కశ్మీర్: శ్రీనగర్‌లో 144 సెక్షన్.. గృహ నిర్బంధంలో ప్రధాన నేతలు

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు.
రాష్ట్రంలోని ముగ్గురు ప్రధాన నేతలను ఇప్పటికే గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్‌లోన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను హౌజ్ అరెస్టు చేశారు.
మరోవైపు సాధారణంగా బుధవారం సమావేశమయ్యే కేంద్ర కేబినెట్ సోమవారం భేటీ అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీర్‌పై ఏదో అసాధారణ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆదివారం అర్ధరాత్రి మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను గృహనిర్బంధం చేశాక వారు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఒమర్ అబ్దుల్లా తన మొదటి ట్వీట్‌లో 'కశ్మీర్ ప్రజలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఏం జరగబోతుందో మనకు తెలియదు. అయితే, మనకు మంచిదనుకునేదే అల్లాహ్ చేస్తాడని నమ్ముతున్నా. అందరు క్షేమంగా ఉండాలి'' అన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'ఎన్నికైన మాలాంటి ప్రజాప్రతినిధులు శాంతి కోసం పోరాడుతుంటే మమ్మల్ని హౌజ్‌అరెస్టు చేశారు. కశ్మీర్ ప్రజల గొంతును ఎలా నొక్కుతున్నారో ప్రపంచమంతా చూస్తోంది' అని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''వాజ్‌పేయి బీజేపీ నేత అయినప్పటికీ కశ్మీర్‌లపై సానుభూతి చూపారు. వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన లేని లోటు మాకిప్పుడు కనిపిస్తుంది''అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
144 సెక్షన్ విధింపు.. మొబైల్ నెట్‌వర్క్‌పై నిషేధం
జమ్ముకశ్మీర్ అంతటా ఇప్పటికే 144 సెక్షన్ విధించారని శ్రీనగర్ జర్నలిస్టు మాజిద్ జహంగీర్ తెలిపారు. విద్యాసంస్థలను మూసివేసినట్లు చెప్పారు.
మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్‌ను కూడా నిషేధించనట్లు తెలిపారు.
శ్రీనర్‌లోని నిట్‌లో ఉన్న విద్యార్థులను స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు వచ్చాయి. అక్కడ చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు.
కశ్మీర్ లోయలో ఉన్న పర్యటకులు కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.
వారం కిందట ఉగ్రప్రమాదం పొంచిఉందనే కారణంతో అమర్నాథ్‌కు వెళ్లిన యాత్రికులను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని కేంద్ర ఆదేశించింది.
ఇవి కూడా చూడండి:
- న్యాయం కోసం 26 ఏళ్లుగా..
- కశ్మీర్ యువత మిలిటెన్సీ బాట ఎందుకు పడుతోంది?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








