ్లడంలో మీ ఉద్దేశం ఏంటి? ముస్లింలు హిందువులను ఊచకోత కోసిన ప్రదేశం అది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశంపై ప్రేమ ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి'' అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"హ్యుందాయ్ కారు కొనవద్దని నేను మీ అందరినీ కోరుతున్నాను. తొలిసారి ఒక బహిష్కరణ డిమాండ్‌కు నేను మద్దతు ఇస్తున్నాను. హ్యుందాయ్‌ని బహిష్కరించండి. వారికి మన జాతి మనోభావాల పట్ల గౌరవం లేదు'' అని అరుణ్ బోత్రా అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

''కార్ల తయారీ సంస్థ కియాను బహిష్కరించే సమయం వచ్చింది. కశ్మీర్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే ధైర్యం కియాకి ఎలా వచ్చింది?'' అని ది సెంచూరియన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

హ్యుందాయ్ మోటార్స్ దక్షిణ కొరియాకు చెందిన మోటార్ కార్ల తయారీ సంస్థ

ఫొటో సోర్స్, AVISHEK DAS/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMA

ఫొటో క్యాప్షన్, హ్యుందాయ్ మోటార్స్ దక్షిణ కొరియాకు చెందిన మోటార్ కార్ల తయారీ సంస్థ

హ్యుందాయ్ ఇండియా ఏమంటోంది

ఈ వ్యవహారంపై హ్యుందాయ్ ఇండియా క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ చేసింది.

'' హ్యుందాయ్ ఇండియా గత 25 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్‌కు కట్టుబడి ఉంది. బలమైన జాతీయవాద విలువలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో హ్యుందాయ్ ఇండియాతో లింక్ చేయడం దారుణం. హ్యుందాయ్ బ్రాండ్‌ కు ఇండియా రెండో ఇల్లు. బాధ్యతారహితమైన కమ్యూనికేషన్‌ను మేం సహించం. భారతదేశం పట్ల మా నిబద్ధత కొనసాగిస్తాం. భారత ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం'' అని ఒక అధికారిక ప్రకటనలో హ్యుందాయ్ ఇండియా పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఈ వివాదం తర్వాత, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ లాక్ అయ్యింది.

అయితే, హ్యుందాయ్ ఇండియా చేసిన ఈ ప్రకటన సరిపోదని బీజేపీ నేత కపిల్ మిశ్రా అన్నారు.

''హ్యుందాయ్ ఇండియా ఈ ప్రకటన ఇంకా అవమానకరం. ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నందుకు హ్యుందాయ్ భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి రద్దు చేయాలి.

కంపెనీపై దర్యాప్తు చేయాలి'' అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

మరికొందరు యూజర్లు కూడా హ్యుందాయ్ ఇండియా చేసిన ప్రకటనలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్షమాపణ అడిగినట్లుగా లేదని వ్యాఖ్యానించారు.

హ్యుందాయ్, కియా కంపెనీలకు భారతదేశం పెద్ద మార్కెట్

ఫొటో సోర్స్, AVISHEK DAS/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMAG

ఫొటో క్యాప్షన్, హ్యుందాయ్, కియా కంపెనీలకు భారతదేశం పెద్ద మార్కెట్

ట్వీట్‌లు మాయం

ఇక, కశ్మీర్ ఏక్తా దివస్‌ పై 'కియా మోటార్స్ క్రాస్‌రోడ్స్-హైదరాబాద్' యూనిట్ ట్విటర్ హ్యాండిల్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు కనిపించడం లేదు.

హ్యుందాయ్, కియా కార్లు భారతదేశంలో ప్రముఖ కార్ తయారీ సంస్థలు. విక్రయాల పరంగా హ్యుందాయ్ మోటార్స్ రెండో స్థానంలో ఉండగా, కియా ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఈ ఏడాది జనవరిలో హ్యుందాయ్ ఇండియా సుమారు 44 వేల కార్లు, కియా మోటార్స్ దాదాపు 19 వేల కార్లు అమ్మాయని ఇంగ్లీష్ మేగజైన్ ఇండియా టుడే పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)