కశ్మీర్ ఉద్రిక్తం: కొత్త సంక్షోభం రావచ్చన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరు ప్రాంతీయ సంక్షోభానికి కారణమయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి అమాయక పౌరులపై భారత్ క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పుగా దీన్నిచూడాలని ఐరాస భద్రత మండలిని ఆయన అభ్యర్థించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, ఎల్ఓసీ వద్ద క్లస్టర్ బాంబుల వాడకం గురించి పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్ జరిపిన కాల్పుల్లో తమ పౌరులు ఇద్దరు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పాక్ ఆరోపించింది.
ఎల్ఓసీ వెంబడి నివసిస్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తోందని, క్లస్టర్ బాంబుల వాడకం ఆయుధాల వినియోగానికి సంబంధించి 1983లో కుదిరిన ఐరాస ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజల బాధలను దూరం చేయాల్సిన సమయం వచ్చింది. ఐరాస భద్రత మండలి తీర్మానాల ప్రకారం వారికి స్వీయ నిర్ణయాధికారం కల్పించాలి. కశ్మీర్ విషయంలో శాంతియుత పరిష్కారమే దక్షిణాసియా శాంతిభద్రతలకు దారి తీస్తుంది'' అంటూ మరో ట్వీట్ చేశారు.
కశ్మీర్ విషయంలో భారత్, పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ముందుకు వచ్చారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
భారత్ దుందుడుకు చర్యలతో పరిస్థితులు మరింత దిగజారుతున్నందున ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.
గత నెలలో ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ మధ్యవర్తిత్వ ప్రతిపాదన చేశారు. పాకిస్తాన్ దీన్ని స్వాగతించగా, భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Reuters
కశ్మీర్‌లో గందరగోళం
భారత్ అధీనంలోని కశ్మీర్‌లో భద్రత బలగాల మోహరింపులు పెరగడంతో గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది.
ఆ ప్రాంతం వదిలివెళ్లిపోవాలని ప్రభుత్వం సూచనలు చేయడంతో పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్రికులు తమ తమ ప్రాంతాలకు తిరుగుప్రయాణమయ్యారు.
ఈ పరిణామాలతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది.
కశ్మీర్లో ఇలాంటి పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం 1990ల నాటి పరిస్థితులను గుర్తుకుతెస్తోందన్నారు.
ముందెన్నడూ చూడని భయానక వాతావరణాన్ని కశ్మీర్ లోయలో చూస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
'మృతదేహాలు తీసుకెళ్లండి'.. 'అదంతా దుష్ప్రచారమే'
నియంత్రణ రేఖకు ఇటువైపు పడి ఉన్న పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను తీసుకువెళ్లాలని భారత్ ఆ దేశానికి సూచించినట్లు పీటీఐ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది.
పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ)కు చెందిన జవాన్లు జమ్మూకశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌లో దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని, బదులుగా భారత సైన్యం జరిపిన దాడిలో వారిలో ఐదుగురు నుంచి ఏడుగురు వరకూ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే, ఇదంతా భారత్ చేస్తున్న దుష్ప్రచారమని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. భారత దళాల అగత్యాలపై నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా...
- కశ్మీర్ యువత మిలిటెన్సీ బాట ఎందుకు పడుతోంది?
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- అమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- 'దంగల్' అమ్మాయి జైరా వసీం సినిమా రంగాన్ని ఎందుకు వదిలేసింది...
- Zomato: 'తిండికి మతం లేదు'.. 'మరి హలాల్ మాటేంటీ?'
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)