'ఆర్టికల్ 370 సవరణ', జమ్మూ కశ్మీర్ విభజన.. ఏదో ఒక రోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం: అమిత్ షా

ఫొటో సోర్స్, RSTV
జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన, రిజర్వేషన్ల సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం సభ వీటిని ఆమోదించింది.
పునర్నిర్మాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జమ్ము కశ్మీర్ పుర్నిర్మాణ బిల్లుకు కూడా రాజ్యసభలో ఆమోదం లభించింది.
రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ ( రెండో సవరణ) బిల్లు 2019 రాజ్యసభలో ఆమోదం పొందింది.
ఈ బిల్లు జమ్మూ కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించినది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏదో ఒకరోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం-అమిత్ షా
హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో "చాలా మంది ఎంపీలు కశ్మీర్ ఎప్పటివరకూ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని అడిగారు. ఎప్పుడు సాధారణ పరిస్థితి నెలకొంటుందో, సరైన సమయం వస్తుందో అప్పుడు మేం జమ్ము-కశ్మీర్‌ను మళ్లీ రాష్ట్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా. దానికి సుదీర్ఘ కాలం పట్టచ్చు, కానీ ఏదో ఒక రోజు అది మళ్లీ రాష్ట్రం అవుతుంది" అన్నారు.
రోజంతా వివిధ పార్టీల వారు ఈ సవరణ బిల్లులపై తమ వాదనలు, అభిప్రాయాలు, అభ్యంతరాలను వినిపించారు. అనంతరం హోం మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు.
ఇందిరాగాంధీని రక్షించడానికే మీరు రాజ్యాంగ సవరణలు చేశారు: అమిత్ షా
జమ్ము, కశ్మీర్‌లో విద్యా హక్కు అమలు చేయకపోవడాన్ని అమిత్ షా ప్రస్తావించారు. ఒకవేళ రేపు లోక్‌సభ దీన్ని పాస్ చేస్తే జమ్మూ, కశ్మీర్‌లోని ప్రతి పిల్లవాడికీ రేపు రాత్రి నుంచి విద్యా హక్కు లభిస్తుంది.
"జాతి ప్రయోజనాల కోసమే మేం ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ మీరు ఇందిరాగాంధీని అలహాబాద్ కోర్టు తీర్పు నుంచి రక్షించడానికి రాజ్యాంగ సవరణలు తెచ్చారు" అని కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విమర్శలు చేశారు.
'ఆర్టికల్ 370, 35ఏ సవరణ' కశ్మీర్ లోయకు, కశ్మీర్‌కు, లద్ధాఖ్‌కు ప్రయోజనం కలిగిస్తుందని షా అన్నారు.
'ఆర్టికల్ 370 సవరణ'తో పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ తమ శాఖలను ఏర్పాటు చేస్తాయి, దీంతో ఉపాధి లభిస్తుందని షా వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 సవరణతో కశ్మీరీ పండిట్ల సంబరాలు
దేశం 70 ఏళ్లుగా వేచిచూసింది- నిర్మలా సీతారామన్
'ఆర్టికల్ 370ని తొలగించడం'పై రాజ్యసభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం గత 70 ఏళ్లుగా దీనికోసం వేచిచూస్తోంది అన్నారు.
"మాలో చాలా మంది సభ్యులకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి చాలా సంతోషంగా ఉందని ఉదయం నుంచీ సందేశాలు అందుతున్నాయి. గణనీయమైన చర్చల ఫలితమే ఈ కీలక అడుగు" అన్నారు.
"మేం మా మ్యానిఫెస్టోలో కూడా 'ఆర్టికల్ 370ని సవరణ' చేయాల్సిన అవసరం గురించి ప్రస్తావించాం. అందుకే ఇది మ్యాజిక్ షోలో మాయా టోపీ నుంచి కుందేలు తీసినట్లేం జరగలేదు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సాహసోపేత నిర్ణయం- అడ్వాణీ
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ ఆర్టికల్ 370ని తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని 'సాహసిక చర్య'గా చెప్పారు.
అడ్వాణీ ఒక ప్రకటనలో "ఆర్టికల్ 370ని తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయంతో నాకు సంతోషంగా ఉంది. దేశ సమగ్రతను బలోపేతం చేసే దిశగా దీనిని ఒక సాహసోపేత అడుగుగా నేను భావిస్తున్నాను" అన్నారు.
ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను అభినందించారు. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ శాంతి, శ్రేయస్సు, పురోగతి కోసం ప్రార్థిస్తానని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
చరిత్ర మీరు చేసింది తప్పని నిరూపిస్తుంది-చిదంబరం
కాంగ్రెస్ నేత పి.చిదంబరం రాజ్యసభలో "ఒక్క క్షణం పాటు మీరు విజయం సాధించామని అనుకోవచ్చు. కానీ మీరనుకుంటున్నది తప్పు. చరిత్ర మీ నిర్ణయం తప్పని నిరూపిస్తుంది. సభ ఈరోజు ఎంత పెద్ద తప్పు చేసిందో రాబోవు తరాలు గుర్తు చేసుకుంటాయి" అన్నారు.
భారత ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పాక్ పాలిత కశ్మీర్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ప్రమాదకరమైన ఆట- పాకిస్తాన్
జమ్ము-కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ స్పందించింది.

ఫొటో సోర్స్, Getty Images
దీనిపై మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ "ఆర్టికల్ 370 సవరణ చేయడంపై భారత్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడింది. దీని ప్రభావం మొత్తం ప్రాంతంపై చాలా భయానకంగా ఉండచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఈ అంశాన్ని పూర్తిగా చర్చల వైపు తీసుకెళ్లాలని భావించారు. కానీ భారత్ తన నిర్ణయంతో ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. కశ్మీరీలను ఇప్పటికే రాష్ట్రంలో బంధించారు. మేం ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాం. ఇస్లామిక్ దేశాలకు కూడా దీని గురించి చెప్పాం. ముస్లింలు అందరూ కలిసి కశ్మీరీల సంక్షేమం కోసం ప్రార్థనలు చేయాలి. పాకిస్తాన్ పూర్తిగా కశ్మీరీలకు అండగా ఉంటుంది" అన్నారు.
పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందని, కశ్మీర్ ఒక అంతర్జాతీయ సమస్య అని ఖురేషీ బీబీసీతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కశ్మీర్ విభజన బిల్లు రాజ్యాంగబద్ధమే
ఇది రాజ్యాంగబద్ధంగానే జరిగింది. ఇందులో చట్టపరంగా గానీ, రాజ్యాంగపరంగా గానీ ఎలాంటి లోపాలూ లేవు. దీనిపై ప్రభుత్వం చాలా లోతైన అధ్యయనం చేసింది. ఇది రాజకీయ నిర్ణయమా అనే విషయంపై నేనేమీ చెప్పలేను అని రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఇదో సాహసోపేత నిర్ణయం
మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మేం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. జమ్మూ, కశ్మీర్‌తో సహా మొత్తం దేశ ప్రయోజనాలకు ఇది చాలా అవసరం. వ్యక్తిగత, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అంతా ఈ చర్యను సమర్థించాలి.
ఎన్డీయేలో విభేదాలు
"ఆర్టికల్ 370 సవరణ అనేది ఎన్డీయే అజెండా కాదు, ఇది కేవలం బీజేపీ అజెండా. దీనికి మద్దతిచ్చే ప్రశ్నే లేదు" అని జనతాదళ్ (యు) నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
మద్దతు పలికిన కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు. జమ్మూ, కశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం మద్దతునిస్తున్నాం. ఈ చర్య జమ్మూ, కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం. అని ట్వీట్ చేశారు.
మరోవైపు ఇది రాజ్యాంగంలో చీకటి రోజు అని కాంగ్రెస్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో 'ఆర్టికల్ 370 సవరణ' తీర్మానం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెడుతూ, 'ఆర్టికల్ 370 సవరణ' తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. అలాగే రిజర్వేషన్ల బిల్లుపై చర్చను ప్రారంభించారు. కశ్మీర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని చర్చిద్దామని ప్రతిపక్ష నాయకులకు ఆయన సూచించారు. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష ఎంపీలంతా వెల్‌లోకి వచ్చి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన నాలుగు అంశాల(బిల్లులు, తీర్మానం)పై ఉమ్మడిగా చర్చ జరుగుతుందని, ఓటింగ్ మాత్రం విడివిడిగా జరుగుతుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Rajya sabha
జమ్మూ కశ్మీర్ విభజన
అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్, చట్టసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్‌లను ఏర్పాటు చేసేందుకు అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు.
అందులో.. ‘‘జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్ ప్రాంతం ప్రజలు ఎంతో కాలంగా కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇవ్వాలని కోరుతున్నారు. వారి ప్రయోజనాలు నెరవేర్చేందుకు చట్టసభ లేని లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది.
అంతర్గత భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలోను జమ్మూ మరియు కశ్మీర్‌కు చట్టసభ కలిగిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది.’’
'ఆర్టికల్ 370 సవరణ'కు ప్రతిపాదన
ఈ నినాదాల మధ్యనే జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు బిల్లును ప్రవేశపెడుతున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అదేవిధంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 'ఆర్టికల్ 370ను సవరణ' చేసేందుకు కూడా అమిత్ షా సభ అనుమతి కోరారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 లో ఉన్న ప్రధానమైన ప్రొవిజన్స్‌ను సవరణ చేస్తూ అంటే ప్రధానంగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ప్రొవిజన్స్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఫొటో సోర్స్, President of India
‘నెహ్రూ, కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుతున్నాం’
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 370' నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అని, దానిని అమిత్ షా సరిదిద్దుతున్నారని చెప్పారు.
కాగా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.
‘బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేసింది’ - గులాంనబీ ఆజాద్
రాజ్యసభలో చారిత్రక సందర్భం ఇదని, ప్రతి రోజూ సభా వ్యవహారాలు జరుగుతున్నట్లుగా కాకుండా చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు.
కశ్మీర్‌ను భారత్‌లో కలిపేందుకు, భారత్‌తో ఉంచేందుకు గత 70 ఏళ్ల కాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సామాన్య పౌరులు, భద్రతా దళాల సిబ్బంది తమ ప్రాణాలు అర్పించారని, ప్రతి సందర్భంలోనూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు, ఆ ప్రాంతాల ప్రజలు భారత్‌కు మద్దతుగా నిలిచారని చెప్పారు.
రాజ్యసభలో రాజ్యాంగాన్ని చించేస్తూ ఇద్దరు, ముగ్గురు ఎంపీల ప్రవర్తనను తాను ఖండిస్తున్నానని ఆజాద్ అన్నారు. అయితే, బీజేపీ మాత్రం రాజ్యాగాన్ని హత్య చేసిందని, ప్రజాస్వామ్యాన్ని చించేసిందని విమర్శిస్తూ వాకౌట్ చేశారు.
కేంద్ర కేబినెట్ భేటీ
ఉదయం 9.30 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైన కేంద్ర మంత్రి మండలి సమావేశం 10.15 నిమిషాలకు ముగిసింది. అంతకు ముందు అమిత్ షా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో కూడా భేటీ అయ్యారు.
రాజ్యసభ జీరో అవర్ వాయిదా
రాజ్యసభలో జీరో అవర్ రాజ్యసభ ఛైర్మన్ వాయిదా వేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈరోజు అత్యవసర లెజిస్లేటివ్ బిజినెస్ ఉన్నందున జీరో అవర్ వాయిదా వేసి, చట్టపరమైన ఆ కార్యకలాపాల తర్వాత జీరో అవర్ చేపడతామని రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయించారని ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
కాగా, కశ్మీర్ అంశంపై చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్యసభలోని విపక్ష పార్టీలన్నీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయని, ఆయా పార్టీల నాయకులంతా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ఛాంబర్‌లో ఈ భేటీ జరుగనుందని, కశ్మీర్ అంశంపై చర్చ జరుగుతుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
లోక్‌సభలో కశ్మీర్ అంశంపై చర్చించాలని కోరుతూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానం ఇచ్చారు.
కేంద్ర క్యాబినెట్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు ఉదయం 9.30 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది.
లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ జరుగనుందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
కశ్మీర్‌లో అదనపు బలగాల మొహరింపు, 144 సెక్షన్ విధింపు, ముగ్గురు కీలక నాయకుల గృహ నిర్బంధం నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణంగా క్యాబినెట్ భేటీ ప్రతి బుధవారం జరుగుతుంటుందని, కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఈ భేటీని రెండు రోజులు ముందుగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
మోదీతో అమిత్ షా, దోవల్ భేటీ
క్యాబినెట్ భేటీకి ముందు ప్రధాని మోదీని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారని ఆంగ్ల వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి.
కాగా, క్యాబినెట్ భేటీకి ముందు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారని ఎన్డీటీవీ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
ఇవి కూడా చదవండి:
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్‌లో భూమి కొనుక్కోవచ్చు’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్ ఉద్రిక్తం: కొత్త సంక్షోభం రావచ్చన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్
- ‘పాకిస్తాన్... మీ జవాన్ల మృతదేహాలను తీసుకువెళ్ళండి‘ -భారత్
- తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?
- ముంపులో 350 గ్రామాలు.. మూడు రాష్ట్రాల మధ్య ఆగిపోయిన రాకపోకలు
- కశ్మీర్: గృహనిర్బంధం తర్వాత మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఎమన్నారు?
- కార్గిల్ స్పెషల్: 'వాళ్లను వదలద్దు...' ప్రాణాలు వదిలేస్తూ కెప్టెన్ మనోజ్ పాండే చెప్పిన చివరి మాట ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)